“బాబు”గదికి ఏ.సి….

Screenshot 20230909 091951 WhatsApp

రాజమండ్రి కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న అంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరోగ్య సమస్యలకు సంబంధించి వైద్యులు అందజేసిన కీలక నివేదిక అయన కుటుంబ సభ్యులను, పార్టీ శ్రేణులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.బాబు ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఉన్నట్టు రాజమండ్రి ప్రభుత్వ వైద్యుల జైలు అధికారులకు అందజేసిన మెడికల్ రిపోర్ట్ బయటకు పొక్కడం పలురకాల వదంతులకు దారి తీసింది. చంద్రబాబుకి చర్మ సంబంధ సమస్యలు ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నట్టు తెలుస్తోంది.చేతులు, మొహంతో పాటు ఇతర శరీర భాగాల్లో దద్దర్లు, స్కిన్ అలెర్జీ, ఫంగల్ ఇన్ ఫెక్షన్ ఎక్కువగా ఉన్నట్టు,గడ్డం మీద, అరచేతి‌భాగాల్లో, చాతి భాగంలో, శరీరంలోని పలు భాగాల్లో హెరిటమతాస్ దొద్దుర్లు, చర్మం రంగు మారినట్లుగా వైద్యుల నివేదిక పొంటుపరిచినట్టు సమాచారం అందుతోంది. కలామన్ లోషన్ తో పాటు, అరచేతుల కోసం మార్చురెక్స్ సాఫ్ట్ క్రీమ్, ఫంగల్ ఇన్ ఫెక్షన్ కోసం మెకనాజల్ రిఫర్ చేసినట్టు తెలుస్తోంది. చంద్రబాబుకు డిహైడ్రేషన్ కారణంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా చల్లని వాతావరణం ఉండేలా ఏర్పాట్లు చెయ్యాలని నివేదిక లో స్పష్టంగా సూచించినట్టు విశ్వసనీయ సమాచారం.ఇదిలా ఉంటే, చంద్రబాబు ఆరోగ్యం విషయాన్ని పరిశీలించిన ఎసిబి కోర్టు జైలు లోని అయన గదిలో ఎ.సి. ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *