జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టు హౌసింగ్ సొసైటీకి పేట్ బషీరా బాద్ లో ప్రభుత్వం కేటాయించిన 38 ఎకరాల స్థలాన్ని వెంటనే సొసైటీకి బదలాయించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన అమలు చేయడంలో ఇంతకాలం జరిగిన ఆలస్యం పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆ సొసైటీకి చెందిన సభ్యుల బృందం సుప్రీం కోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది మరో 10 రోజుల్లో ఏడాది కావస్తున్నందున ఆ తీర్పును, తమ స్థలాన్ని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా ఈ పిటిషన్ వేసినట్టు సభ్యులు స్పష్టం చేశారు. ముందు జాగ్రత్తగా సొసైటీ చొరవ చూపి పిటిషన్ వేస్తే బాగుండేదని, మరింత జాప్యం జరిగితే జరిగే పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్లినట్టు వివరించారు. సొసైటీకి చెందిన సభ్యుల మనోవేదన కూడా పిటిషన్ వేయడానికి కారణమని పేర్కొన్నారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని అంశాలను పిటిషన్ లో పొందుపరచినట్టు సభ్యులు తెలిపారు.