వెంకన్న సన్నిధిలో “బండి”
కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బండి సంజయ్ కుటుంబ సమేతంగా తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బండి సంజయ్ కుటుంబ సమేతంగా తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఏర్పడే ప్రభుత్వ సహకారంతో ఉభయ తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి సాధించేలా వంతు కృషి చేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. తిరుమల శ్రీవారిని రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించి మనవడి మొక్కులు తీర్చుకున్నారు. వారికి ఆలయ అధికారుల స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలుకగా, అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి శేష వసంత సత్కరించారు. శ్రీవారి జ్ఞాపికను అందజేశారు. ఆలయం వెలుపల రేవంత్ రెడ్డి మీడియాతో…
ధనుర్మాసం రేపటితో ముగుస్తున్నందున తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 15 నుంచి సుప్రభాత సేవ పునః ప్రారంభం కానుంది. గత ఏడాది డిసెంబర్ 17న తెల్లవారుజామున 12.34 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభం కావడంతో శ్రీవారి ఆలయంలో సుప్రభాతం స్థానంలో గోదా తిరుప్పావై పారాయణం కొనసాగింది. జనవరి 14వ తేది ధనుర్మాస ఘడియలు పూర్తి కానుండడంతో 15 నుంచి యథాప్రకారం శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ నిర్వహిస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించ వలసిందిగా టీటీడీ…
భక్తిని చాటుకోవలసిన చోట బలుపు కనిపించింది. పవిత్ర తిరుమల కొండ మలుపుల్లో ఓ జంట అధికారుల కళ్ళు గప్పి డ్రోన్ కెమెరాను చంకన వేసుకుపోయింది. ఇందులో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది. తిరుమలలో విజిలెన్స్ నిఘా వైఫల్యానికి సాక్ష్యంగా నిలిచింది. అస్సాం కు చెందిన ఇద్దరు వ్యక్తులు ఘాట్ రోడ్డు 53వ మలుపు వద్ద నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్ సాయంతో తిరుమల కొండలను వీడియో తీశారు. తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే మొదటి ఘాట్ రోడ్డు లోని…
తిరుపతి ప్రధాని నరేంద్ర మోదీ ఆంద్రప్రదేశ్ పర్యటనలో భాగంగా తిరుపతి వచ్చారు. రేణిగుంట విమానాశ్రయంలో ఆయనకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వాగతం పలికారు.
మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు తిరుమామ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. సతీ సమేతంగా వచ్చిన అయన తలనీలాలు సమర్పించుకున్నారు.
త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఇంద్రసేనా రెడ్డి తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఆయనకు టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర రెడ్డి, ఎ.వి. ధర్మారెడ్డి స్వాగతం పలికారు.
చిన్నా, చితక సామాన్లు ఎత్తుకుపోతే ఏం లాభం అనుకున్నారేమో అందుకే తిరుపతిలో దొంగలు ఏకంగా బస్సునే దొంగిలించారు. అదీ ఏడుకొండల స్వామి దర్శనానికి భక్తులను తీసుకువెళ్ళే తిరుమల శ్రీవారి ఉచిత ఎలక్ట్రికల్ బస్సు కావడం గమనార్హం. తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు ఈ బస్సును చోరీ చేశారు. ఈ ఎలక్ట్రికల్ బస్సు ఖరీదు సుమారు 2 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. చోరీ విషయాన్ని గుర్తించిన వెంటనే జిపిఎస్…
అలిపిరి కాలినడక మార్గంలో మరో చిరుత సంచరిస్తోంది. ఈ విషయం గుప్పుమనడం శ్రీవారి భక్తులు భయందోలనకు గురిచేస్తోంది. కాలిబాటలోని లక్ష్మీనరసింహ ఆలయం వద్ద చిరుత తిరుగుతున్న దృశ్యాలు ట్రాప్ కెమెరాల్లో నమోదయ్యాయి. ఇటీవల చిరుత దాడికి గురై మరణించిన చిన్నారి లక్షిత(6) మృతదేహం లభ్యమైన ప్రాంతంలోనే చిరుత సంచరించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే నాలుగు చిరుతలను పట్టుకున్న అటవీ శాఖ ఐదో దానిపై దృష్టి పెట్టింది. దాన్ని పట్టుకోవడానికి వివిధ ప్రాంతాలలో బోనులు ఏర్పాట్లు చేశారు. మెట్ల…
తెలుగు రాష్ట్రాల్లో అడవుల నుంచి వన్య ప్రాణులు జనారణ్యంలోకి రావడానికి నానారకాల కారణాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలోని అదిలాబాద్,కరీంనగర్ జిల్లాల్లో, ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుపతి, శ్రీ శైలం తదితర జిల్లాల్లో పచ్చని చెట్ల అడవులను వదిలి కాంక్రీట్ జంగిల్ లోకి ఎందుకు వస్తున్నాయనే చర్యలు మొదలయ్యాయి. వన్య ప్రాణుల స్వభావాన్ని బట్టి చూస్తే అవి సాధారణంగా జనావాసాల మధ్యకి వచ్చే అవకాశం లేదు. తమ ఉనికికి ముప్పు వాటిల్లే బలమైన ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు మాత్రమే జన…
తిరుమల నడక దారిలో చిన్నారి లక్షితను చంపిన చిరుత ఎట్టకేలకు బోనులో చిక్కింది. రెండు రోజుల క్రితం చిన్నారి లక్షితను దాడి చేసి హతమార్చిన చిరుతను ట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు ఆ పరిసరాల్లో బోనులు ఏర్పాటు చేయగా ఆదివారం అర్ధరాత్రి చిరుత ఓ బోనులో చిక్కినట్లు అధికారులు వెల్లడించారు.
తిరుమల వెళ్ళే కాలినడక మార్గంలో పిల్లల పై చిరుత పులుల దాడి నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) అప్రమత్తమైంది. శ్రీవారి దర్శనం కోసం అలిపిరి నుంచి మెట్ల ద్వారా వచ్చే భక్తుల భద్రతకు రక్షణ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మధ్యాహ్నం 2 గంటల తర్వాత 15 ఏళ్లలోపు పిల్లలను కాలినడక మార్గంలో అనుమతించడం లేదు. రెండు కనుమ రహదారుల్లో సాయంత్రం ఆరు గంటల తర్వాత ద్విచక్ర వాహనాల రాకపోకలు నిలిపివేశారు. ఏడో మైలు వద్ద…
ఏడు కొండల వాడిని చేరుందుకు నడక దారిన వెళ్ళే పర్యాటకులకు భక్తి కంటే భయం పెరిగే పరిస్థితి నెలకొంది. కాలినడకన వెళ్తున్న ఓ బాబుపై చిరుత దాడి చేసిన సంఘటన మరవక ముందే ఇంకో చిన్నారి చిరుతకు బలైంది. తిరుమల వెళ్ళే అలిపిరి నడక మార్గంలో నిన్న రాత్రి తప్పిపోయిన లక్షితా అనే ఆరు ఏళ్ల పాప లక్ష్మీనరసింహస్వామి గుడి వద్ద విగత జీవిగా లభించిది. తప్పిపోయిన బాలికను లక్ష్మీనరసింహస్వామి గుడి వద్ద చిరుత పులి దాడి…
తిరుమల శ్రీవారి ఆలయంలో అధిక మాసం శ్రావణ పౌర్ణమి గరుడ సేవను కన్నుల పండుగగా నిర్వహించారు. శ్రీ వేంకటేశుని వేదం పండితులు పవిత్ర మంత్రోచ్చారనలతో సేవా కార్యక్రమాలు నిర్వహించారు.