
నమస్తే.. నా పేరు లీసా..
ఛానల్స్ లో ఇక మరింత సాంకేతిక మార్పు రావచ్చు. ప్రత్యేకంగా అందమైన యాంకర్ల కోసం వెతకడం, వాళ్ళను ఇంటర్వ్యూలు చేసి, వడపోసి ఎంపిక చేయడం లాంటి ప్రక్రియలకు భవిష్యత్తులో తెర పడవచ్చు. తడబాట్లు , బిడియం వంటి తలనొప్పులకు తావులేకుండా బుట్ట బొమ్మల్లాంటి యాంకర్లతో కార్యక్రమాలు చేయించ వచ్చు. ఎలాంటి యాంకర్లు, న్యూస్ రీడర్లు కావాలో ఉహించుకొని అలాంటి వాళ్ళను తెరపై చూపవచ్చు. అందుబాటులోకి వస్తున్నా సాంకేతిక పరిజ్ఞానం ఈ వెసులుబాటును కల్పించనుంది. అదే ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్…