IMG 20230817 WA0034

“చిలుక” దొంగ….

ఉత్తరప్రదేశ్ లోని గజియాబాద్ లో రామచిలుకలను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.135 చిలుకలను ఒక డబ్బాలో కుక్కి బస్సు స్టేపిని ఉండే చోట దాచిపెట్టాడు. బస్సు నుంచి వచ్చే వేడికి కొన్ని, గాలి అందక మరికొన్ని కలిపి మొత్తం 125 చిలుకలు ప్రాణం విదిచాయి.

Read More
Screenshot 20230817 170851 WhatsApp

పోటెత్తిన “పోర్టు”…

విశాఖ గంగవరం పోర్టు వద్ద కార్మికులు చేపట్టిన ‘పోర్టు బంద్’ ఉద్రిక్తతకు దారి తీసింది. తొలగించిన పోర్టు కార్మికులను విధుల్లోకి తీసుకోవడంతో పాటు కనీస వేతనం రూ.36 వేలు చెల్లించాలనే డిమాండ్లతో కార్మిక సంఘాలు బంద్ కి పిలుపు నిచ్చాయి. ఈ మేరకు గురువారం ఉదయం  కార్మికులు, నిర్వాసితులు, కాలుష్య ప్రభావిత ప్రాంతాల ప్రజలు, అఖిలపక్ష నేతలు పెద్ద ఎత్తున గంగవరం పోర్టు వద్దకు చేరుకున్నారు.  కార్మికుల బంద్ పిలుపు నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. పోర్టు…

Read More
Screenshot 20230817 123721 Video Player

“పోర్టు”లో పోరు….

ఆంధ్రప్రదేశ్ లోని గంగవరం పోర్టు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ డిమాండ్ల సాధన కోసం కార్మికులు చేపట్టిన ఆందోళనలో పలువురు పోలీసులు, కార్మికులకు గాయాలయ్యాయి. పోర్టులోకి చొచ్చుకెళ్లేందుకు కార్మికులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన ఇరు వర్గాల మధ్య తీవ్ర తోపులాటలో 10 మంది పోలీసులు సహా పలువురు కార్మికులు గాయపడ్డారు.

Read More
Screenshot 20230814 121737 WhatsApp 1

అలా జరిగింది…

సరదా కోసం సముద్రంలోకి వెళ్లి మునిగిపోతున్న ఇద్దరు యువకుల ప్రాణాలను పోలీసులు కాపాడారు. కర్నూలు జిల్లాకి చెందిన పుల్లేటి మహేష్, గోగుల రమణ తోటి యాత్రికులతో కలిసి బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం సముద్ర తీరంలో స్నానం చేస్తుండగా ఒక్కసారిగా వచ్చిన పెద్ద అలల తాకిడికి సముద్రంలోకి వెళ్ళి పోయారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది, మెరైన్ సిబ్బంది వెంటనే స్పందించి కానిస్టేబుల్ గణేష్, ఎం. వెంకటేశ్వర్లు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సముద్రంలోకి…

Read More
babu 1

ఏ1 గా చంద్రబాబు..

పుంగనూరు అల్లర్ల కేసులో చంద్రబాబుపై ఎఫ్.ఐ.అర్. నమోదైంది. ఈ నెల 4న తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన “యుద్ధభేరి” పర్యటనలో చిత్తూరు జిల్లా పుంగనూరులో జరిగిన అల్లర్లకు సంబంధించి పోలీసులు తాజాగా మరో రెండు కేసులు నమోదు చేశారు. అన్నమయ్య జిల్లా ముదివీడు పీఎస్‌లో ఏ1 గా చంద్రబాబు, ఏ 2గా దేవినేని ఉమ, ఏ3గా అమర్నాథ్‌రెడ్డి పేర్లతో ఎఫ్.ఐ.అర్. నమోడు చేసినట్టు పోలీసులు తెలుపారు. ఇదిలా ఉంటే, అల్లర్లకు…

Read More
promotin

మూడు సింహాలు…

రాష్ట్రంలో ముగ్గురు సీనియర్ ఐపిఎస్ అధికారులకు పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారి చేసింది.1991బ్యాచ్ కి చెందినా రాజీవ్ రతన్, సి.వి. ఆనంద్, 1992 బ్యాచ్ కి చెందిన జితేందర్ లకు డి.జి.పి.లుగా పదోన్నతులు లభించాయి. ప్రస్తుతం వీళ్ళలో రాజీవ్ రతన్ పోలీసు హౌసింగ్ కార్పోరేషన్ ఎం.డి. సి.వి. ఆనంద్ నగర పోలీస్ కమిషనర్ గా, జితేందర్ హోం శాఖ ముఖ్య కార్యదర్శిగా పని చేస్తున్నారు.

Read More