Screenshot 20230817 123721 Video Player

“పోర్టు”లో పోరు….

ఆంధ్రప్రదేశ్ లోని గంగవరం పోర్టు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ డిమాండ్ల సాధన కోసం కార్మికులు చేపట్టిన ఆందోళనలో పలువురు పోలీసులు, కార్మికులకు గాయాలయ్యాయి. పోర్టులోకి చొచ్చుకెళ్లేందుకు కార్మికులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన ఇరు వర్గాల మధ్య తీవ్ర తోపులాటలో 10 మంది పోలీసులు సహా పలువురు కార్మికులు గాయపడ్డారు.

Read Full News
images 20

అక్కడ ముమ్మరం…ఇక్కడ నీరసం…

హైదరాబాద్ జర్నలిస్టులకు ప్రభుత్వ హామీ మేరకు మంజూరు చేయాల్సిన ఇళ్ల స్థలాల విషయంలో జరుగుతున్న జాప్యం విలేకర్లు, జర్నలిస్టు సంఘాలను అసంతృప్తికి గురి చేస్తోంది. డబ్బు చెల్లించి, 16 ఏళ్ల నుండి ఎదురు చూస్తున్న పాత్రికేయులకు, కొత్తగా ఇళ్ల స్థలాల కోసం వేచిచూస్తున్న వారికీ ప్రభుత్వం న్యాయం చేస్తామనే చెబుతోంది. కానీ, ఎప్పుడు అనేది మాత్రం స్పష్టంగా చెప్పడం లేదు.అయితే, ఇదే విలేకర్ల వర్గానికి జిల్లాల్లో మాత్రం స్థలాలు కేటాయించడం, వారికి మంజూరు చేయడం వేగంగా జరిగి…

Read Full News
IMG 20230816 WA0011

ఉద్రిక్తం….

లిబియా రాజధాని ట్రిపోలిలో సాయుధ వర్గాల మధ్య జరుగుతున్న ఘర్షణలో సుమారు 130 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘర్షణకు సరైన కారణాలు ఏమిటనేది తెలియక పోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.రెండు సాయుధ వర్గాల మధ్య చోటుచేసుకున్న పరిణామాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి.

Read Full News
IMG 20230816 WA0004

చంద్ర కక్షలో…

చంద్రుని పైకి దూసుకు పోతున్న చంద్రయాన్ -3 చంద్ర కక్ష్యలో మూడో అవరోహణ వరకు చేరుకున్నట్లు ఇస్రో తెలిపింది.chandryayan-3 ప్రస్తుతం 153 కిలోమటర్లు x 163 కిలోమీటర్ల కక్ష్యలో తిరుగుతున్నట్టు వివరించింది.

Read Full News
chiru

“చిరు”కి చికిత్స…

మెగాస్టార్ చిరంజీవికి న్యూఢిల్లీలో మోకాలుకి స్వల్ప శస్త్ర చికిత్స జరిగింది. వారం రోజులు ఆసుపత్రిలోనే విశ్రాంతి తీసుకోవలసి ఉంటుందని కుటుంబ సభ్యులు తెలిపారు.

Read Full News
Screenshot 20230815 201103 Instagram

నన్నూ కెలికారు…

మిల్కీ అందాలతో “మిస్టర్ పర్ఫెక్ట్” వంటి యువత మనసుల్లో రొమాంటిక్ “దరువు” వేయించి “గేమ్ ఓవర్” అంటూ ప్రేక్షకులను “ఆనందో బ్రహ్మ” అనిపించిన తాప్సీ మొన్నీ మధ్య షాకింగ్ న్యూస్ చెప్పింది. టాలీవుడ్, కోలీవుడ్ తెరపై అనేక సినిమాలు చేశాను. కానీ బాలీవుడ్ తెరపై కనిపించాలంటే కొన్ని వదులుకోవాలేమో అని భయమేసిందని చెప్పింది. ఎందుకంటే, అక్కడి ఓ ఇద్దరు సినీ ప్రముఖులు రాత్రిళ్ళు ఫోన్లు చేసి రమ్మనే వారని బాంబు పేల్చింది. అయితే తాను అలాంటి దాన్ని…

Read Full News
IMG 20230815 WA0004

చర్చ….

ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తల విభాగం, ఐఐటి హైదరాబాద్ “ఇండియా ప్రెసిడెన్సీ” అనే అంశం పై సంయుక్తంగా నిర్వహించిన చర్చా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న ఐఐటి డైరక్టర్ మూర్తి.

Read Full News
Screenshot 2023 08 09 082232

“సుప్రీం”కు సొసైటీ…

జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టు హౌసింగ్ సొసైటీకి పేట్ బషీరా బాద్ లో ప్రభుత్వం కేటాయించిన 38 ఎకరాల స్థలాన్ని వెంటనే సొసైటీకి బదలాయించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన అమలు చేయడంలో ఇంతకాలం జరిగిన ఆలస్యం పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆ సొసైటీకి చెందిన సభ్యుల బృందం సుప్రీం కోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది మరో 10 రోజుల్లో ఏడాది కావస్తున్నందున ఆ తీర్పును, తమ స్థలాన్ని కాపాడుకునే ప్రయత్నంలో…

Read Full News
Screenshot 20230814 121737 WhatsApp 1

అలా జరిగింది…

సరదా కోసం సముద్రంలోకి వెళ్లి మునిగిపోతున్న ఇద్దరు యువకుల ప్రాణాలను పోలీసులు కాపాడారు. కర్నూలు జిల్లాకి చెందిన పుల్లేటి మహేష్, గోగుల రమణ తోటి యాత్రికులతో కలిసి బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం సముద్ర తీరంలో స్నానం చేస్తుండగా ఒక్కసారిగా వచ్చిన పెద్ద అలల తాకిడికి సముద్రంలోకి వెళ్ళి పోయారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది, మెరైన్ సిబ్బంది వెంటనే స్పందించి కానిస్టేబుల్ గణేష్, ఎం. వెంకటేశ్వర్లు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సముద్రంలోకి…

Read Full News
images 21

పొంచివున్న “చిరుతలు”….!

తిరుమలకు కాలి బాటన వెళ్ళే భక్తులు బెంబేలేత్తుతున్నారు. అలిపిరి నుంచి ఈ దారిలో వెళుతున్న వారిపై చిరుతలు దాడిచేసి చంపడం పట్ల తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. నడుచుకుంటూ వెళ్ళే భక్తులు ఎప్పుడు ఏ చిరుత దాడిచేస్తుందో తెలియక భక్తిని లోన దాచుకొని భయంతో పైకెక్కే పరిస్థితిని నెలకొంది. దీనికి తోడు మొన్న చిన్నారిపై దాడి చేసిన చిరుత పట్టుపడగా మరో మూడు చిరుతలు నడక మార్గంలో సంచరిస్తున్నాయనే టిటిడి అధికారుల ప్రకటనతో భక్తులు మరింత భయబ్రాంతులకు గురవుతున్నారు….

Read Full News
Screenshot 20230814 102558 Gallery

చిక్కిన “చిరుత”…

తిరుమల నడక దారిలో చిన్నారి లక్షితను చంపిన చిరుత ఎట్టకేలకు బోనులో చిక్కింది. రెండు రోజుల క్రితం చిన్నారి లక్షితను దాడి చేసి హతమార్చిన చిరుతను ట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు ఆ పరిసరాల్లో బోనులు ఏర్పాటు చేయగా ఆదివారం అర్ధరాత్రి చిరుత ఓ బోనులో చిక్కినట్లు అధికారులు వెల్లడించారు.

Read Full News
IMG 20230814 WA0001

ఇక రక్షణ చర్యలు…

తిరుమల వెళ్ళే కాలినడక మార్గంలో పిల్లల పై చిరుత పులుల దాడి నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) అప్రమత్తమైంది. శ్రీవారి దర్శనం కోసం అలిపిరి నుంచి మెట్ల ద్వారా వచ్చే భక్తుల భద్రతకు రక్షణ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మధ్యాహ్నం 2 గంటల తర్వాత 15 ఏళ్లలోపు పిల్లలను కాలినడక మార్గంలో అనుమతించడం లేదు. రెండు కనుమ రహదారుల్లో సాయంత్రం ఆరు గంటల తర్వాత ద్విచక్ర వాహనాల రాకపోకలు నిలిపివేశారు. ఏడో మైలు వద్ద…

Read Full News
Screenshot 2023 08 13 113730

గుండెపోటుతో…

హైదరాబాద్ నగర శివార్లలోని ఆటో నగర్ హ్యుందాయ్ షోరూం లో విషాదం చోటుచేసుకుంది. షోరూంలోని వాహన సర్వీసింగ్ విభాగంలో కారు రిపేర్ చేస్తూ గుండెపోటుతో కుప్పకూలిన ఓ మెకానిక్ అక్కడిక్కడే మృతి చెందాడు. అబ్దుల్లాపూర్ మెట్టు మండలం కొహెడకు చెందిన జంగారెడ్డి (36) ప్రతిరోజూ మాదిరిగానే షోరూంకి వచ్చి వాహనాల మెకానిక్ పనులు మొదలుపెట్టాడు. ఇందులో భాగంగా ఓ వాహనాన్ని పరిశీలిస్తున్న జంగారెడ్డి అకస్మాత్తుగా కిందపడిపోయి కాసేపటికి చనిపోయాడు. ఒక్కసారిగా తీవ్రమైన గుండె నొప్పికి గురికావడం వల్ల ఇలా జరిగిందని…

Read Full News