ములుగు జిల్లాలో 9 వందల కోట్ల రూపాయల వ్యయంతో కేంద్రీయ గిరిజన విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో భాగంగా తెలంగాణలోసుమారు 13,500 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే వివిధ రకాల అభివృద్ధి పనులకు అయన శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోడీ మాట్లాడారు. సమ్మక్క- సరక్క ల పేరుతో గిరిజన యూనివర్సిటీ ప్రారంభించనున్నట్టు వివరించారు. అదేవిధంగా రాష్ట్రంలో పసుపు రైతుల సంక్షేమానికి కేంద్రం కట్టుబడివుందని,అందుకే పసుపు పండించే రైతుల వెతలు తీర్చడానికి జాతీయ పసుపు అభివృద్ధి బోర్డును సైతం ఏర్పాటు చేస్తున్నట్లు మోడీ ప్రకటించారు. హన్మకొండలో ఏర్పాటు చేసే టెక్స్ టైల్ పార్క్ వల్ల వరంగల్, ఖమ్మం జిల్లాల వారికి మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రధాని చెప్పారు.