తెలంగాణలో ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. నెల రోజుల పాటు హోరాహోరీగా సాగిన ప్రచారంలో మారుమోగిన మైకు శబ్దాలు ముగాబోయాయి. ౩౦వ తేదిన జరిగే పోలింగ్ ప్రక్రియకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 119 శాసన సభ నియోజక వర్గాల్లో 2,290 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు. మొత్తం 35,655 పోలింగు కేంద్రాలను ఏర్పాటు చేశారు. 45 వేల మంది పోలీసులు భద్రతా చర్యల్లో పాల్గొంటారు.ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అన్ని జిల్లాల్లో మంగళవారం సాయంత్రం అన్ని వైన్ షాపులు, బార్ లను మూసివేశారు.