కెసిఆర్ ప్రభుత్వ హయంలో నిరుద్యోగుల హత్మహత్యలు పెరిగాయని, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపడితే వెంటనే యువతకు రెండు లక్షల ఉద్యోగాలు తప్పనిసరి ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారు. పదేళ్ళ పాలనలో తెలంగాణ కెసిఆర్ చేతిలో నిలువుదోపిడికి గురైందని, భారత రాష్ట్ర సమితి అవినీతిలో కూరుకుపోయిందని దుయ్యబట్టారు. కెసిఆర్ ప్రభుత్వంలో నిరుద్యోగుల సమస్యలు తీరలేదన్నారు.
నిర్మల్ జిల్లా ఖానాపూర్, కుమురం భీమ్ జిల్లా ఆసిఫాబాద్ ఎన్నికల సభల్లో ప్రియాంక పాల్గొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరధం పడతారనే నమ్మకం వచ్చిందని, అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. రైతులకు రెండు లక్షల రూపాయల రుణ మాఫీ చేస్తామన్నారు. తెలంగాణ అటవీ ప్రాంతాల్లో “జల్ జంగిల్ జమీన్’ కోసం పోరాడిన వారు ఉన్నారని, ఆదివాసీ సమాజం కొసం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిందని గుర్తు చేశారు.ఇందిరాగాంధీ చనిపోయి 40సంవత్సారాలు ఔతున్న ఆమె అందరి మదిలో ఉన్నారని, దానికి ఏమే చేపట్టిన సంక్షేమ పదకాలే కారణమన్నారు. అధికారలోకి వస్తే తెలంగాణా ఉద్యమం లో పాల్గొన్న ప్రతి కుటుంబంలో ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించినట్టు కూడా ప్రియాంక తెలిపారు.