జుట్టు కెక్కిన సెల్ఫీ”పిచ్చి”…!

selfi c

ఆదివారం సాయంత్రం సరదాగా పార్కులో గడపడానికి వచ్చిన అమ్మాయిల మధ్య చోటుచేసుకున్న ఓ చిన్న వివాదం జుట్లు పట్టుకొని కొట్టుకునే స్థాయికి వెళ్లింది. గుంటూరులో ఇటీవలే కొత్తగా ప్రారంభించిన గాంధీ పార్కులో ఈ ఘటన జరిగింది. అక్కడ ఓ లొకేషన్ వద్ద సెల్ఫీలు, రీల్స్ తీసుకునేందుకు యువతులు పోటీ పడ్డారు. ఈ క్రమంలో చెలరేగిన వివాదం చివరకు కొట్లాటకు దారి తీసింది. కొంతమంది యువతులు జుట్లు పట్టుకుని కొట్టుకున్నారు. పలువురు అడ్డుకునే ప్రయత్నం చేసినా పట్టించుకోక పోవడం విశేషం. చివరకు పార్కు సిబ్బంది జోక్యం చేసుకోవడంతో జుట్లు విడిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *