four c

ఆంధ్రాలో ఆ “నలుగురు”..!

ఆంధ్రప్రదేశ్ లో వడివడిగా మారిన రాజకీయ పరిణామాలు నిజంగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. కొద్ది రోజుల్లో  అక్కడ జరగనున్న ఎన్నికల తంతు రెండు కుటుంబాల చుట్టూనే తిరిగే విచిత్రమైన  పరిస్థితి కనిపిస్తోంది. అక్కడి రాజకీయ చదరంగంలోకి షర్మిల, పురందేశ్వరి రెండు ప్రధాన జాతీయ పార్టీల పగ్గాలు చేత పట్టు కోవడంతో  ఆంధ్ర రాజకీయాల్లో కొంత కాలం కిందటి  వరకు ఉన్న సమీకరణలు  క్రమేపీ మారుతూ వస్తున్నాయి.  రెండు జాతీయ పార్టీలు, రెండు ప్రాంతీయ పార్టీలు  రెండు కుటుంబాల చేతిలోనే…

Read Full News
ram in

హే..రామ్..శ్రీ రామ్..

కోట్లాది ప్రజల నిరీక్షణకు తెరదించుతూ అయోధ్యలో బాల రాముడు కొలువుదీరాడు. రామ జన్మ భూమిలో అపురూప రామ మందిరం ఆవిష్కృతమైంది. జయ,జయ ధ్వానాలు, రామ కీర్తనల మధ్య బాల రాముడు ఆలయంలో ప్రతిష్టమైయాడు. ప్రధాని మోదీ చేతుల మీదుగా అభిజిత్ లగ్నంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా కొనసాగింది. రేపటి నుంచి నీల మేఘ శ్యాముడు భక్త జన కోటికి దర్శనం ఇవ్వనున్నాడు.

Read Full News
drama trs C

తప్పించుకునే తంటాలు….!

తెలంగాణలో మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన భారత రాష్ట్ర సమితి (బి.ఆర్.ఎస్.)పార్టీ  తన మనుగడను కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతున్నట్టు కనిపిస్తోంది. బి.ఆర్.ఎస్. పార్టీ అధికారంలో ఉన్నపుడు వివిధ రంగాల్లో వాటిల్లిన వేల కోట్ల రూపాయల నష్టం, అప్పులు, చెల్లింపులు, అవినీతి కాంట్రాక్టుల నిగ్గుతేల్చి పరిపాలనను గాడిలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్న కొత్త ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టిందుకు అత్యంత ప్రమాదకరమైన ఎత్తుగడలు వేయడం అంతుపట్టకుండా ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. కెసిఆర్ పదేళ్ళ పాలనలో జరిగిన…

Read Full News
rvanth london

లండన్ అందాలు…

లండన్‌ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అక్కడ పలు స్మారక కేంద్రాలను సందర్శించారు. లండన్ లో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన చారిత్రక కట్టడాలనూ, స్మారక కేంద్రాలను ఆయన దర్శించారు.. బిగ్‌బెన్, లండన్‌ ఐ, టవర్‌ బ్రిడ్జ్‌ ఎట్‌ ఆల్‌ కట్టడాలను సీఎం తిలకించారు. ఆ దేశ పురోగతి, ఆర్థికాభివృద్ధిలో ఈ పర్యాటక కేంద్రాల పాత్రను రేవంత్ అడిగి తెలుసుకున్నారు. మన రాష్ట్రంలోని పలు పర్యాటక కేంద్రాల అభివృద్ధి, తద్వారా వచ్చే ఆదాయం, ఉపాధి అవకాశాల కల్పన ఎలా సాధించాలనే…

Read Full News
sabari temple

మూతపడ్డ ఆలయం…

స్వాముల శరణుగోషతో మారుమోగిన శబరి కొండలు మూగబోయాయి. తెల్లవారు జామున ప్రత్యేక పూజల అనంతరం అయ్యప్ప ఆలయాన్ని మూసి వేశారు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో భక్తులు దర్శించుకోగా అదే స్థాయిలో ఆదాయం సమకూరింది. శబరిమలలో చలికాల మణికంఠుని దర్శనం ముగిసింది. ఈ ఏడాదికి గాను మండల, మకర విలక్కు పూజలు సమాప్తం అయ్యాయి. ఉదయం 5.30 గంటల సమయంలో ప్రత్యేక పూజలు చేసి అయ్యప్ప ఆలయం మూసి వేశారు. ఈ ఏడాది 50 లక్షల మందికి…

Read Full News
baalaraam

అదే దివ్య రూపం…

ప్రాణ‌ ప్ర‌తిష్ఠ‌కు ముందే బాల‌ రాముడి దివ్య‌ రూపం భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తోంది. బాల‌ రాముడి చేతిలో బంగారు వ‌ర్ణంలో ఉన్న విల్లు, బాణం ఉంది. బాల‌ రాముడి విగ్ర‌హం త‌యారీ త‌ర్వాత కార్య‌శాల‌లో తీసిన ఫోటో బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆ ఫోటో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అయితే, శ్రీరామ జ‌న్మ‌భూమి తీర్థ క్షేత్ర ట్ర‌స్టు ఆ ఫోటోపై స్పందించింది. అదే బాల‌ రాముడి దివ్య‌ రూపం అని తెలిపింది. శుక్ర‌వారం ఉద‌యం క‌ళ్ల‌కు గంత‌ల‌తో…

Read Full News
nursing dd c copy

“ఆకలి” తీరని అధికారులు…!

తెలంగాణ వైద్య విద్య శాఖ పరిధిలోని నర్సింగ్ విభాగంలో ప్రభుత్వం మారినా అధికారుల తీరు మారడం లేదు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం, ఒంటెత్తు పోకడల వల్ల సుమారు పదేళ్లుగా ఈ విభాగంలోని అధికారులు, సిబ్బందిదే ఇష్టారాజ్యంగా ఉంది. ఎనిమిది ఏళ్లకు పైగా ఒకే హోదాలో తిష్ట వేసుకుని కూర్చున్న అధికారుల వల్ల అనేక సమస్యల ఎదురవుతున్నాయని వివిధ ఆసుపత్రుల నర్సులు, నర్సింగ్ కాలేజీల్లోని బోధనా సిబ్బంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి ఎన్నికల తర్వాత వైద్య విద్యా…

Read Full News
iit dhrmndr

ఆత్మహత్యలు బాధాకరం…!

ఐఐటీ ల్లో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరమని, సమాజంలో ఎవరు ఆత్మహత్య చేసుకున్న అది కచ్చితంగా తప్పే అని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ అన్నారు. ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇవ్వడానికి విద్యా సంస్థల్లో కమిటీలు వేసినట్టు చెప్పారు. ఐఐటి  హైదరాబాద్ లో నిర్వహింహిస్తున్న “ఆర్ అండ్ డి ఇన్నొవేటివ్ ఫైర్ ఇన్వెంటివ్”  రెండవ ఎడిషన్‌ను ప్రాదాన్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో వెయ్యి కోట్లతో సమ్మక సారక్క గిరిజన…

Read Full News
revnth davos 1

“సర్జికల్” యూనిట్…

బ్రిటన్ కు చెందిన ప్రముఖ వైద్య పరికరాల తయారీ సంస్థ సర్జికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ గ్రూప్ హోల్డింగ్స్ (ఎస్.ఐ.జి.హెచ్.) హైదరాబాద్ లో తమ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ నెలకొల్పేందుకు ముందుకొచ్చింది. ఇప్పటివరకు దేశంలో తయారు చేయని పలు సర్జికల్ పరికరాలను ఇక్కడ తయారు చేస్తారు. రాబోయే రెండు, మూడు ఏళ్ల లో అందుకు అవసరమయ్యే రూ.231.5 కోట్ల పెట్టుబడులు పెడుతామని ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా విస్తరించే ప్రణాళికలో భాగంగా ఈ కంపెనీ భారతీయ మార్కెట్‌లోకి అడుగుపెడుతోంది. ఈ ఫెసిలిటీ ఏర్పాటుతో…

Read Full News
IMG 20240118 WA0009

వడ్డీ రాయితీ…

పేదలందరికి ఇళ్లు పథకంలో భాగంగా లబ్ధిదారులకు ఇప్పటివరకు 4,500.19 కోట్ల రూపాయల బ్యాంకు రుణాలు అందించినట్లు ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. వీటిపై లబ్ధిదారులు చెల్లెస్తున్న వడ్డీ మొత్తాన్ని ఏడాదికి రెండు విడతలుగా అందిస్తున్నట్లు వివరించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన వడ్డీ రీయింబర్స్ మెంట్ కార్యక్రమంలో అర్హులైన 4,07,323 లబ్దిదారులకు రూ.46.90 కోట్ల వడ్డీ రాయితీ మొత్తాన్ని విడుదల చేశారు. ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఒక్కో ఇంటి స్థలం మార్కెట్ విలువ ప్రాంతాన్ని…

Read Full News