తెలంగాణ ఎన్నికలపై ప్రముఖ సర్వే సంస్థ లోక్‌పోల్ నిర్వహించిన సర్వేలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానుంది. 74 సీట్లతో కాంగ్రెస్ తిరుగులేని విజయం సొంతం చేసుకోబోతోందని, లోక్‌పోల్ సర్వే సంస్థ వెల్లడించింది. సీఎం కేసీఆర్ కామారెడ్డి- గజ్వేల్‌లో రెండు చోట్లా విజయం సాధించనుండగా, బీఆర్‌ఎస్‌కు మొత్తంగా కేవలం 29 స్థానాలు మాత్రమే దక్కనున్నట్లు పేర్కొంది. ఇక బీజేపీకి 9, మజ్లిస్‌కు 6 స్థానాలు వస్తాయని వెల్లడించింది. ప్రధానంగా నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో కాంగ్రెస్ దాదాపు అన్ని సీట్లలో గెలుస్తుందని లోక్‌పోల్ సర్వే అంచనా వేసింది. గ్రేటర్ హైదరాబాద్‌లో సర్వే ఫలితాలు కొంచెం చిత్రంగా కనిపిస్తున్నాయి. బీఆర్‌ఎస్,కాంగ్రెస్,బీజేపీ మూడేసి స్థానాల్లో విజయం సాధించనున్నట్లు పేర్కొంది. అంటే బీఆర్‌ఎస్ నుంచి మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, మాగంటి గోపీనాధ్‌లు మళ్లీ విజయం సాధించనున్నట్లు స్పష్టమవుతోంది. హైదరాబాద్ శివారు నియోజకవర్గాలైన కూకట్‌పల్లి, ఎల్బీనగర్, ఉప్పల్, మేడ్చెల్‌లో బీఆర్‌ఎస్ విజయం సాధించనుంది. శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, ముషీరాబాద్, అంబర్‌పేట, గోషామహల్‌లో బీజేపీ విజయం సాధించబోతోందని తేలింది. మల్కాజిగిరి, నాంపల్లి, ఖైరతాబాద్, కంటోన్మెంట్, కుత్బుల్లాపూర్, ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, పరిగి, వికారాబాద్, తాండూరు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ జెండా ఎగరనున్నట్లు సర్వే ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.
ఇక ఖమ్మంలో 9 కాంగ్రెస్, సీపీఐ1, రంగారెడ్డిలో 7 కాంగ్రెస్, టీఆర్‌ఎస్-5, బీజేపీ 2, వరంగల్‌లో కాంగ్రెస్ 9, బీఆర్‌ఎస్ 3, నల్లగొండలో 12 స్థానాలకు 12 కాంగ్రెస్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో 11 కాంగ్రెస్- బీఆర్‌ఎస్ 3, మెదక్‌లో బీఆర్‌ఎస్-6, కాంగ్రెస్-3, బీజేపీ-1 , కరీంనగర్‌లో కాంగ్రెస్-8, బీఆర్‌ఎస్-3, బీజేపీ-2, నిజామాబాద్‌లో కాంగ్రెస్-6, బీఆర్‌ఎస్-3, ఆదిలాబాద్‌లో కాంగ్రెస్-6, బీఆర్‌ఎస్-3, బీజేపీ 1 స్థానాల్లో విజయం సాధించనున్నట్లు, లోక్‌పోల్ తన సర్వే ఫలితాలను వెల్లడించింది.