తెలంగాణను ప్రతేక రాష్ట్రంగా చేసి, ఇక్కడి ప్రజల ఆకాంక్షను నెరవేర్చింది కాంగ్రెస్ పార్టీయే అని ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ చెప్పారు. కెసిఆర్ చదువుకున్న స్కూలుని కట్టించిది కుడా కాంగ్రెస్ పార్టీనే అని తెలిపారు. తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ ఏమి చేసిందంటూ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పదేపదే అడుగుతున్న ప్రశ్నకు ఇదే నా సమాధానం అన్నారు. తెలంగాణ ముసుగులో బిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లుగా ప్రజలను నిలువు దోపిడీ చేసిందని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు దోచుకున్నారని, దేనికీ ఉపయోగపడని ధరణి పోర్టల్ నుండి పేదలకు చెందినా వేలాది ఎకరాల భూములు లాక్కున్నారని, నిరుద్యోగులను నమ్మించి మోసం చేసిన ఘనత కెసిఆర్ ఆధ్వర్యంలోని బిఆర్ఎస్ ప్రభుత్వానిదని దుయ్యబట్టారు. పేపర్ లికులతో నిరుద్యోగులను రోడ్డు పాలు చేశారని, తెలంగాణలో ఉద్యోగాలను ఎందుకు భర్తీ చెయ్యడం లేదని ప్రశ్నించారు. దళిత బంధు పథకం పేరుతొ ఎమ్మెల్యే లు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని, తెలంగాణ దొరల సర్కార్ అయ్యిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీ హామీలను కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అమలుతోకి తీసుకువచ్చి ప్రజా సర్కార్ అంటే ఏలా ఉండాలో కాంగ్రెస్ పార్టీ చూపిస్తుందని తేల్చి చెప్పారు. మొదట మహా లక్ష్మీ పథకం, 500 వందలకు గ్యాస్ సీలండర్, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీల అమలుకు 5 వేల కోట్లు అకౌంట్స్ లో జమ చేస్తామని వివరించారు. అంతేకాక, రైతులకు 24 గంటల ఉచిత కరెంటును, వ్యవసాయ సాగుకు 15 వేల రుపాయన సాయం, రోజు వారీ కూలీలకు 12 వేల రూపాయలు, పేదల ఇంటిఇంటి నిర్మాణానికి 5 లక్షలు, తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం వంటి హామీలను నెరవేర్చే భాద్యత కాంగ్రెస్ పార్టీదని చెప్పారు. ప్రతి మండలంలో ఓ ఇంటర్నేషన్ స్కూల్ ను నిర్మించి నాణ్యమైన విద్యను అందిచాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని అడ్డుకోవడానికి బీఆర్ఎస్,ఎంఐఎం,బిజెపి కుమ్మక్కయ్యాయని, అయినప్పటికీ విజయం సాదిసతామని రాహుల గాంధీ ధీమా వ్యాక్తం చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బిజెపిని ఇంటికి పంపించవచ్చని కోరారు.
కెసిఆర్ చదివిన స్కూలు మేము కట్టిందే…!
