కొండ కోనలు, పచ్చని చెట్లతో ఆహ్లాదకర వాతావరణాన్ని అందించే కేరళ పై ప్రకృతి కన్నెర్ర చేసింది. ఫలితంగా వందల మంది మట్టి ముద్దలుగా మారిపోయారు. రాళ్ల మధ్య నలిగి పోయారు. అనేక ప్రాంతాలు ఆర్తనాదాలతో పిక్కటిల్లాయి. దిక్కుతోచని స్థితిలో ఉన్న అనేక మందికి బాసటగా నిలిచారు మన వీర జవాన్ లు. అత్యంత క్లిష్టమైన చోట్లకు కూడా వెళ్ళి జనాన్ని అక్కున చేర్చుకున్నారు. కానీ, ప్రజలు చవు బతుకులతో పోరాడుతున్నారని అనుకున్నారేమో అందుకే ఇళ్ల ముందు అరుగులనే సోఫాలుగా, కటిక నేలన బిస్తర్లుగా మలచుకొని జవాన్లు సేద తీరారు. కనిపిస్తున్న చిత్రమే అందుకు నిలువెత్తు సాక్ష్యం. హాట్స్ ఆఫ్ జవాన్…