ఆయనకు”మెంటల్”- రోజా..

roja

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టు అనంతరం ఆ రాష్ట్ర మంత్రి, నటి రోజా చేస్తున్న ప్రకటనలు, వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఆమె చంద్రబాబు అరెస్టు కావడం వల్లే దేవాలయానికి వెళ్లినట్టు చెప్పడం ఒకటైతే, బాలకృష్ణ పై రకరకాల వ్యాఖ్యలు చేయడం అధికార పార్టీ శ్రేణుల్లో ఎలా ఉన్నా గానీ తెలుగుదేశం పార్టీ వర్గాలకు మాత్రం మింగుడు పడడంలేదు. బాలకృష్ణ టీడీపీ ఆఫీసుకెళ్లి చంద్రబాబు కుర్చీలో కూర్చొని మాట్లాడటంపై ప్రజల్లో ఒక చర్చ జరిగిందని, ఇన్నిరోజులూ ఆ కుర్చీలో ఒక వెన్నుపోటుదారుడు కూర్చొంటే ఇప్పుడు ఒక మెంటల్‌ గాడు కూర్చొన్నాడని ఆమె వ్యాఖ్యానించడం గమనార్హం. మెంటల్ అని నేను చెప్పే మాట కాదని, బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగినప్పుడు కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో తనకు తాను మానసిక వికలాంగుడ్ని అని చెప్పుకున్నారని గుర్తు చేస్తూ ఘాటైన విం,విమర్శలు చేశారు. దేశంలోని నాలుగు ప్రముఖ మెంటల్‌ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నానని… సెల్ఫ్‌ సర్టిఫైడ్‌ సైకోగా అఫిడవిట్‌లో స్పష్టంగా పేర్కొన్నాడని రోజా తెలిపారు. అలాంటి మానసిక రోగి తెలుగుదేశం కోసం నేను పోరాడుతానని చెబుతుంటే ఆ పార్టీ కేడర్‌లో భయం మొదలైందని, తమ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు ఉందననే అసంతృప్తి కార్యకర్తల్లో ఉందని చెప్పారు.
అవినీతి చేసిన దొంగ సాక్ష్యాధారాలతో సహా దొరికి జైలుపాలయిన బావ చంద్రబాబు కోసం పోరాడితే అది తెలుగువాడి కోసమో, తెలుగువాడి పౌరుషం కోసమో పోరాడినట్లు కాదని బాలకృష్ణకు అన్నారు.
ఎన్టీరామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించి తెలుగువాడికి అండగా ఉంటే పార్టీని లాక్కుని వైశ్రాయ్‌హోటల్‌ దగ్గర చెప్పులేయించి, కన్నీరు పెట్టించిన చంద్రబాబుపై ఆ రోజు పోరాడి ఉన్నట్లయితే తెలుగు ప్రజలంతా సంతోషించి ఉండే వారన్నారు. బాలకృష్ణ ఒక దొంగను కాపాడేందుకు పోరాటం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *