ఎవడిదిరా బానిసత్వ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రి కెటిఆర్ పై ధ్వజమెత్తారు. మద్యం కేసులో కవిత ప్రమేయం పై అమిత్ షా ని కలిసిన తర్వాత ఆగిపోయిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు.మా చెల్లిని అరెస్ట్ చేయకండి, ఎన్నికలు ఎప్పుడైనా పెట్టుకోండి అని కేటీఆర్ అమిత్ షా కి చెప్పి వచ్చాదాని వ్యాఖ్యానించారు.కేటీఆర్ కి ఎంతోకొంత తెలివి ఉందనుకున్ననాని, ఈ రోజు చిట్ చాట్ తర్వాత ఆయనకు ఏమీ తెలియదని అర్థమైందనీ ఎద్దేవా చేశారు.కేసీఆర్ కి దమ్ముంటే ఆయన్ని బండ భూతులు తిట్టిన దానం, తలసాని ని కేబినెట్ నుండి తొలగించాలని డిమాండ్ చేశారు.
బిఅర్ఎస్ నుంచి నుండి తెలంగాణ ద్రోహులను తీసేయండనీ,తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర ఒక్క శాతం మాత్రమే అనీ దుయ్యబట్టారు.కేసీఆర్ 115 మందిని ప్రకటించి ఒక్కొక్కరికి 10 కోట్లు ఇచ్చి పంపారని ఆరోపించారు.కేటీఆర్ రాజకీయాలపై అనుభవం లేని వ్యక్తని, తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు కేటీఆర్ అమెరికాలో ఉన్నాడని,చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వకపోవడంతోనే కేసీఆర్ బయటకి వచ్చి పార్టీ పెట్టాడని కోమటిరెడ్డి వివరించారు. సోనియా వల్లే తెలంగాణ వచ్చిందని కేసీఆర్ అన్నారని, ఇప్పుడు సోనియా పాత్ర లేదని కేటీఆర్ అనడం హాస్యాస్పదమన్నారు. అరేయ్ కేసీఆర్, ఫుట్ బాల్ లాగా తంతాను అన్న తలసాని మంత్రి ఎలా అయ్యాడని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటులో సోనియా పాత్ర లేకపోతే కేసీఆర్ కుటుంబం సోనియా ని ఎందుకు కలిశారు? ఎందుకు గ్రూప్ ఫోటో దిగారని గుర్తు చేశారు.దళిత బందు, బీసీ బందులో అక్రమాలపై కోర్టుకు వెళ్తున్నట్టు కోమటిరెడ్డి వెల్లడించారు.
