గత రెండు ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా అధికార పార్టీకి నిరసనల సెగ తగులుతోంది. బిఆర్ఎస్ బలంగా ఉందనుకున్న జగిత్యాల జిల్లా వెల్గటూర్ లో మంత్రి కేటీఆర్ రోడ్ షో ముగించుకుని తిరిగి వెళుతుండగా పలువురు రైతులు నిరసనకు దిగారు. పాశిగామలో కొందరు రైతులు ప్లకార్డులతో రోడ్డు ఎక్కారు. కేటిఅర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. కాలేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎవరికి లాభం, ప్రభుత్వానికా, మంత్రికా, మీ ఫామ్ హౌస్కా, కొప్పుల ఈశ్వర్ కా, కటింగ్ లేకుండా వడ్లు కొనే దమ్ము ఉందా అనే నినాదాలతో ప్లకార్డులను ప్రదర్శించడం సంచలనంగా మారింది.