summer

నెల ముందే…

తెలుగు రాష్ట్రాలలో అప్పుడే భానుడి ప్రతాపం చుర్రు మంటోంది. ఫిబ్రవరి మొదటి వారంలోనే 36 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఒక్కసారిగా మారిన వాతావరణంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ సారి ఎండలు ముందే రానున్నాయి అని, గత ఏడాది కంటే కూడా ఎండల ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అంతేకాదు, వాతావరణ శాఖ ముందస్తుగా తగిన ఏర్పాట్లు చేసుకోమంటూ కొన్ని హెచ్చరికలను జారీ చేసింది. ఈ ఏడాది ఎండలు “బాబోయ్”…

Read Full News
isro 30

ఇక ప్రయోగాల రచ్చ..

రోదసి రంగంలో వరుస ప్రయోగాలతో సత్తా చాటేందుకు భారత్‌ సిద్ధమవుతోంది. రానున్న 14 నెలల్లో మన దేశం దాదాపు 30 అంతరిక్ష ప్రయోగాలు చేపట్టనున్నట్లు ‘ఇండియన్‌ నేషనల్‌ స్పేస్‌ ప్రమోషన్‌ అండ్‌ ఆర్గ నైజేషన్‌ సెంటర్‌ (ఇన్‌-స్పేస్‌) వెల్లడించింది. ఈ మేరకు తాజాగా సమీకృత ప్రయోగ మేనిఫెస్టోను ప్రకటించింది. వచ్చే 14 నెలల్లో చేపట్టనున్న ప్రయోగాల్లో ప్రతిష్ఠాత్మక గగన్‌యాన్‌ ప్రాజెక్టుకు సంబంధించినవి ఏడు ఉన్నాయని అందులో తెలిపింది. స్కైరూట్‌, అగ్నికుల్‌ వంటి ప్రైవేటు అంతరిక్ష అంకుర సంస్థల…

Read Full News
medaram

సాంప్రదాయాలు ఉట్టిపడేలా…

గిరిజన సాంప్రదాయాల ప్రకారం మేడారం మహా జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. మేడారంలోని హరిత హోటల్ సమావేశ మందిరం లో మీడియా ప్రతినిధులతో “మీడియా ఇంటరాక్షన్ ” కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జాతర లో గిరిజన సాంప్రదాయాలు ఉట్టిపడేలా రద్దీ ప్రాంతాలలో గిరిజన ప్రత్యేక పెయింటింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. జాతరలో నిరంతరం పారిశుధ్య పనులు జరిగిన నాలుగువేల మంది పారిశుధ్య…

Read Full News
pasiyuddin

కాంగ్రెస్ లోకి…

తెలంగాణ రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మొదటి డిప్యూటీ మేయర్ బాధ్యతలు నిర్వర్తించిన భారత రాష్ట్ర సమితి నాయకులు బాబా ఫసియుద్దీన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్ఎల్ఎ మాగంటి గోపీనాధ్ వేదింపుల వల్లే పార్టీని వీడుతున్నట్టు బాబా కెసిఆర్ కి లేఖ రాశారు. భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు తెలిపారు.

Read Full News
soren c

సోరెన్ కు “చాట్” ఉచ్చు..

భూ కుంభకోణం కేసులో జుడీషియల్ రిమాండ్‌లో ఉన్న జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ కు ఉచ్చు బిగుస్తోంది. తాజాగా ఈ.డీ. అధికారులు ఆయన ధ్వంసం చేసిన మొబైళ్లలో వాట్సప్ చాట్ రికవర్ చేశారు. 539 పేజీలతో ఉన్న ఈ చాట్‌లో మరికొన్ని అక్రమాలు వెలుగు చూశాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం సోరెన్ తన సన్నిహితులతో కలిసి ప్రభుత్వ భూములను లాక్కోవడమే కాకుండా లంచాలు తీసుకుంటూ అధికారులను వారు కోరిన చోటకి బదిలీ చేసినట్లు తేలింది….

Read Full News
patnam

మరో ఇద్దరు…

“నన్నూ, నా పార్టీని టచ్ చేసి చూడండి” అంటూ బిఆర్ఎస్ అగ్రనేత కెసిఆర్ కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నా అందుకు భిన్నంగా సొంత పార్టీ నుంచే ఎదురు దెబ్భ తగులుతోంది. మొన్న బిఆర్ఎస్ ఎంపి వెంకటేష్ నేత కాంగ్రెస్ కండువా కప్పుకోగా మరి కొందరు తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధ పడుతున్నారు. బిఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి,  వికారాబాద్ జెడ్పీ చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం విశేషం. రెండు,మూడు రోజుల్లో…

Read Full News
isro robo

స్పేస్ రోబో “వ్యోమ‌మిత్ర‌”..

