ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణలు వేగం పుంజుకుంటున్నాయి. అక్కడి జనసేన పార్టీ బిజెపి తో కలిసి వైసిపితో పోటీకి దిగుతుందని వచ్చిన ఉహాగానాలకు పవన్ కళ్యాణ్ తెర దించారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి రంగంలోకి దిగనున్నాటు జనసేన అధినేత స్పష్టం చేశారు. రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడితో ములాఖత్ అయిన తర్వాత పవన్ విలేకర్లతో మాట్లతుతూ పొత్తు విషయాన్నీ చంద్రబాబుతో చర్చించినట్టు, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి బరిలోకి దిగనున్నట్టు తేల్చి చెప్పారు.తమ పార్టీ ఇప్పటికీ ఎన్డీఏ తో కలిసి ఉందనీ, స్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపధ్యంలో బీజేపీ సమిష్టి గా ఫోటిచేసేందుకు ముందుకు వాస్తుందో లేదో తెలియదని వ్యాఖ్యానించారు. బీజేపీ కలిసి వచ్చినా, రాకపోయిన టీడీపీతో పొత్తు మాత్రం కచ్చితంగా ఉంటుందనే నిర్ణయం తీసుకున్నట్టు పవన్ చెప్పారు.
జైలు సాక్షిగా పొత్తు….
