మూతపడ్డ ఆలయం…

sabari temple

స్వాముల శరణుగోషతో మారుమోగిన శబరి కొండలు మూగబోయాయి. తెల్లవారు జామున ప్రత్యేక పూజల అనంతరం అయ్యప్ప ఆలయాన్ని మూసి వేశారు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో భక్తులు దర్శించుకోగా అదే స్థాయిలో ఆదాయం సమకూరింది. శబరిమలలో చలికాల మణికంఠుని దర్శనం ముగిసింది. ఈ ఏడాదికి గాను మండల, మకర విలక్కు పూజలు సమాప్తం అయ్యాయి. ఉదయం 5.30 గంటల సమయంలో ప్రత్యేక పూజలు చేసి అయ్యప్ప ఆలయం మూసి వేశారు. ఈ ఏడాది 50 లక్షల మందికి పైగా భక్తులు అయ్యప్ప దర్శనం చేసుకున్నట్లు ట్రావెన్‌ కోర్‌ దేవ స్థాన బోర్డు తెలిపింది. అలాగే, ఈ ఏడాది 357 కోట్ల 47 లక్షల రూపాయల ఆదాయం వచ్చినట్లు ప్రకటించింది. గతేడాదితో పోల్చితే దాదాపు పది కోట్లు అదనపు ఆదాయం అయ్యప్ప ఆలయానికి వచ్చినట్లు అధికారులు వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *