revanth oth1

కలల సాకారానికి శ్రీకారం…

ఈ తెలంగాణ రాష్ట్రం ఆషామాషీగా ఏర్పడింది కాదు, ఈ రాష్ట్రం పోరాటాలతో ఏర్పదిండి, త్యాగాల పునాదుల మీద పుట్టుకొచ్చిన రాష్ట్రం. ఎన్నో ఆకాంక్షలను, ఎన్నో ఆలోచనలను ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించి,  నాలుగు కోట్ల ప్రజలకు స్వేచ్ఛను ఇవ్వాలని, సామాజిక న్యాయం చేయాలని ఆసిఫాబాద్ నుంచి మొదలు పెడితే ఆలంపూర్ వరకు, ఖమ్మం నుంచి మొదలు పెడితే కొడంగల్ వరకు సమానమైన అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో  దశాబ్దం కిందట  సోనియాగాంధీ  ఉక్కు సంకల్పం, కాంగ్రెస్ పార్టీ సమిధగా మారి ఈ…

Read More
glass copy

“గ్లాసు” ముట్టని ఓటరు…!

తెలంగాణ ప్రాంతంలో  మేకపోతు గాంభీర్యం చూపించిన జనసేన పార్టీని ప్రజలు ఖాతరు చేయలేదు. తెలంగాణ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్నట్టు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో ఆ పార్టీ క్యాడర్ ఒక్కసారిగా న్యూట్రల్ మోడ్ లోకి వెళ్ళింది. కనీసం ఆంధ్రాలో మాదిరిగా ఇక్కడ కూడా జనసేనతో బరిలోకి దిగుతుందేమో అని అంచనా వేశారు. కానీ, తెలుగుదేశంతో సంబంధం లేకుండా తెలంగాణలో జనసేన ఒంటరిగానే రంగంలోకి దూకే ప్రయత్నం చేసింది. అందుకే 32 స్థానాల్లో పోటీ చేస్తుందని…

Read More
surve 1c

ఒంటెద్దు పోకడ-అతి ఆలోచనలు..!

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత  మూడోసారి జరిగిన శాసనసభ ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. ఉద్యమ పార్టీగా పిలవబడుతున్న బీఆర్‌ఎస్‌కు ఎదురే లేదు, కాంగ్రెస్‌ ఇక రాదు అనే ప్రచారం జరుగుతున్న తరుణంలో ఎన్నికల ముందు ఉన్న పరిస్థితులు పోలింగ్ నాటికి ఒక్కసారిగా తిరగబడ్డాయి. రాష్ట్రంలో అనేక రకాల సమస్యలు పడుతున్న ప్రజలకు “ఒక్క ఛాన్స్” ఇవ్వడి అంటూ పక్కాగా అమలు చేసే ఆరు రకాల గ్యారంటీ పధకాలతో కాంగ్రెస్ పార్టీ , “హ్యాట్రిక్‌” విజయంపై గట్టి…

Read More
eleccomis last

ఇలా చేయండి…

ఈ నెల ౩౦వ తేదీన జరగనున్న తెలంగాణ శాసన సభ ఎన్నికల పోలింగ్ లో ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని జాయింట్ కమిషనర్ మంగతాయారు తెలిపారు. జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో ఎన్నికల విధులు నిర్వహించే ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కమిషనర్ ఆమె మాట్లాడుతూ ప్రతి పోలింగ్ బూత్ లో ఒక ప్రిసైడింగ్ అధికారి, ముగ్గురు సహాయ అధికారులు ఉంటారని తెలిపారు. ప్రిసైడింగ్…

Read More
rahul selfi

ప్రచారంలో “రేవంత్” దూకుడు..!

ఈ నెల 30న జరగనున్న తెలంగాణ శాసన సభ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనలతో ప్రచారం నిర్వహించారు. నోటిఫికేషన్ నుంచి ప్రచారం ముగిసే వరకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ దాదాపు 63 నియోజకవర్గాల్లో ప్రచార సభల్లో పాల్గొన్నారు. అక్టోబర్ 16న వికారాబాద్ లో నిర్వహించిన సభ నుంచి నవంబర్ 28న మాల్కాజిగిరి రోడ్ షో వరకు దాదాపు 87 సభలో పాల్లొన్నారు. వికారాబాద్, తాండూరు, పరిగి, చేవేళ్ల, ములుగు,…

Read More
band

మూగవోయిన ప్రచారం…

తెలంగాణలో ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. నెల రోజుల పాటు హోరాహోరీగా సాగిన  ప్రచారంలో మారుమోగిన మైకు శబ్దాలు ముగాబోయాయి. ౩౦వ తేదిన జరిగే పోలింగ్ ప్రక్రియకు ఎన్నికల సంఘం అన్ని  ఏర్పాట్లు పూర్తీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 119 శాసన సభ నియోజక వర్గాల్లో 2,290 మంది  అభ్యర్ధులు బరిలో నిలిచారు. మొత్తం 35,655 పోలింగు కేంద్రాలను ఏర్పాటు చేశారు. 45 వేల మంది పోలీసులు భద్రతా చర్యల్లో పాల్గొంటారు.ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు…

Read More
modi kamrdy

బిఆర్ఎస్ గద్దె దిగడం ఖాయం…

వచ్చే నెల 3వ తేదీన తెలంగాణలో ప్రజలు బిఆర్ఎస్ పార్టీని గద్దె దించుతారనే నమ్మకం ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల్లో ఎన్నోఆశలు కన్పిస్తున్నాయని వాటిని నెరవేర్చుకోవడానికి మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో బిజెపి గాలి వస్తుందన్నారు. శాసన సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డిలో నిర్వహించిన సభలో ప్రధాని మాట్లాడారు. దేశంలో  7 దశబ్దాలు పాలించిన  కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎమి చేయాలేదని అదేవిధంగా పదేళ్లుగా రాష్ట్రంలో…

Read More
money 5

“ఓటు” కోసం “నోటు”నై వస్తున్నా…..!

