“సిట్టింగ్” షాక్…
భారాసా పార్టీకి చెందిన ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖ నాయక్ భర్త శ్యామ్ నాయక్ కాంగ్రెస్ లో చేరారు. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆయనను కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు.
భారాసా పార్టీకి చెందిన ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖ నాయక్ భర్త శ్యామ్ నాయక్ కాంగ్రెస్ లో చేరారు. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆయనను కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు.
దేశంలో మహిళలకు అన్ని రంగాల్లో33 శాతం రిజర్వేషన్ కావాలని ప్రధాని మోడీని డిమాండ్ చేసే కల్వకుంట్ల కవిత అదే విషయాన్ని అసెంబ్లీ అభ్యర్ధుల ఎంపికలో వాళ్ళ నాన్న కేసీఆర్ కి ఎందుకు చెప్పలేక పోయిందని మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబతా లో బి.ఆర్.ఎస్. మహిళలకు స్థానం కల్పించక పోవడం పై కవిత తెలంగాణ మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 119 స్థానాల్లో 7మంది మహిళలకు టికెట్…
ఆంధ్ర ప్రదేశ్ లో మాజీ మంత్రి , నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణ తమ్ముడి భార్య ప్రియ మరో వీడియో లీక్ చేశారు. బావ నారాయణ, భర్త సుబ్రహ్మణ్యం మానసికంగా వేధిస్తున్నారని, ఇంటికి కరెంట్, వాటర్ సరఫరా లేకుండా చేస్తున్నారని వాపోయారు.. అలాగే కొన్ని పత్రాలపై భర్త దొంగ సంతకాలు పెట్టారని, క్యాన్సర్ తో బాధపడుతున్న కారణంగా విజయవాడ వరకు రాలేకపోతున్నట్టు , ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు హైదరాబాద్ వస్తే ఈ మేరకు ఫిర్యాదు చేయనున్నట్టు…
యువత మనసులో “వెన్నెల”కాయిస్తు ఏందబ్బాయా… అంటూ యువత గుండెల్లో “యమదొంగ”గా చొరబడిదాదాపు పుష్కర కాలం పాటు తెలుగు సినీ అభిమానులను చూరగొన్న అమెరికా అందాల తార పార్వతీ మెల్టన్ తెరకు దూరమై చాలా కాలమైంది. ఆమె చీర కట్టినా, చిత్రమైన బట్టలు వేసినా వెండితెర యూత్ అంతులేని “జల్సా” చేస్తుందనడంలో సందేహం లేదు. “యమహో యమహా” అంటూ “అల్లరే అల్లరి” చేసి “దూకుడు”గా యువ ప్రేక్షకుల్ని ఒక “గేమ్” ఆడుకొన్న మెల్టన్ ఎందుకో తెరపైకి రావడం లేదు….
1. కోనేరు కోనప్ప, సిర్పూర్2. బాల్క సుమన్, చెన్నూర్ (SC)3. దుర్గం చిన్నయ్య, బెల్లంపల్లి (SC)4. నడిపెల్లి దివాకర్ రావు, మంచిర్యాల5. కోవ లక్ష్మి, ఆసిఫాబాద్ (ఎస్టీ)6. భూక్య జాన్సన్ రాథోడ్ నాయక్, ఖానాపూర్ (ST)7. జోగు రామన్న, ఆదిలాబాద్8. అనిల్ జాదవ్, బోత్ (ST)9. అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, నిర్మల్10. గడ్డిగారి విట్టల్ రెడ్డి, ముధోలే11. ఆశన్నగారి జీవన్ రెడ్డి, ఆర్మూర్12. మహమ్మద్ షకీల్ అమీర్, బోధన్13. హన్మంత్ షిండే, జుక్కల్ (SC)14. పోచారం శ్రీనివాస్…
రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే గులాబీ దండును ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. భారత రాష్ట్ర సమితి (బి.ఆర్.ఎస్.) తరఫున పోటీ చేయనున్న సుమారు 115 మంది అభ్యర్థుల జాబితాలను ప్రకటించారు. వివిధ కారణాల వల్ల నర్సాపూర్, జనగామ, నాంపల్లి, గోషామహల్ నియోజక వర్గాల్లో అభ్యర్థులను పెండింగులో ఉంచారు. ఎక్కువగా సిట్టింగులకే అధిక ప్రాధాన్యం ఇచ్చినప్పటికీ కొన్నిచోట్ల పక్కన పెట్టారు. ఆసిఫాబాద్, బోథ్, వైరా, ఉప్పల్, తాండూరు, వేములవాడ, మల్కాజిగిరి నియోజక వర్గాల్లో సిట్టింగులు గల్లంతు అయ్యారు. ఆయా…
ధృఢ సంకల్పంతో నింగిలోకి దూసుకెళ్ళిన చంద్రయాన్-3 చంద్రుని పై అడుగు పెట్టడానికి ఇంకా రెండు రోజుల గడువు మాత్రమే ఉంది. ఇప్పటి వరకు సాంకేతిక పరంగా అన్ని దశలూ విజయవంతంగా దాటుకుంటూ చందమామపై చక్కర్లు కొడుతున్న ల్యాండర్ ఇస్రో శాస్త్రవేత్తలకు చిత్రాల రూపంలో సందేహాలు పంపుతోంది. ల్యాండర్హ హాజార్డ్ డిటెక్షన్ అండ్ అవైడెన్స్ కెమెరా ఈ ఫొటోలు తీసిందని ఇస్రో తెలిపింది. చంద్రునిపై ల్యాండర్ సురక్షితంగా దిగేందుకు గుంతలు, బండరాళ్లు లేని ప్రదేశాన్ని గుర్తించేందుకు శాస్త్రవేత్తలకు ఈ…
