గత ప్రభుత్వంలో ఉద్యోగుల సమస్యలను ఎంతమాత్రం పట్టించుకోకుండా “ఒంటెద్దు పోకడ” ప్రభుత్వానికి వత్తాసు పలికిన తెలంగాణ ఎన్జీవో సంఘ భాజన” బృందం ఎట్టకేలకు కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసింది. గత పదేళ్లుగా పదవులు, ప్రమోషన్లను అడ్డుపెట్టుకొని సచివాలయం, ప్రగతి భవన్ లను అడ్డాలుగా చేసుకొని ఉద్యోగుల బాగోగులను తుంగలో తోక్కిన్ ఈ బృందం తప్పని పరిస్థితుల్లో ముఖ్యమంత్రిని కలిసింది. ఉద్యోగుల కుటుంబాలను విడదీసిన 37౦ మల్టీ జోన్ల జీ.ఓ. విషయంలో, సగం నెల గడిచినా జీతాలు చెల్లించని ప్రభుత్వ నిర్లక్ష్యం వ్యవహారంలో, జీతాల పెంపు సమయంలో కనీసం ప్రభుత్వంతో చర్చించే ప్రయత్నం కూడా చేయని ఈ భజన బృందం కొత్త ప్రభుత్వానికి దగ్గర కావడానికి పన్నాగాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ఈ భజన బృందాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం పక్కన పెట్టాలని, గత పదేళ్లుగా వాళ్ళు చేసిన సర్వీసుల పై విచారణ చేపట్టాలని సచివాలయ ఉద్యోగులే వ్యాఖ్యానిస్తున్నారు.