సినిమా కాదు పవన్…

Screenshot 20231004 214801 WhatsApp

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు కృష్ణా జిల్లా పోలీసులు నోటీసులు ఇచ్చారు. వారాహి యాత్రపై రాళ్ల దాడికి ప్లాన్‌ చేశారంటూ పవన్‌ కల్యాణ్‌ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.  ఆ ఆరోపణలకు సాక్ష్యాలు ఏవైనా ఉన్నాయా అని నోటీసులు ఇచ్చినట్లు జిల్లా ఎస్పీ జాషువా వెల్లడించారు. పవన్‌ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.

అందుకే నోటీసులు ఇచ్చామని, దాడులు జరగుతాయనే సమాచారం మీకు ఎక్కడి నుంచి వచ్చిందనేది మాకు తెలియజేయలని కోరినట్టు,  నోటీసులకు పవన్‌ నుంచి తిరుగు సమాధానం రాలేదంటే ఆయన నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారాని అనుకోవాలా అని  ఎస్.పి. అన్నారు.ఎటువంటి సమాచారంతో పవన్‌ వ్యాఖ్యలు చేశారని,సరైన ఆధారాల్లేకుండా వ్యాఖ్యలు, ఆరోపణలు చేయకూడదని,బాధ్యతారాహిత్యంగా ఆరోపణలు చేస్తే పర్యవసానాలు ఉంటాయని జాషువా తెలిపారు. రెచ్చగొట్టే భాష, సైగలు మానుకోవా లని, మా సమాచార వ్యవస్థ మాకుందని, పవన్‌ కంటే నిఘా వ్యవస్థ మాకు బలంగా ఉందని తెలిపారు. అసాంఘిక శక్తులుంటే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *