సిద్ది పేట్ జిల్లా హుస్నాబాద్ లో సభ ముగించుకొని రోడ్డు మార్గాన తిరుగు ప్రయాణంలో ప్రియాంక గాంధీ హుస్నాబాద్ మండలంలోని కిషన్ నగర్ ఓ పేద దంపతుల ఇంటికి వెళ్లి జాగీరు రమాదేవి, రాజయ్య ల దంపతులను పలకరించారు. అలాగే రోడ్డు మార్గంలో సభకు వచ్చి, తిరిగి వెళ్తున్న వాహనాల్లోని మహిళల తో సెల్ఫిలు దిగారు. వారిని పలకరిస్తూ, కరచాలనం చేస్తూ కాసేపు ప్రియాంక సందడి చేశారు.