ఈ సంవ‌త్స‌రం అక్టోబర్‌లో గగన్‌యాన్‌ మిషన్‌ను అంతరిక్షం లోకి పంపేందుకు సిద్ధమైంది. గగన్‌యాన్ ప్రోగ్రాంలో భాగంగా చేప‌ట్టిన మాన‌వ ర‌హిత అంత‌రిక్ష ప్ర‌యోగంలో ఇది ఒక భాగ‌మ‌ని కేంద్ర సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖ మంత్రి జితేందర్‌ సింగ్ అన్నారు. అక్టోబర్‌ మొదటి, రెండో వారంలో గగన్‌యాన్‌ తొలి ట్రయల్‌ రన్‌ను ఇస్రో చేపట్టనుందని తెలిపారు. రెండో ప్రయోగంలో మహిళా రోబో వ్యోమమిత్రను అంతరిక్షం లోకి పంపనున్నారు. మనిషి మాదిరిగానే అన్ని పనులు నిర్వహించగలిగే ఈ రోబోను…

Read Full News
drone cm c

హైదరాబాద్ లో “డ్రోన్ పోర్ట్”

ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ)తో తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ డ్రోన్ పైలెట్లకు అధునాతన శిక్షణపై అవగాహన ఒప్పందం చేసుకుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ సమక్షంలో తెలంగాణ ఏవియేషన్ అకాడమీ సీఈవో ఎస్.ఎన్.రెడ్డి, ఎన్.ఆర్.ఎస్సీ డైరెక్టర్ ప్రకాష్ చౌహన్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజుతో పాటు ఎన్.ఆర్.ఎస్.సీ…

Read Full News
vnktsh neta

కాంగ్రెస్ లోకి బిఆర్ఎస్ ఎం.పి..

తెలంగాణాలో ఘోర పరాజయంతో సతమవుతున్న భారత రాష్ట్ర సమితికి మరో గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన పెద్దపల్లి నియోజక వర్గ పార్లమెంటు సభ్యులు వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. టీటీడీ బోర్డ్ మాజీ సభ్యుడు మన్నె జీవన్ కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

Read Full News
balka c

అధికారం లేక అసహనం…!

అధికారంలో ఉన్నప్పుడు “ఒంటెద్దు” పోకడలో పాలన చేసి, విపాక్ష పార్టీలు, వాటి నేతల పై అడ్డూఅదుపు లేకుండ మాట్లాడిన భారత రాష్ట్ర సమితి నేతల్లో ఇంకా ఆ బిరుసు తగ్గ లేదు. పదేళ్లుగా నియోజక వర్గాలను ఏకపక్షంగా ఏలిన బి.అర్.ఎస్. నేతలలో రెండు నెలలుగా ఏ అధికారం లేక అసహనం పెరిగిపోతోందనే బలమైన విమర్శలు వస్తున్నాయి. సుమారు 45 రోజులుగా ఆ పార్టీ క్రియాశీలక అధ్యక్షులు కెటిఆర్, ఎమ్మెల్సీ కవిత, కడియం శ్రీహరి వంటి నేతలు అధికార…

Read Full News
IMG 20240205 WA0008

అధినేత్రితో…

కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీతో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. సుమారు అరగంట పాటు పలు కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.భేటీ అనంతరం భట్టి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలిసారి మర్యాదపూర్వకంగా సోనియాతో సమావేశమయినట్టు, రానున్న లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి పోటీ చేయాలని కోరినట్టు చెప్పారు. అంశంపై రాష్ట్ర పార్టీ తీర్మానం…

Read Full News
revnth phida

ఏం మాట్లాడిండ్రా భై…

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగ తీరు జనం మధ్య అత్యంత హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి జరిపిన ఆదిలాబాద్ జిల్లా పర్యటన తెలుగు రాష్ట్రాల ప్రజల దృష్టిని విశేషంగా ఆకర్షించింది. వేదిక నుంచి అయన గుప్పించిన మాటలు చర్చనీయాంశాలుగా మారాయి .రాష్త్ర పెద్దగా రేవంత్ వ్యవహార శైలి, లేవనెత్తిన అంశాలు, వెల్లడించిన హామీలు భవిష్యత్తును కళ్ళముందు చూపినట్టు ఉందనే ప్రశంసలు వెల్లువెత్తడం విశేషం. ఇంద్రవెల్లిలో…

Read Full News
adwani

“రథ”యాత్రికునికి”రత్నం”…

భారతీయ జనతా పార్టీ కురు వృద్ధులు లాల్ కిషన్ అద్వాని దేశ అత్యున్నత పురస్కారమైన “భారత రత్న” వరించింది. దేశంలో బిజెపి మూలాలు విస్తరించడానికి ఆయన సేవలు ఇతోధికంగా తోడ్పడ్డాయి. 1990 దశకంలో అయోధ్య రామ మందిర వివాదం పై అద్వాని జరిపిన “రథ యాత్ర” బిజెపి, సంఘ్ పరివార్ లు ఎప్పటికీ మర్చిపోలేనిది. ఉక్కు మనిషిగా పేరు తెచ్చుకున్న ఆయనను “రత్న”తో పురస్కరించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

Read Full News