మొన్నటి వరకూ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న సూర్యాపేట జిల్లా కావడమే ఒక చరిత్ర అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సూర్యాపేట జిల్లా కలెక్టరేట్, సమీకృత వ్యవసాయ మార్కెట్, జిల్లా ఎస్పీ కార్యాలయం, మెడికల్ కాలేజీ, భారాస జిల్లా పార్టీ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ అభివృద్ధి సూచికలో రాష్ట్రం మంచి స్థానంలో ఉండటం గర్వకారణం అన్నారు. రూ.100 కోట్లతో ప్రభుత్వ కార్యాలయ భవనాలు నిర్మించుకున్నామని, ఇంత అద్భుతమైన కలెక్టరేట్లు, పోలీసు…
అల్లూరి జిల్లా పాడేరు ఘాట్ రోడ్డు లో ఘోర రోడ్డు ప్రమాదం చోటచేసుకుంది.పాడేరు నుండి చోడవరం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఘాట్ రోడ్డు వ్యూ పోయింట్ వద్ద అదుపు తప్పి లోయలో నుండి పడిపోయినట్టు తెలుస్తోంది. బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నట్టు, ఇద్దరు చనిపోగా, పలువురు గాయపడ్డట్టు సమాచారం అందింది. పూర్తీ వివరాలు తెలియాల్సి ఉంది. తీవ్ర గాయాలయ్యలైన వారిని మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్ కి తరలించారు.
చంద్రుని పై పరిశోధనల కోసం రష్యా ప్రయోగించిన లూనా -2 కూలిపోయింది. చంద్రుడి దక్షిణ ధృవం వైపు భారత్ పంపిన చంద్రయాన్-3 కంటే ముందే చేరుకునేలా రష్యా అంతరిక్ష సంస్థ రాస్‌కాస్మోస్ లూనా-25 పేరుతో రూపొందించిన వాహక నౌకను ఈ నెల 11వ తేదీన చంద్రమండలం వైపు పంపింది. చంద్ర కక్ష లోకి ప్రవేశించన లూనా సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అక్కడే కూలిపోయింది. అన్నీ సవ్యంగా జరిగి ఉంటే మరో రెండు రోజుల్లో అంటే 22న లూనా…
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ భారత్ రాష్ట్ర సమితిలో (బి ఆర్ ఎస్)లో అసమ్మతి రాజుకుంటోందా? సిట్టింగ్ ఎమ్మెల్యేలు, గత ఎన్నికలలో టికెట్ ఆశించి భంగపడ్డ వారు తమ మనుగడ కోసం అధినాయత్వాన్ని సైతం లెక్కచేయకుండా భరిలోకి దిగవచ్చా? ఈ రెండు ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎన్నికలకు నాలుగు నెలాల ముందే రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో బి ఆర్ ఎస్ లో వర్గ పోరు గుప్పుమనడ అసమ్మతికి సంకేతంగా రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. దాదాపు అన్ని…
జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం లద్ధక్ సమీపంలోని బేరి ప్రాంతం వద్ద ఆర్మీ జవాన్లు ప్రయాణిస్తున్న వ్యాన్ లోయలో పడి 8 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనతో రంగారెడ్డి జిల్లా తంగళ్ళ పల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల్లో ఒక జవాను రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలం పరిధిలోని తంగెళ్లపల్లి గ్రామ పంచాయతీ లోని తిర్మాన్ దేవునిపల్లి గ్రామనికి చెందిన చంద్ర శేఖర్(30) కూడా ఉన్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన మల్లయ్య ,శివమ్మకు ముగ్గురు సంతానం. వారిలో…
హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ మీదుగా విఎస్టీ వరకు నిర్మించిన ఇనుప దిమ్మెల బ్రిడ్జిని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ ప్రారంభించారు.13 వేల టన్నుల ఇనుముతో సుమారు రెండున్నర కిలోమీటర్ల దూరం వరకు నిర్మించారు.
జాబిల్లి పై వడివడిగా దూసుకు పోతున్న చంద్రయాన్-3 ప్రయాణం విజయవంతంగా సాగుతోంది. చంద్రుని పై కాలు మోపడానికి ఇంకా కేవలం 25 కిలోమీటర్లు x 134 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది. దీంతో ల్యాండర్ మాడ్యుల్ చివరి దశ డీ – బూస్టింగ్ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసినట్టు ఇస్రో తెలిపింది. ఇప్పటి నుంచి అన్నీ సవ్యంగా సాగితే 23వ తేదీ సాయంత్రం 5.45 గంటలకు ల్యాండర్ చందమామ మీద అడుగు వేస్తుంది.