తెలంగాణ శాసన సభ ఎన్నికల్లో అనుకున్నదే జరిగింది. ఎవరికైనా, ఏ పార్టీకి అయినా సరే ముడోసారి అధికారం కట్టబెట్టేదే లేదని ఓటర్లు తేల్చి వేశారు. “ఒక్క ఛాన్స్” కోరికకు పట్టం కట్టి, “హ్యాట్రిక్” కలలను కలగానే ఉంచారు. ఒంటెద్దు పోకడల పాలకులను వ్యవసాయ క్షేత్రాలకే పరిమితమయ్యేలా చేశారు. గత నెల ౩౦న జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఉద్యమ పార్టీగా చెప్పుకుంటున్న భారత రాష్ట్ర సమితిని ఇంటికి పంపి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరధం పట్టారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్తీ స్థాయి మెజారిటీకి “చెయ్యి”ఎత్తారు. ఈ సారి ఫలితాల సరళిని చూస్తే ప్రభుత్వంపై వ్యతెరేకత సామాన్య ఓటరులో మాత్రమే కాదు, ప్రభుత్వ ఉద్యోగుల్లోను పెద్ద ఎత్తున గూడుకట్టుకున్నట్టు తేలిపోయింది. ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చి 2014 వ సంవత్సరంలో అధికారాన్ని ఉద్యమ పార్టీ చేతుల్లో పెట్టిన కాంగ్రెస్ పార్టీ క్రమంగా పట్టు కోల్పోయింది. రేవంత్ రెడ్డి 2017లో కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తర్వాత తిరిగి పార్టీకి ఉపిరి పెరిగింది. ఏడేళ్ళ నిర్విరామ కృషి ఫలించింది. రాష్ట్ర ప్రజలుప కాంగ్రెస్ కి పట్టం కట్టి రేవంత్ రెడ్డిని నేతగా ఎన్నుకున్నారు.దీంతో ఉద్యమ పార్టీ కలలుగన్న హ్యట్రిక్ చేజారింది. ఎన్ని ఎత్తులు వేసినా సరే ముడో సారి అధికారం ఇచ్చేదే లేదని బిఆర్ఎస్ కి దాన్ని నడుపుతున్న నేతలకు “ఓటు”తో సమాధానం ఇచ్చారు.