తండ్రీ, కొడుకుల అబద్ధాలు….

uttam

ఎన్నికల ప్రచారంలో కేసీఆర్,కేటీఆర్ ,హరిష్ రావు లు ఓటమి భయం తో అబద్దాలు మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. రైతు బంధు ఆపాలని నేను గానీ, కాంగ్రెస్ నేతలు కూడా ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు. గత నెలలో రైతు బంధు ,దళిత బంధు ,బీసీ బంధు ,రుణమాఫీ లు నామినేషన్ ప్రక్రియ కంటే ముందే విడుదల చేయాలని డిమాండ్ చేసినట్టు గుర్తు చేశారు.రైతుబంధు ఆపాలని కాదని, దాన్ని మరింతగా పెంచాలని డిమాండ్ చేస్తున్నట్టు ఉత్తమ్ తెలిపారు. ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేయాలని కాంగ్రెస్ మేనిఫెస్టో లో పెట్టిందని, ఏక కాలంలో రుణమాఫీ చేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమే అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దేశంలోనే మొదటిసారి వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇచ్చింది కాంగ్రెస్ అని గుర్తు చేశారు. తెలంగాణ లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని, రైతంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని వెల్లడించారు. మోడీ ,కేసీఆర్ లు రైతులకు అన్యాయం చేశారని ఆరోపించారు. రైతులకూ పంట నష్టం జరిగితే పంట భీమా లేని ఏకైక రాష్ట్రము తెలంగాణ మాత్రమే అన్నారు.లక్ష కోట్ల అప్పు తెచ్చి కాళేశ్వరం కడితే ఒక ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వక ముందే కూలిపోయిందన్నారు. కాళేశ్వరం లో అవినీతి వల్లే నాణ్యత లోపం జరిగిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.దీనిపై కేసీఆర్ కుటుంబం తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పిన తరువాతే ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *