IMG 20230820 WA0008

జవాన్ కు నివాళి…

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం లద్ధక్ సమీపంలోని బేరి ప్రాంతం వద్ద ఆర్మీ జవాన్లు ప్రయాణిస్తున్న వ్యాన్ లోయలో పడి 8 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనతో రంగారెడ్డి జిల్లా తంగళ్ళ పల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల్లో ఒక జవాను రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలం పరిధిలోని తంగెళ్లపల్లి గ్రామ పంచాయతీ లోని తిర్మాన్ దేవునిపల్లి గ్రామనికి చెందిన చంద్ర శేఖర్(30) కూడా ఉన్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన మల్లయ్య ,శివమ్మకు ముగ్గురు సంతానం. వారిలో…

Read Full News
Screenshot 20230820 082933 Gallery

స్టీల్ బ్రిడ్జి…

హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ మీదుగా విఎస్టీ వరకు నిర్మించిన ఇనుప దిమ్మెల బ్రిడ్జిని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ ప్రారంభించారు.13 వేల టన్నుల ఇనుముతో సుమారు రెండున్నర కిలోమీటర్ల దూరం వరకు నిర్మించారు.

Read Full News
IMG 20230820 WA0004

వచ్చేస్తున్నా…

జాబిల్లి పై వడివడిగా దూసుకు పోతున్న చంద్రయాన్-3 ప్రయాణం విజయవంతంగా సాగుతోంది. చంద్రుని పై కాలు మోపడానికి ఇంకా కేవలం 25 కిలోమీటర్లు x 134 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది. దీంతో ల్యాండర్ మాడ్యుల్ చివరి దశ డీ – బూస్టింగ్ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసినట్టు ఇస్రో తెలిపింది. ఇప్పటి నుంచి అన్నీ సవ్యంగా సాగితే 23వ తేదీ సాయంత్రం 5.45 గంటలకు ల్యాండర్ చందమామ మీద అడుగు వేస్తుంది.

Read Full News
IMG 20230819 WA0063

వేడుకలో…

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ కుమారుడి వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

Read Full News
IMG 20230819 WA0056

బస్సు లోయలో పడి…

భారత్ సరిహద్దు లద్దాఖ్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఇక్కడి సమీపంలోని భేరి అనే ప్రాంతంలో ఆర్మీ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 9 మంది జవాన్లు మృతి చెందినట్టు సమాచారం. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read Full News
Screenshot 20230819 165247 WhatsApp 1

చందమామ పై…

ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతంగా కొనసాగుతోంది. చంద్రుడిపై దిగేందుకు చంద్రయాన్ మరో అడుగు దూరంలోనే ఉంది. ఈ క్రమంలో ఇస్రో ఆసక్తికరమైన చిత్రాలను విడుదల చేసింది. ఆగస్టు15న విక్రమ్ ల్యాండర్ తీసిన చంద్రుడి విజువల్స్, 17న ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ విక్రమ్ విడిపోయిన తర్వాత చంద్రుడిపై ల్యాండర్ తీసిన ల్యాండింగ్ ప్రాంత వీడియోలు ఇలా ఉన్నాయి.

Read Full News
20230703 135508

ఇది నిజమైతే…శుభవార్తే…!

హైదరాబాద్ జర్నలిస్టుల చిరకాల ఆశ నెరవేరే సూచనలు కనిపిస్తున్నాయి. వారికి ఇళ్ల స్థలాలు మంజూరు చేయడానికి ప్రభుత్వం సన్నద్ధం అవుతున్నట్టు సమాచారం అందుతోంది. సుమారు మూడు దశాబ్దాలుగా  హైదరాబాద్ లో పనిచేస్తున్న విలేకరులు ఇళ్ల స్థలాల కోసం ఎదురు చూస్తున్నారు. వీళ్లలో జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టు హౌసింగ్ సొసైటీకి లో సభ్యులకు 2007వ సంవ్సరంలో  అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం స్థలాలను కేటాయించింది. నిజాం పేట్ ప్రాంతంలో 32 ఎకరాలు, పేట్ బషీరాబాద్ లో 38 ఎకరాలు…

Read Full News
IMG 20230818 WA0012

“హాస్య బ్రహ్మ” ఇంట సందడి….

