
ఫ్రాన్స్ లో పోచంపల్లి …
ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ ఆ దేశ అధ్యక్షుడు మెక్రన్ కి ఏనుగు ఆకారంలోని గంధపు చెక్క బొమ్మను అందజేశారు. అదేవిధంగా అయన సతీమణి కి తెలంగాణ పోచంపల్లి సిల్క్ ఇక్కత్ చీరను మోడీ బహుకరించారు.
ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ ఆ దేశ అధ్యక్షుడు మెక్రన్ కి ఏనుగు ఆకారంలోని గంధపు చెక్క బొమ్మను అందజేశారు. అదేవిధంగా అయన సతీమణి కి తెలంగాణ పోచంపల్లి సిల్క్ ఇక్కత్ చీరను మోడీ బహుకరించారు.
ఆస్ట్రేలియాలో జరిగే బోనాల పండుగ వేడుకల్లో పాల్గొనేందుకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేరుకున్నారు.బ్రిస్బేన్ నగరంలో ఆమెకు భారత జాగృతి ఆస్ట్రేలియా విభాగం నాయకులు ఘన స్వాగతం పలికారు. సిడ్నీ, మెల్బోర్న్ నగరాల నుండి బీఆర్ఎస్, తెలంగాణ జాగృతి నాయకులు వచ్చారు. తెలంగాణ జాగృతి ఆస్ట్రేలియా విభాగం అధ్యక్షులు శ్రీకర్ రెడ్డి అందెం, బీఆర్ఎస్ ఆస్ట్రేలియా విభాగం అధ్యక్షులు కాసర్ల నాగేందర్ రెడ్డి, భారత జాగృతి ఆస్ట్రేలియా అధ్యక్షులు కిషోర్, నాయకులు విజయ్ కోరబోయిన, స్వప్న దోమ, విరించి…
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లలో జరగనున్న బోనాల పండుగలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొననున్నారు. ఈనెల 15న ఆస్ట్రేలియాలోని బ్రిస్ బేన్ నగరంలో “భారత జాగృతి ఆస్ట్రేలియా” ఆధ్వర్యంలో బోనాల సంబరాలు జరగనున్నాయి. ఉదయం 10 గంటలకు బ్రిస్ బేన్ లోని గాయత్రి మందిరంలో జరగనున్న ఈ వేడుకలలో ప్రవాస భారతీయులతో పాటు ఆస్ట్రేలియా మంత్రులు, ఎంపీలు హాజరుకానున్నారు. అదేవిధంగా జులై 16న న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ నగరంలో జరగనున్న బోనాలు వేడుకలో కవిత పాల్గొంటారు. న్యూజిలాండ్ తెలంగాణ…
అమెరికా వ్యాప్తంగా ఏడాదిపాటు ఘనంగా నిర్వహించిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలపై రూపొందించిన సావనీర్ ను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆవిష్కరించారు. ఎన్ఆర్ఐ టీడీపీ యూఎస్ఏ కోఆర్డినేటర్ జయరాం కోమటి, గుంటూరు మిర్చియార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు ఈ సావనీర్ ను రూపొందించారు. ఈ ఉత్సవాలు భారతదేశానికే పరిమితం కాకుండా అమెరికా వ్యాప్తంగా అత్యంత వైభవోపేతంగా జరిగాయి. బోస్టన్ మహానగరం వేదికగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు 2022…
అమెరికా లోని ఫిలడెల్ఫియాలో ప్రారంభమైన తానా సభలు అట్టహాసంగా ప్రారంభమైయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలు ఫిలడెల్ఫియా నగరంలో ఉన్న పెన్సిల్వేనియా కాన్ఫరెన్స్ హాలులో నిర్వహిస్తున్నారు. ఈ సభలకు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీం కోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్.వి రమణ, సినీనటులు, ఎమ్మెల్యే బాలకృష్ణ , తెలంగాణ రాష్ట్ర పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
పది రోజులుగా అల్లర్లతో అట్టుడుకుతున్న పారిస్ లో పరిస్థితిని చక్కబెట్టడానికి అక్కడి పోలీసులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మొన్నటి వరకు భాష్ప వాయువుతో అల్లరి మూకలను చెదరగోట్టిన పోలీసులు చేతులకు పనిచెప్పారు. అల్లర్లకు పాల్పడుతున్న వారిపై విరుసుకుపడ్డారు.
పారిస్ నగరం రావణ కాష్టంలా అట్టుడుకుతోంది. అంతకంతకు చెలరేగుతున్న అల్లర్లతో పౌర జీవనం అతలాకుతలం అవుతోంది. కొన్ని ప్రాంతాల్లో నెలకొన్న బితావాహ పరిస్థితులు ఆందోళనకు గురి చేస్తున్నాయి. పోలీసు కాల్పుల్లో 17 ఏళ్ల యువకుడు మృతి చెందడంతో ఒక్కసారిగా భగ్గుమన్న నిరసన జ్వాలలు వివిధ ప్రాంతాలకు విస్తరించాయి. ఆరు కోజులుగా ఆందోళనకారులు దేశవ్యాప్తంగా నిరసనలకు దిగారు. . ముఖ్యంగా పారిస్ నగరంలోని స్కూళ్లు, టౌన్‌హాళ్లు, పోలీస్ స్టేషన్లు వంటి పలు ప్రభుత్వ భవంతులు, వాహనాలు, ఇతర ఆస్తులకు…
పారిస్ నగరం అల్లర్లతో అట్టుడుకుతోంది. పోలీసు కాల్పుల్లో 17 ఏళ్ల యువకుడు మృతి చెందడంతో నాలుగు రోజుల కిందట ఫ్రాన్స్ లో ఒక్కసారిగా నిరసన జ్వాలలు భగ్గుమన్నాయి. పారిస్ శివారులోని నాంటెర్రెలోని ట్రాఫిక్ స్టాప్ వద్ద నహెల్ అనే యువకుడిని పోలీసులు కాల్చి చంపారు. ఈ ఘటనతో రెండు రోజులుగా హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి. ఆందోళనకారులు దేశవ్యాప్తంగా నిరసనలకు దిగారు. ముఖ్యంగా పారిస్ నగరంలోని స్కూళ్లు, టౌన్‌హాళ్లు, పోలీస్ స్టేషన్లు వంటి పలు ప్రభుత్వ భవంతులు, వాహనాలు,…
ఆలీబాబా గ్రూపు అధినేత, చైనా బిలియనీర్ జాక్ మా వ్యక్తిగత పర్యటనలో భాగంగా నేపాల్ వచ్చారు. ఢాకా మీదుగా వచ్చిన ప్రత్యెక విమానంలో అయన త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం కి చేరుకున్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్, నేపాల్ లు కేంద్రంగా పనిచేస్తున్న దార్జ్ అనే ఈ -కామర్స్ కంపెనీని ఇటివలే ఆలీబాబా సొంతం చేసుకుంది. నేపాల్ ప్రధాన మంత్రి పుష్పా కమల్ ధల్ తో అయన సమావేశమవుతారు.
అమెరికా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి అక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో బైడేన్ ప్రత్యేకమైన టి.షర్టు ని బహుకరించారు. ఎర్రని రంగు షర్టు పై భవిష్యత్తు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ , అమెరికా, ఇండియా అని రాసి ఉంది. వేదిక పై మైక్రోసాఫ్ట్ సి.ఇ.ఒ. సత్య నాదెళ్ళ ఉన్నారు.
అమెరికాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆ దేశ ప్రముఖ గాయని మేరీ మిల్బెన్ జన గణ మన గీతాన్ని ఆలపించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ పాదాలను తాకి ఆశీర్వాదం కోరారు. భారత సంప్రదాయాన్ని అనుసరించినదుకు మిల్బెన్ ని పలువురు కొనియాడారు.
భారత ప్రధాని నరేంద్ర మోడీకి అమెరికా పర్యటనలో అడుగడుగున ఘన స్వాగతం లభిస్తోంది. వైట్ హౌస్‌కి చేరుకున్న మోడీకి జోబైడెన్, ఆయన సతీమణి జిల్ బైడెన్ సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇరుదేశాధిపతులు పరస్పర రక్షణ సహకారంపై ప్రధానంగా చర్చించారు. వైట్‌హౌస్ సౌత్‌లాన్‌లో వేడుక సందర్బంగా ఎన్నారైలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. అయితే, నిబంధనల మేరకు పాస్ లు ఉన్నవారిని మాత్రమే అనుమతించారు. అమెరికా తెలుగు సంఘం సంఘం నాయకులు ప్రదీప్ కట్ట, విలాస్…
భారత్ లో మరో రెండు నగరాల్లో అమెరిక దౌత్య కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్టు వైట్ హౌస్ అధికారులు ప్రకటించారు. బెంగళూరు, అహ్మదాబాద్ లలో ఈ కార్యాలయాలను ప్రారంభించనున్నట్టు వివరించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అమెరిక పర్యటనలో ఉన్నప్పుడు అక్కడి అధికారులు నిర్ణయాన్ని ప్రకటించడం విశేషం.
అత్యధిక జాతీయులు పాల్గొన్న సెషన్‌గా ఈ యోగా చరిత్ర సృష్టించింది. ఏకంగా గిన్నిస్ బుక్ రికార్డ్‌ను అందుకుంది. ఈ యోగా కార్యక్రమంలో వివిధ దేశాలకు చెందినవారు పాల్గొనడమే కారణం. ప్రవాస భారతీయులతో పాటు ఆఫ్రికన్, అమెరికన్, కెనడియన్ ఇలా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు, జాతులు, తెగలకు చెందిన వారు యోగాలో పాల్గొన్నారు. ఒక కార్యక్రమంలో 135 దేశాల నుంచి పాల్గొనడం ఇప్పటివరకు ఎక్కడా చోటుజరగలేదు. ఈ విషయాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు గుర్తించారు….