“నన్నూ, నా పార్టీని టచ్ చేసి చూడండి” అంటూ బిఆర్ఎస్ అగ్రనేత కెసిఆర్ కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నా అందుకు భిన్నంగా సొంత పార్టీ నుంచే ఎదురు దెబ్భ తగులుతోంది. మొన్న బిఆర్ఎస్ ఎంపి వెంకటేష్ నేత కాంగ్రెస్ కండువా కప్పుకోగా మరి కొందరు తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధ పడుతున్నారు. బిఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, వికారాబాద్ జెడ్పీ చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం విశేషం. రెండు,మూడు రోజుల్లో ఇధ్దరూ కాంగ్రెస్ లో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే, చేవెళ్ళ లోక్ సభ టిక్కెట్ ఆశిస్తున్న సునీత చేవెళ్ళ లోనే బహిరంగ సభ నిర్వహించి పార్టీలో చేరాలా లేదా డిల్లీ పెద్దల సమక్షంలో కండువాలు కప్పుకోవాలా అనే విషయంలో నిర్ణయం తీసుకొని తేదీని ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది.