తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే రోజు దేశ రాజధానిలో ఢిల్లీలో సందడి చేశారు. ఆంద్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు పలురకాల చర్చల కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని విడివిడిగా కలిశారు. రానున్న బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కి మేలు జరిగేలా చూడాలని, రాష్ట్ర అభివృద్ది కోసం ఆర్ధిక సాయం చేయాలనే ప్రధాన అంశాలను చంద్రబాబు ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు. అదేవిధంగా, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలురకాల అభివృద్ది పథకాలకు చేయూత ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ మోడీకి విజ్ఞప్తి చేశారు. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో చంద్రబాబు, హైదరాబాద్ నుంచి రేవంత్ వేరువేరుగా డిల్లీ వెళ్ళారు.