భారీ నష్టం….

IMG 20231008 WA0015

పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్‌ను వణికించిన భూకంపాల వల్ల మృతుల సంఖ్య భారీగా పెరిగినట్లు తాలిబన్‌ ప్రతినిధి ప్రకటించారు. మృతుల సంఖ్య రెండు వేలకు చేరుకుందని అన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో శనివారం 6.3 తీవ్రతతో సంభవించిన భూకంపం, అనంతరం బలమైన ప్రకంపనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో సుమారు 320 మంది మరణించారని, వేలాది మంది గాయపడ్డారని జాతీయ విపత్తు సంస్థ తెలిపింది. హెరాత్‌ ప్రావిన్స్‌ జెండా జాన్‌ జిల్లాలోని నాలుగు గ్రామాలు భూంకంపం దాటికి ప్రభావితమయ్యాయని విపత్తు అధికార ప్రతినిధి మహ్మద్‌ అబ్దుల్లా జాన్‌ తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్‌లోని ప్రపంచ ఆరోగ్య సంస్థ క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించేందుకు 12 అంబులెన్స్‌లను ఆ పంపినట్లు పేర్కొన్నారు. హెరాత్‌లో టెలిఫోన్‌ కనెక్షన్లు తెగిపోయాయని, ప్రభావిత ప్రాంతాల నుండి వివరాలు అందడం లేదని అన్నారు.ఐక్యరాజ్యసమితి అందించిన ప్రాథమిక వివరాల ప్రకారం 465 ఇళ్లు ధ్వంసం కాగా, మరో 135 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని అన్నారు. భవనాల శిథిలాల కింద అనేక మంది చిక్కుకుపోయారని, సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయని చెప్పారు.మృతుల సంఖ్య భారీగాపెరిగే అవకాశం ఉందని ఐరాస, స్థానిక అధికారులు అంచనా వేస్తున్నారు.గతేడాది జూన్‌లో ఆఫ్ఘనిస్తాన్‌లో సంభవించిన భూకంపంలో దాదాపు వెయ్యి మందికి పైగా మరణించారు. దాదాపు 10 వేల మంది నిరాశ్రయులయ్యారు. అప్పట్లో భూకంపం తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 5.9గా నమోదైంది. ఈ ఏడాది మార్చిలో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ సరిహద్దుల్లో 6.5 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల 13 మంది చనిపోయారు.ఈ భూకంపాల వల్ల ఆయా పట్టణాల్లో ప్రజలు ప్రాణాలు అర చేతిలో పెట్టుకొని జీవిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *