ఆదిలాబాద్ జిల్లా మావల శివారు ప్రాంతాంలో 44వ జాతీయ రహదారి పై టమాట లారీ బోల్తా పడింది. రోడ్డుపై ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి లారీ ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో లారీలో ఉన్న టమాటలన్ని రోడ్డుపై పడ్డాయి. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. టమాట ధర ఢిల్లీలో రూ. 300 పలుకుతుండగా ఆదిలాబాద్‌లో రూ. 150 నుంచి రూ. 180 వరకు పలుకుతుంది. విలువైనా టమాటలు ఎత్తుకెళ్లడానికి ఒక్కసారిగా జనం తరలిరావడంతో డ్రైవర్ అప్రమతమై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోని బందోబస్తు చేశారు. టమాటల కోసం గుమికూడిన అందరిని పోలీసులు వెళ్లగొట్టారు. బోల్తాపడిన లారీ కర్ణాటకలోని కొలార్ నుంచి ఢిల్లీకి వెళ్తుండగా మార్గ మధ్యలో బోల్తా పడింది. 25 టన్నుల టమాటలు రూ. 22 లక్షల విలువ గల టమాటలు ఉన్నట్టు డ్రైవర్ తెలిపాడు. దిని వల్ల 50 శాతం టమాట నష్టం వాటిల్లిందని ఆందోళన వ్యక్తం చేశారు. మిగిలిన టమాటలను ఢిల్లీకి తరలించడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోని అక్కడి నుంచి తరలించామని తెలిపారు.