ఈ అంశం కీలకం…!

pet land 1

జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి చెందిన పేట్ బషీరాబాద్ లోని 38 ఎకరాల భుమిని దక్కించుకోవడానికి సొసైటీ సభ్యుల్లో కొందరు కోర్టుధిక్కార పిటిషన్ దాఖలు చేయడానికి డిల్లీ వెళ్ళడంతో కొత్త అంశాలు తెరపైకి వస్తున్నాయి. ప్రభుత్వం ఒకవైపు సుప్రీం కోర్టు తీర్పునకు అనుకూలంగా ఉన్నట్టు పురపాలక శాఖ మంత్రి కేటిఅర్ చెబుతున్నప్పటికీ, ప్రభుత్వం ఆలస్యం చేస్తోందనే ఆందోళనతో కొందరు సభ్యులు పిటిషన్ వేయడానికి డిల్లీ వెళ్ళిన విషయం తెలిసిందే. అయితే, పిటిషన్ దాఖలు చేయడంలో పేట్ బషీరాబాద్ స్థలం ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందనేది కీలకమని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ఆ స్థలంలో గానీ, ఆ స్థలం ఉన్న సర్వేనంబర్ లో గానీ ఎలాంటి వివాదం ఉన్నా, లేక కేసులు ఉన్నా సొసైటీ కి ప్రతికూలంగా మార వచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇప్పటి వరకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఇప్పటికే ఆ స్థలానికి సంబంధించి పదిహేను వరకు వివిధ రకాల కేసులున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం సుప్రీం కోర్టు తీర్పును అమలు చేయాలని నిర్ణయించుకుంటే దానికి ఉన్న విచక్షణాధికారంతో ఆయా కేసులను పరిష్కరించి, భూమిని సొసైటీకి అప్పజెప్పే అవకాశం ఉందని నిపుణులు వివరించారు. అందుకే డిల్లీ వెళ్ళిన సభ్యులు కేసు వేయడానికి ముందే భూమికి సంబంధించిన వాస్తవ పరిస్థితులను అక్కడి న్యాయవాదులకు క్షుణ్ణంగా వివరిస్తే బాగుంటుదని సొసైటీకి చెందిన కొందరు సభ్యులే సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *