అక్కడ సరే..మరి ఇక్కడ... - EAGLE NEWS

అక్కడ సరే..మరి ఇక్కడ…

jnj 2
house wgl

వరంగల్ లో పని చేస్తున్న విలేకరులలో   ఏకశిలా, కాకతీయ హౌసింగ్ సొసైటీల్లో సభ్యులుగా లేని వారి నుండి జులై, 5, 6వ తేదీల్లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో దరఖాస్తులు తీసుకోవాలని లో వర్కింగ్ జర్నలిస్టుల  స్థలాల కోసం ఏర్పడ్డ సిక్స్ మెన్ కమిటీ తెలిపింది.  వర్కింగ్ జర్నలిస్టులకు ఇంటి స్థలాల కోసం ఏర్పడిన  ఆరుగురు సభ్యుల కమిటీ  కాకతీయ, ఏకశిలా ఈరెండు సొసైటీల నుండి జాబితాలు తీసుకొని, రెండు సొసైటీల్లో లేని జర్నలిస్టుల దరఖాస్తులను సేకరించి  తుది జాబితాలను ప్రభుత్వానికి అందజేయాలని మీడియా అకాడమీ ఛైర్మెన్ అల్లం నారాయణ ఇటివల సూచించారు. ఈ  మేరకు ముందుకెల్లాలని సిక్స్ మెన్ కమిటీ నిర్ణయించింది. ఈ నెల 5, 6వ తేదీలలో రెండు సొసైటీలలో లేని జర్నలిస్టులు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తులను గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో సమర్పించాలని కమిటి తెలిపింది. కాకతీయ, ఏకశిల హౌసింగ్ సొసైటీల  జాబితాలను 4వ తేదీ సాయంత్రంలోగా సిక్స్ మెన్ కమిటీకి అందించి, అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అందించే కార్యక్రమానికి సహకరించాలని మరోసారి కోరుతూ లేఖలు రాయాలని తీర్మానించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *