జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి 2007 వ సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం పేట్ బషీరా బాద్ లో కేటాయించిన స్థలాన్ని కాపాడుకోవడానే కార్యక్రమంలో భాగంగా కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేయడానికి డిల్లీ వెళ్ళిన కొందరు సొసైటీకి సభ్యులు అక్కడ రెండు రోజులుగా న్యాయ నిపుణులతో పాటు పలువురు ప్రముఖులను సంప్రదిస్తున్నారు. ఇప్పటికీ ఆ స్థలాన్ని సొసైటీకి అప్పజెప్పే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి సానుకూలత కనిపించక పోవడంతో డిల్లీ లోని నిపుణుల అభిప్రాయాలు తీసుకొని పిటిషన్ దాఖలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే, సుప్రీం కోర్టు తీర్పుని గౌరవిస్తూ ఇప్పటికైనా ప్రభుత్వం పేట్ బషీరా బాద్ భూమిని సొసైటీకి అందజేస్తే బాగుంటుందని జర్నలిస్టు సంఘాలు సూచిస్తున్నాయి.