తెలంగాణ రాష్ట్ర శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కట్టల కొద్ది డబ్బు చేతులు మారుతున్నాట్టు తెలుస్తోంది. వివిధ మార్గాల్లో ఆయా నియోజక వర్గాలకు కోట్ల రూపాయలు తరలిపోతున్నట్టు సమాచారం అందుతోంది. పోలీసులు, ఎన్నికల అధికారులు, కేంద్ర బలగాల సమక్షంలో అంతర్ రాష్ట్ర, అంతర్ జిల్లా చెక్ పోస్టులను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినప్పటికీ నగదు ప్రవాహం మాత్రం ఆగడం లేదని ఇటీవల జరిగిన సంఘటనలే ఉదాహరిస్తున్నాయి. జాతీయ, రాష్ట్ర రహదారులపై ఎంపిక చేసిన ప్రాంతాల్లోనే చెక్…

Read More
priynka tractr

పేదింటిలో ప్రియాంక…

సిద్ది పేట్ జిల్లా హుస్నాబాద్ లో సభ ముగించుకొని రోడ్డు మార్గాన తిరుగు ప్రయాణంలో ప్రియాంక గాంధీ హుస్నాబాద్ మండలంలోని కిషన్ నగర్ ఓ పేద దంపతుల ఇంటికి వెళ్లి జాగీరు రమాదేవి, రాజయ్య ల దంపతులను పలకరించారు. అలాగే రోడ్డు మార్గంలో సభకు వచ్చి, తిరిగి వెళ్తున్న వాహనాల్లోని మహిళల తో సెల్ఫిలు దిగారు. వారిని పలకరిస్తూ, కరచాలనం చేస్తూ కాసేపు ప్రియాంక సందడి చేశారు.

Read More
mla cong

కాంగ్రెస్ లోకి అబ్రహం…

అలంపూర్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అబ్రహం కాంగ్రెస్ పార్టీ లో చేరారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీ లోకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, మల్లు రవి తదితరులు పాల్గొన్నారు.

Read More
high court

డి.ఎం.ఇ. పోస్టు సంగతేంటి…!

తెలంగాణ వైద్య విద్యా శాఖకు రెగ్యులర్ డైరెక్టర్  (సంచాలకులు) పోస్టును ఏర్పాటు చేయకపోవడంపై హై కోర్టు ప్రభుత్వానికి నోటిసులు జారీ చేసింది. రాష్ట్ర విభజన జరిగి తొమ్మిది ఏళ్లు గడిచినా ఈ పోస్టును ఏర్పాటు చేయకపోవడం పై అసంతృప్తి వ్యక్తం చేసింది.డి.ఎం.ఇ. పోస్టు నియామకం పై ప్రభుత్వ విధానాన్ని సవాలు చేస్తూ వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రి సుపరింటెన్ డెంట్ నరేంద్ర పిటిషన్ దాఖలు చేశారు. విభజన సమయంలో డి.ఎం.ఇ. పోస్టు ఆంధ్రప్రదేశ్ కి చెందుతుందనే విషయాన్ని 2014…

Read More
priyanka speec

రెండు లక్షల ఉద్యోగాలు గ్యారంటీ..

కెసిఆర్ ప్రభుత్వ హయంలో  నిరుద్యోగుల హత్మహత్యలు  పెరిగాయని, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపడితే వెంటనే యువతకు రెండు లక్షల ఉద్యోగాలు తప్పనిసరి ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారు. పదేళ్ళ పాలనలో తెలంగాణ కెసిఆర్ చేతిలో నిలువుదోపిడికి గురైందని, భారత రాష్ట్ర సమితి అవినీతిలో కూరుకుపోయిందని దుయ్యబట్టారు. కెసిఆర్ ప్రభుత్వంలో నిరుద్యోగుల సమస్యలు తీరలేదన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్, కుమురం భీమ్ జిల్లా ఆసిఫాబాద్ ఎన్నికల సభల్లో ప్రియాంక పాల్గొన్నారు. తెలంగాణలో…

Read More
pawan 56

“కమల”దళంతో కనిపించని “తమ్ముడు”…!

తెలంగాణ శాసన సభ ఎన్నికల తేదీ సమీపిస్తున్నా ప్రచారంలో జనసేన జాడ కనిపించక పోవడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో భారతీయ జనతా పార్టీతో పొత్తు కుదుర్చుకొని తొమ్మిది నియోజక వర్గాల్లో పోటీ చేస్తున్నట్టు ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ప్రచార తెరపై కనిపించక పోవడంతో ఆ పార్టీ శ్రేణులు అసంతృప్తిగా ఉన్నాయి.  రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నియోజక వర్గాల్లో భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్ పార్టీలు ప్రచారంలో దూసుకు పోతుంటే జనసేనా కనీసం…

Read More
amitsha

గద్వాల్ లో “షా”…

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా వివిధ సభల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ చేరుకున్న కేంద్ర హోమ్ శాఖమంత్రి అమిత్ షా హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎన్నికల ఇంచార్జ్ జవడేకర్ పలువురు నేతల స్వాగతం పలికారు. గద్వాల్ లో జరిగే సకల జనుల విజయ సంకల్ప సభలోఅమిత్ షా పాల్గొంటారు.

Read More