ఈ సంవత్సరం అక్టోబర్‌లో గగన్‌యాన్ మిషన్‌ను అంతరిక్షం లోకి పంపేందుకు సిద్ధమైంది. గగన్‌యాన్ ప్రోగ్రాంలో భాగంగా చేపట్టిన మానవ రహిత అంతరిక్ష ప్రయోగంలో ఇది ఒక భాగమని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి జితేందర్ సింగ్ అన్నారు. అక్టోబర్ మొదటి, రెండో వారంలో గగన్‌యాన్ తొలి ట్రయల్ రన్‌ను ఇస్రో చేపట్టనుందని తెలిపారు. రెండో ప్రయోగంలో మహిళా రోబో వ్యోమమిత్రను అంతరిక్షం లోకి పంపనున్నారు. మనిషి మాదిరిగానే అన్ని పనులు నిర్వహించగలిగే ఈ రోబోను పంపించిన తరువాత అంతా సవ్యంగా సాగితే ఇక వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించవచ్చన్నారు. భూమి పై నుంచి 400 మీటర్ల ఎత్తు లోని కక్ష్య లోకి గగన్‌యాన్ మిషన్ ద్వారా వ్యోమగాములను తీసుకెళ్లనున్నారని వివరించారు.