
బలా బలాలు..
లోక్ సభ ఎన్నికల తుది ఫలితాల్లో వివిధ పార్టీలు, ఎన్డీయే, ఇండియా కూటమిల మొత్తం స్థానాల వివరాలు ఇలా ఉన్నాయి.
లోక్ సభ ఎన్నికల తుది ఫలితాల్లో వివిధ పార్టీలు, ఎన్డీయే, ఇండియా కూటమిల మొత్తం స్థానాల వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రధాని నరేంద్ర మోదీపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల ప్రచారంలో విపక్షాలను లేదా ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని విద్వేషపూరిత, అనుచిత ప్రసంగాలతో ప్రధాని కార్యాలయం హుందాతనాన్ని తగ్గించారని ధ్వజమెత్తారు. లోక్‌సభ తుది దశ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో పంజాబ్ ఓటర్లకు ఓ లేఖ రాసిన మాజీ మన్మోహన్ మోడీ విభజన వాదాన్ని ప్రోత్సహించే ప్రసంగాలు చేశారని మండిపడ్డారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ఇచ్చిన హామీని తుంగలో…
దేశ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు వినిపించింది. దేశ వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు జీవనాడి అయిన నైరుతి రుతుపవనాలు (Southwest monsoon) దేశ ప్రధాన భూభాగంలోకి ప్రవేశించినట్లు తెలిపింది. ఇవి గురువారం ఉదయం కేరళ (Kerala)ను తాకాయని ఐఎండీ (IMD) అధికారికంగా వెల్లడించింది. లక్షద్వీప్, కేరళలోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ అంచనా వేసింది. రాబోయే మూడు లేదా నాలుగు రోజుల్లో రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించే…
దేశంలో ఇటీవల బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. తాజాగా, ముంబై లోని తాజ్ హోటల్, ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో, అప్రమత్తమైన పోలీసులు ఆయా ప్రాంతాల్లో సోదాలు నిర్వహించగా అనుమానాస్పదంగా ఏమీ కనిపించక పోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఆ కాల్ ఉత్తర ప్రదేశ్ నుంచి వచ్చినట్టు గుర్తించారు. ఆ నిందుతుడి కోసం గాలిస్తున్నట్లు పోలిసులు తెలిపారు.
ఢిల్లీ మద్యం విక్రయ లావాదేవీల కుంభకోణంలో చిక్కుకున్న తెలంగాణా ముద్దు బిడ్డ కల్వకుంట్ల కవిత చివరి వరకు ఎన్ని సాకులు చెప్పినా తిహర్ జైలు ఊసల వెనక్కి వెళ్ళక తప్పలేదు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరెట్ అధికారుల కస్టడీ అనంతరం ఆమె చేసిన అర్థరహింత విజ్ఞప్తిని కోర్టు త్రోసిపుచ్చింది. తన కుమారుని పరీక్షలు ఉన్నాయంటూ ఆమె చేసిన విజ్ఞప్తిని కోర్టు సాకుగా పరిగణించింది. అందుకే, కవితకు వచ్చే నెల 9 వ తేదీ వరకు జ్యూడిషియల్ కస్టడీ…
మద్యం కుంభకోణంలో కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిర్బంధం నుంచే ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించి తన మొదటి ఉత్తర్వును జల వనరుల శాఖకు జారీ చేశారు.ఈ రోజు సమావేశం నిర్వహించనున్న ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు అతిషి అరవింద్ ఆదేశాల గురించి సమాచారం ఇవ్వనున్నారు. కేజ్రీవాల్ అరెస్టుతో ఢిల్లీ ప్రభుత్వం ఎలా నడుస్తుందనేది అతి పెద్ద ప్రశ్నగా మారింది. కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా? అనే…
కోర్టు ధిక్కరణ కేసులో న్యాయస్థానం ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలని యోగా గురు రాందేవ్ బాబాను, ఆయన యాజమాన్యం లోని పతంజలి ఆయుర్వేద్ సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణను సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది.ఆరోగ్య రక్షణకు సంబంధించి పత్రికలలో ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు ఇస్తున్నారంటూ వీరిద్దరిపై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. ప్రజలను తప్పు దోవ పట్టిస్తూ మోసపూరిత ప్రకటనలు ఇస్తున్నారంటూ పతంజలిపై గతంలో ఫిర్యాదులు వచ్చాయి.వీటిపై సుప్రీంకోర్టులో జరిగిన వాదనల సందర్భంగా ఇకపై…
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో నిర్మాణంలో ఉన్న ఓ ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందగా, 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. గార్డెన్ రీచ్ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకి తీసేందుకు సహాయక సిబ్బంది ప్రయత్నిస్తున్నట్లు కోల్‌కతా మేయర్ ఫిర్హద్ హకీమ్ తెలిపారు. ఘటనకు సంబంధించి నిర్మాణ సంస్థ ప్రమోటర్‌ను అరెస్టు చేసినట్లు మేయర్ వెల్లడించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఘటనాస్థలానికి వెళ్లి…
దేశంలో 12వ తేదీ నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్నాయి. నెలవంక దర్శనం ఇవ్వడంతో సౌదీ అరేబియాలో 11 నుంచి దీక్షలు మొదలవుతున్నాయి.
పిల్లలను, యువతను చవులురించే పీచు మిఠాయి అమ్మకాలపై తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రంలో పీచు మిఠాయి విక్రయాలను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పీచు మిఠాయిలో క్యాన్సర్ కారక రసాయనాలను వాడుతున్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి ఎం.సుబ్రమణియన్ తెలిపారు.ఎవరైనా ప్రభుత్వ ఉత్తర్వులకు వ్యతిరేకంగా పీచు మిఠాయి విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్14 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. వాతావరణ ఉపగ్రహం ఇన్‌శాట్-3డీఎస్ ను మోసుకెళ్లే జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్ 14 ఉపగ్రహ వాహక నౌక ప్రయోగాన్ని ఇస్రో చేపట్టింది. తిరుపతి జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్‌లో ఈ ప్రయోగాన్ని చేపట్టారు. గతంలో ప్రయోగించిన ఇన్‌శాట్-3డీ, ఇన్‌శాట్-3డీఆర్ ఉపగ్రహాలకు కొనసాగింపు గానే ఇన్‌శాట్-3డీఎస్‌ని పంపుతున్నట్లు ఇస్రో వెల్లడించింది. సుమారు 2,275 కిలోల బరువైన ఇన్‌శాట్-3డీఎస్ ఉపగ్రహంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన పేలోడ్ లు ఉన్నాయి. ఈ పేలోడ్ లు వాతావరణ అంచనా,…
కనీస మద్దతు ధర(ఎమ్మెస్పీ)కి చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్‌తో ఛలో ఢిల్లీకి పిలుపునిచ్చిన పంజాబ్ రైతులపై పోలీసులు ‘సోనిక్ ఆయుధాల’ను ప్రయోగించారు. ఒకే దిశలో కర్ణభేరీలు పగిలేలా శబ్దాలను విడుదల చేయడం సోనిక్ ఆయుధాల ప్రత్యేకత. లాంగ్ రేంజ్ అకూస్టిక్ డివైజ్(ఎల్‌ఆర్‌ఏడీ)గా పిలిచే సోనిక్ ఆయుధాలను సాధారణంగా సముద్రపు దొంగలకు హెచ్చరికలు జారీ చేయడానికి వినియోగిస్తుంటారు. కొన్ని దేశాల్లో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు వాడుతున్నారు. అమెరికా సైన్యం అమ్ముల పొదిలో 2000 సంవత్సరం నుంచే సోనిక్ ఆయుధాలుండగా 2013లో ఢిల్లీ…
ఎలక్టోరల్ బాండ్స్ స్కీం పై సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఈ స్కీం ప్రాథమిక హక్కులను హరిస్తుందని 5 గురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవ తీర్పు వెల్లడించింది. ఎలక్టోరల్ బాండ్స్ ను రద్దు చేయాలని ధర్మాసనం తీర్పుఇచ్చింది. విరాళాలు ఇచ్చే దాతల వివరాలు గోప్యంగా ఉంచటం సరైన పద్ధతి కాదని తెలిపింది. అలాగే ఇది సమాచార హక్కు చట్టం ఉల్లంఘన కిందకు వస్తుందని స్పష్టం చేసింది. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడం ఒకరకంగా క్విడ్…
ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజులు అబుదాబిలో పర్యటించిన సందర్భంగా యూఏఈ దేశంతో ఎనిమిది వ్యాపార ఒప్పందాలు చేసుకున్నారు, కానీ గల్ఫ్ కార్మికుల సంక్షేమం గురించి మాత్రం పట్టించుకోలేదని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, ఎన్నారై సెల్ చైర్మన్, అంబాసిడర్ బి.ఎం. వినోద్ కుమార్, కన్వీనర్ మంద భీంరెడ్డి వ్యాఖ్యానించారు. గల్ఫ్ దేశాలలో 88 లక్షల మంది వలస కార్మికులు నివసిస్తున్నారని, వారికి కేంద్ర ప్రభుత్వం సామాజిక భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. గల్ఫ్ దేశాల అభివృద్ధిలో పాలుపంచుకుంటూ స్వదేశానికి అత్యధిక…