బాబు గారూ రావ్వాలి..
హైదరాబాద్ లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుని తన కుమారుడు రాజారెడ్డి వివాహానికి రావాలని చం వైఎస్ షర్మిల గాఆహ్వానించారు. అయన నివాసంలో వ్యక్తిగతంగా కలిసి షర్మిల బాబుకి పెళ్లి పత్రిక అందజేశారు.
హైదరాబాద్ లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుని తన కుమారుడు రాజారెడ్డి వివాహానికి రావాలని చం వైఎస్ షర్మిల గాఆహ్వానించారు. అయన నివాసంలో వ్యక్తిగతంగా కలిసి షర్మిల బాబుకి పెళ్లి పత్రిక అందజేశారు.
ఆంద్రప్రదేశ్ రాజకీయల చర్చలు హైదారాబాద్ కేంద్రంగా మొదలయ్యాయి. తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు నగరంలోని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లారు. ఇద్దరూ తాజా రాజకీయ పరిస్థితులు, రెండు పార్టీల పొత్తుల వ్యవహారం పై చర్చించారు. వైఎస్సార్సీపీ విముక్త ఆంధ్రప్రదేశే ప్రధాన అజెండాగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ఆదివారం రాత్రి కీలక చర్చలు జరిపారు. ఇరువురి నేతల మధ్య జరిగిన అంతర్గత భేటీలో 4 ప్రధాన…
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ మిచౌంగ్ తుపాను ఆంధ్రప్రదేశ్ లోని పలుజిల్లాలను అతలాకుతలం చేస్తోంది. వివిధ ప్రాంతాల్లో కురుస్తున్న కుండపోత వర్షాలు, ఈదురు గాలులు జన జీవనాన్ని స్తంభిపజేశాయి. తుపాను ప్రభావం వల్ల ఉభయగోదావరి, నెల్లూరు, కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనేక పట్టణాలు, గ్రామాలు జలమయం అయ్యాయి. తాజా సమాచారం మేరకు నెల్లూరుకు 50 కి.మీ, బాపట్లకు 110 కి.మీ, మచిలీపట్నానికి 170కి.మీ. దూరంలో తుఫాన్ కేంద్రీకృతమై ఉన్నట్టు వాతావరణ శాఖ…
ఆదివారం సాయంత్రం సరదాగా పార్కులో గడపడానికి వచ్చిన అమ్మాయిల మధ్య చోటుచేసుకున్న ఓ చిన్న వివాదం జుట్లు పట్టుకొని కొట్టుకునే స్థాయికి వెళ్లింది. గుంటూరులో ఇటీవలే కొత్తగా ప్రారంభించిన గాంధీ పార్కులో ఈ ఘటన జరిగింది. అక్కడ ఓ లొకేషన్ వద్ద సెల్ఫీలు, రీల్స్ తీసుకునేందుకు యువతులు పోటీ పడ్డారు. ఈ క్రమంలో చెలరేగిన వివాదం చివరకు కొట్లాటకు దారి తీసింది. కొంతమంది యువతులు జుట్లు పట్టుకుని కొట్టుకున్నారు. పలువురు అడ్డుకునే ప్రయత్నం చేసినా పట్టించుకోక పోవడం విశేషం….
తిరుచానూరుకు చేరిన లక్ష్మీకాసులహారం తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళ, బుధవారాల్లో జరుగనున్న గజ, గరుడ వాహనసేవల్లో అలంకరించేందుకు తిరుమల శ్రీవారి లక్ష్మీకాసుల హారాన్ని మంగళవారం ఉదయం శోభాయాత్రగా తిరుచానూరుకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయని,నవంబర్ 18న చివరి రోజు పంచమి తీర్థానికి విశేషంగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో విస్తృతంగా…
మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు తిరుమామ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. సతీ సమేతంగా వచ్చిన అయన తలనీలాలు సమర్పించుకున్నారు.
అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ టీడీపీ తెలుగు రాష్ట్రాల్లో ‘‘కాంతితో క్రాంతి’’ కార్యక్రమాన్ని చేపట్టింది. వివిధ జిల్లాల్లో పలువురు సంఘీభావం తెలిపారు. రాజమండ్రి లో నిర్వహించిన కార్యక్రమంలో నారా భువనేశ్వరి ప్రమిదలు వెలిగించి నిరసన లో పాల్గొన్నారు. ఆమెతో పాటు స్థానిక మహిళలు కార్యక్రమంలో పాల్గొన్నారు. మేము సైతం బాబు కోసం, బాబుతో మేము అంటూ మహిళలు నినాదాలు చేశారు. తెలంగాణలో టిడిపి శ్రేణులు, సినీ దర్శకులు రాఘవేంద్ర రావు, నందమూరి రామకృష్ణ…
మీడియాలో పనిచేస్తున్న ఉద్యోగుల రక్షణకు, వారి పరిరక్షణకు తక్షణమే మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని ఐజేయూ అధ్యక్షులు కె. శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టుల భద్రతకు కేంద్ర ప్రభుత్వం ప్రతేక చట్టాన్ని రూపొందించాలని ఆయన కోరారు. ఈ సమస్యల న్నింటిపై అక్టోబర్ 2 గాంధీ జయంతిన ఢిల్లీలో పెద్ద ఎత్తున జర్నలిస్టులతో సదస్సు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. విజయవాడ ప్రెస్ క్లబ్‌లో ఏపీయూడబ్ల్యూజే కార్యవర్గ సభ్యులతో జరిగిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి మాట్లాడారు….
అరుదైన జంతువులకు నిలయమైన నల్లమల అడవుల్లో అత్యంత క్రూర జంతువు సంచరుస్తోంది. మార్కాపురం డివిజన్ పరిధిలో విస్తరించి ఉన్న దట్టమైన అడవుల్లో పులి పై సైతం దాడి చేయగల అరుదైన మృగం జాడలు కనిపించాయని ఫారెస్ట్ రేంజర్ అధికారి విశ్వేశ్వరరావు తెలిపారు. దోర్నాల ప్రాంతంలోని నల్లమల అడవుల్లో “హనీ బార్జర్” అనే అరుదైన జంతువు ఉన్నట్లు అయన చెప్పారు. హనీ బార్జర్ మందమైన చర్మాన్ని కలిగి ఉండి, ఏకంగా పులుల వంటి క్రూర జంతువులపై సైతం పోరాడే…
శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానం పరిధిలోని నంది విగ్రహం సమీపంలో ఎలుగు బంటి కలకలం రేపింది.
తిరుమలకు కాలి బాటన వెళ్ళే భక్తులు బెంబేలేత్తుతున్నారు. అలిపిరి నుంచి ఈ దారిలో వెళుతున్న వారిపై చిరుతలు దాడిచేసి చంపడం పట్ల తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. నడుచుకుంటూ వెళ్ళే భక్తులు ఎప్పుడు ఏ చిరుత దాడిచేస్తుందో తెలియక భక్తిని లోన దాచుకొని భయంతో పైకెక్కే పరిస్థితిని నెలకొంది. దీనికి తోడు మొన్న చిన్నారిపై దాడి చేసిన చిరుత పట్టుపడగా మరో మూడు చిరుతలు నడక మార్గంలో సంచరిస్తున్నాయనే టిటిడి అధికారుల ప్రకటనతో భక్తులు మరింత భయబ్రాంతులకు గురవుతున్నారు….
వందే భరత్ రైలు కోచ్ నుండి గుప్పుమన్న పొగలు ప్రయాణీకులను ఆందోళనకు గురి చేశాయి. తిరుపతి నుంచి హైదరాబాద్ వెళుతున్న రైలులో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఒక బోగీలో అకస్మాత్తుగా పొగ వ్యాపించడంతో గమనించిన లోకో పైలెట్ మనుబోలు రైల్వే స్టేషన్‌లో రైలుని నిలిపివేశారు. అనంతరం రైల్వే పోలీసులు, అధికారులు తనఖి చేయగా ఓ ప్రయాణీకుడు బాత్ రూమ్‌లో కాల్చిన సిగరేట్ వల్లే ప్లాస్టిక్ కు అంటుకొని పొగ కమ్ముకున్నట్టు తేల్చారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకోని…
ప్రజా గాయకులు గద్దర్ పార్దీవ దేహాన్ని హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో వేలాది మంది అభిమానులు, విప్లవ, నృత్య కళాకారులు, పలువురు ప్రముఖులు దర్శించి నివాళులు అర్పించారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పోలీసు అధికారి సజ్జనార్ గద్దర్ పార్దీవ దేహాన్ని సందర్శించి పుష్పాంజలి ఘటించారు.అయన కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. గద్దర్ పార్దీవ దేహాన్ని తెలంగాణ పోరాట అడ్డా అయిన గన్ పార్క్ వద్ద నిలిపారు. అక్కడి నుంచి అంతిమ…
వరంగల్ , హన్మకొండ జిల్లాలలో కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలను గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ పరిశీలించారు. జవహర్ నగర్, నయీమ్ నగర్, భద్రకాళి బండ్, ఎన్టీఆర్ నగర్, ఎన్ ఎన్ నగర్ ప్రాంతాలను పర్యటించి అధికారులను అడిగి నష్టం వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జవహర్ నగర్ లో“ రెడ్ క్రాస్ సొసైటీ” ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గవర్నర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు వరంగల్ హన్మకొండ ప్రాంతాలలో…
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణ, తన భర్త సుబ్రహ్మణ్యం వేధిస్తూ, బెదిరింపులకు గురిచేస్తున్నారంటూ పొంగూరు కృష్ణప్రియ పోలీసులను ఆశ్రయించింది. నారాయణ డేగ మాదిరిగా వెంబడించి నానా రకాల హింసలకు గురిచేశాడని ప్రియ బహిరంగ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. నారాయణ తనను లైంగిక వేధింపులకు గురి చేసినట్లు సోషల్ మీడియా వేదికగా తన గోడు వెల్లబుచ్చుకుంది. ఇంట్లో ఎదుర్కొంటున్న నారాయణ వేదింపులపై వీడియో విడదుల చేసిన తరువాత నారాయణ నుంచి వేధింపులు…