హైదరాబాద్ లోని ఓ ఫంక్షన్ హాలులో జరిగిన సినీ నటుడు బ్రహ్మానందం కుమారుడి వివాహానికి సీఎం కెసిఆర్ హాజరై వధూవరులను ఆశీర్వదించారు. మంత్రులు యర్రబెల్లి దయాకర్, గంగుల కమలాకర్, పలువురు సినప్రముఖులు హాజరయ్యారు.

Read Full News
IMG 20230818 WA0005

వన్య ప్రాణికి “మాఫియా” ముప్పు…!

తెలుగు రాష్ట్రాల్లో అడవుల నుంచి వన్య ప్రాణులు జనారణ్యంలోకి రావడానికి నానారకాల కారణాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలోని అదిలాబాద్,కరీంనగర్ జిల్లాల్లో, ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుపతి, శ్రీ శైలం తదితర జిల్లాల్లో పచ్చని చెట్ల అడవులను వదిలి కాంక్రీట్ జంగిల్ లోకి ఎందుకు వస్తున్నాయనే చర్యలు మొదలయ్యాయి. వన్య ప్రాణుల స్వభావాన్ని బట్టి చూస్తే అవి సాధారణంగా జనావాసాల మధ్యకి వచ్చే అవకాశం లేదు. తమ ఉనికికి ముప్పు వాటిల్లే బలమైన ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు మాత్రమే జన…

Read Full News
Screenshot 20230818 085059 Video Player

“నీళ్ళబాయి” దగ్గర…

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సమర్పణలో, గాయని సునీత తనయుడు ఆకాష్ హీరోగా నటిస్తున్న “సర్కారు నౌకరి” చిత్రం ఆడియో విడుదల అయింది. రాఘవేంద్ర రావు అభిరుచి తగ్గట్టు చిత్రీకరించిన “నీళ్ళాబాయి ” అనే పాట ఆకట్టుకునేలా ఉంది.

Read Full News
IMG 20230817 WA0034

“చిలుక” దొంగ….

ఉత్తరప్రదేశ్ లోని గజియాబాద్ లో రామచిలుకలను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.135 చిలుకలను ఒక డబ్బాలో కుక్కి బస్సు స్టేపిని ఉండే చోట దాచిపెట్టాడు. బస్సు నుంచి వచ్చే వేడికి కొన్ని, గాలి అందక మరికొన్ని కలిపి మొత్తం 125 చిలుకలు ప్రాణం విదిచాయి.

Read Full News
IMG 20230817 WA0033

బస్సులో “బాబు”…

ఆంధ్ర ప్రదేశ్ కొత్తపేట నియోజకవర్గం, ఆలమూరులో భవిష్యత్ కు గ్యారెంటీ ప్రచార కార్యక్రమంలో భాగంగా బస్సులో ప్రయాణించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మహిళలతో మాట్లాడారు. నిత్యావసర వస్తువుల ధరలు, ప్రభుత్వ పన్నుల పై మహిళలు తమ అవేదన వ్యక్తం చేశారు. మహిళలకు టీడీపీ ప్రకటించిన ఉచిత బస్సు ప్రయాణం పై హర్షం వ్యక్తం చేశారు.

Read Full News
IMG 20230817 WA0032

కడుపులో “కత్తెర”….

ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో దారుణం జరిగింది. స్వప్న అనే మహిళ ప్రసవం కోసం పెద్దాసుపత్రికి వెళితే, ఆమెకు ఆపరేషన్ చేసిన వైద్యులు కడుపులో కత్తెరను మరిచారు. బాధితరాలికి  కడుపు నొప్పి రావడంతో వైద్యుల నిర్వాకం బయట పడింది. స్వప్న కు తీవ్ర కడుపు నొప్పి కలగడంతో స్కాన్ చేయగా అసలు విషయం బయటపడింది. దీంతో మరోసారి ఆపరేషన్ చేసి కత్తెరను బయటకు తీశారు. దీనిపై హాస్పిటల్ సూపరింటెండెంట్ శశిధర్ ని ప్రశ్నించగా కడుపులో కత్తెర మరచిపోయిన విషయం నిజమేననిచెప్పారు….

Read Full News