డి.ఎం.ఇ. పోస్టు సంగతేంటి…!

high court

తెలంగాణ వైద్య విద్యా శాఖకు రెగ్యులర్ డైరెక్టర్  (సంచాలకులు) పోస్టును ఏర్పాటు చేయకపోవడంపై హై కోర్టు ప్రభుత్వానికి నోటిసులు జారీ చేసింది. రాష్ట్ర విభజన జరిగి తొమ్మిది ఏళ్లు గడిచినా ఈ పోస్టును ఏర్పాటు చేయకపోవడం పై అసంతృప్తి వ్యక్తం చేసింది.డి.ఎం.ఇ. పోస్టు నియామకం పై ప్రభుత్వ విధానాన్ని సవాలు చేస్తూ వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రి సుపరింటెన్ డెంట్ నరేంద్ర పిటిషన్ దాఖలు చేశారు. విభజన సమయంలో డి.ఎం.ఇ. పోస్టు ఆంధ్రప్రదేశ్ కి చెందుతుందనే విషయాన్ని 2014 లోనే తెలంగాణ ప్రభుత్వం డి.ఎం.ఇ. పోస్టును గుర్తించాల్సి ఉండని నరేంద్ర తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.దీనివల్ల అర్హత ఉన్నా సీనియర్లకు ఈ పోస్టు దక్కడం లేదని వివరించారు. 2021 వ సంవత్సరంలో రమేష్ రెడ్డిని ఇన్ చార్జ్ డి.ఎం.ఇ.గా నియమిస్తూ ఆ ఏడాది  ప్రభుత్వం జారీ చేసిన 699 జీ.ఒ.ను కొట్టివేయాలని కోరారు. రమేష్ రెడ్డి నియామకం వాళ్ళ అన్ని అర్హతలు ఉన్నప్పటికీ డాక్టర్ నరెంద్రకి డి.ఎం.ఇ. పోస్టు దక్కలేదనే విషయాన్ని న్యాయవాది కోర్టు దృష్హికి తీసుకువెళ్ళారు. వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాదే, జస్టిస్ అనిల్ కుమార్ లతో కూడిన ధర్మాసనం డి.ఎం.ఇ. పోస్టును ఏర్పాటు చేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని, దీనిపై నాలుగు వారాల్లో పూర్తీ వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హై కోర్టు ఆదేశించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *