అమ్మ దయ కోసం…
సికింద్మరాబాద్ మహంకాళీ బోనలకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కుటుంబసమేతంగా హాజరయ్యారు. రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచాలని అమ్మవారిని కోరారు.
సికింద్మరాబాద్ మహంకాళీ బోనలకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కుటుంబసమేతంగా హాజరయ్యారు. రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచాలని అమ్మవారిని కోరారు.
ఐఆర్ఎస్ అధికారి శామ్యూల్ ప్రసాద్ ఇంతో జరిగిన దొంగతనానికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంతున్న ఎస్సై కృష్ణ అజ్ఞాతంలోకి వెళ్లడంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ముషీరాబాద్ పోలీసులు ఈ కేసులో ఇప్పటికే ఆశీర్వాదం, శ్రీశైలం, సురేందర్ లను అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. కానీ A2 నిందితునిగా ఉన్న ఎస్సై కృష్ణ ఆచూకి తెలియకపోవడం పట్ల విచారణ తీరుపై సందేహాలు కలుగుతున్నాయి. కేసు నమోదు చేసి నెల రోజులు గడుస్తున్నా ఎస్సై కృష్ణను అరెస్టు చేయకపోవడం ఆరోపణలకుఫ్ దరితిస్తోంది….
ఉత్తరాఖండ్ లో కురుస్తున్న భారీ వర్షాలకు కొన్ని ప్రాంతాల్లో ప్రజాజీవన అతలాకుతలం అవుతోంది. వాగులు, నదులు పొంగి పొర్లుతున్నాయి. అనేక గ్రామాలకు రవాణా స్తంభించింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సును రామ్ఢ్ గ్రామంలో ఉప్పొంగి ప్రవహిస్తున్న నదిని దాటించేందుకు ప్రయత్నించగా వరద ఉద్ధృతి ఒక్కసారిగా పెరగడంతో బస్సు ఒకవైపు ఒరిగిపోయింది. అప్రమత్తమైన ప్రయాణికులు బస్సు కిటికీల్లోంచి దూకి ప్రాణాలను రక్షించుకున్నారు. అనంతరం పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణాపాయం జరగక పోవడంతో ఉపిరి…
హిమాచల్ ప్రదేశ్ లోని బియాస్ నది తీరాన మరో ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా వరద రావడంతో నది ఒడ్డున ఉన్న దుకాణాలు కొట్టుకుపోయాయి.
మహంకాళి అమ్మవారికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులు తొలిబోనం సమర్పించారు. ఆలయ పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం మంత్రి అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు.
ఈ అధికారి గురించి తెలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. ఏదో సినిమాల్లో వినోదం కోసం రచయితలు పాత్రలను సృష్టిస్తారు. అది అంతవరకే పరిమితం. కానీ, అలాంటి కధలనే స్ఫూర్తిగా తీసుకుందో ఏమో ఈ మహిళా పోలీస్ ఏకంగా మాయల ముఠాకే నాయకురాలైంది. అదీ ఎక్కడో కాదు, సాగరతీరం విశాఖ పట్నంలో అంటే ఆశ్చర్యం కలుగుతుంది. యూనిఫామ్ ముసుగేసుకొని కొంత కాలంగా రకరకాల దండాలకు పాల్పడుతున్న ఆమె బండారం బయటపడింది. ఏకంగా ఓ దోపిడీ ముఠానే నడుపుతున్నట్లుగా వెల్లడైంది. ఈమె…
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి బయోపిక్‌గా వచ్చిన ‘యాత్ర’ సినిమా 2019లో మంచి విజయం అందుకుంది. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన మహి వి.రాఘవ్ సీక్వెల్ కూడా ఉంటుందని గతంలోనే ప్రకటించారు. అందుకు సంబంధించిన పోస్టర్‌ను కూడా ఇటీవలే ఆయన విడుదల చేశారు. ‘నేనెవరో ఈ ప్రపంచానికి ఇంకా తెలియకపోవచ్చు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి.. నేను వై.ఎస్. రాజశేఖరరెడ్డి కొడుకుని’ అనే లైన్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా యాత్ర-2కు సంబంధించి…
సమాజంలో శాస్త్ర సాంకేతిక రంగాలకు మానవీయ విలువలు తోడైతే ఆ రంగాలలో సాధించిన ప్రగతి ప్రపంచానికి ఉపయోగపడుతుందని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్ అన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాలు పురోభివృద్ధి దిశగా అడుగులు వేయాలంటే మానవ శాస్త్రాల పరిజ్ఞానం కూడా ఆ శాస్త్రవేత్తలకు ఎంతో అవసరం అన్నారు. రవీంద్రభారతిలో ఎక్స్ ప్లోరా నాలెడ్జి ఒలింపియాడ్ సంస్థ ఆధ్వర్యంలో ఐఐటి టెస్ట్ లో ప్రతిభ చూపిన విద్యార్థులకు వార్షిక అవార్డుల ప్రదాన ఉత్సవం జరిగింది….
హర్యానా లోని సోనిపట్ లో రైతులతో కలిసి వారి పొలంలో కాసేపు నాట్లు వేసిన రాహుల్ గాంధీ.
జననేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్.రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా, వైఎస్‌ఆర్ జిల్లా, ఇడుపుల పాయలో వైయస్సార్ ఘాట్ వద్ద ముఖ్యమంత్రి వైయస్.జగన్, వైయస్.భారతి, వైయస్.విజయమ్మ, ఇతర కుటుంబసభ్యులు ఘనంగా నివాళులర్పించి, ప్రార్ధన నిర్వహించారు.
దేశాభివృద్ధికి తెలంగాణ రాష్ట్రం అందించిన సహకారం గొప్పదని, దేశాన్ని ప్రపంచంలోనే 5వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపు దిద్దుకోవడంలో తెలంగాణ ప్రజలదే కీలకపాత్ర ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కాజీపేటలో రైల్వే మాన్యు ఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, రాష్ట్రంలో దాదాపు రూ. 6100 కోట్ల విలువైన అనేక ముఖ్యమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు…
వరంగల్ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, ఆయన పాలనపై విరుసుకు పడ్డారు. కేవలం తెలంగాణ నాలుగు అంశంలో అభివృద్ధి చెందింది అంటూ ఎద్దేవా చేశారు. వాటిలో ఒకటి ఉదయం నుంచి సాయంత్రం వరకు మోడీని విమర్శించడం పని రెండోది తెలంగాణ ఆర్ధిక పరిస్థితిని నీరుగార్చడం అని వ్యాఖ్యానించారు.
ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల అమర్‌నాథ్ యాత్ర వరుసగా రెండో రోజు కూడా నిలిచిపోయింది. వర్షాల కారణంగా జమ్ము- శ్రీనగర్ హైవేపై కొండచరియలు విరిగిపడటంతో యాత్రను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. బల్తాల్, పహల్గాం రెండు మార్గాల్లోనూ యాత్రను నిలిపివేశారు. ఎడతెరపి లేకుడా కురుస్తున్న వర్షాల వల్ల బల్తాల్, నున్వాన్ బేస్ క్యాంపుల్లోనే వేలమంది యాత్రికులు ఉండిపోయారు.పంచతర్ణి ప్రాంతంలో 1,500 మంది యాత్రికులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. అందులో 200 మంది వరకూ తెలుగు యాత్రికులు ఉన్నట్లు సమాచారం. ఆగస్టు…
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయ లోని ఆయన సమాధి వద్ద షర్మిల, విజయమ్మ నివాళులర్పించారు. వీరితో పాటు షర్మిల కుమారుడు రాజారెడ్డి, కూతురు అంజలి కూడా శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం వైఎస్ సమాధి వద్ద నిర్వహించిన ప్రార్థనల్లో పాల్గొన్నారు. షర్మిల, ఇతర కుటుంబ సభ్యులు నిన్ననే ఇడుపులపాయకు చేరుకున్నారు.
అమెరికా లోని ఫిలడెల్ఫియాలో ప్రారంభమైన తానా సభలు అట్టహాసంగా ప్రారంభమైయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలు ఫిలడెల్ఫియా నగరంలో ఉన్న పెన్సిల్వేనియా కాన్ఫరెన్స్ హాలులో నిర్వహిస్తున్నారు. ఈ సభలకు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీం కోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్.వి రమణ, సినీనటులు, ఎమ్మెల్యే బాలకృష్ణ , తెలంగాణ రాష్ట్ర పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.