రాజ్ నాథ్ తో కేటీఆర్..

రెండు రోజుల పర్యటనకు ధిల్లి వెళ్ళిన రాష్ట్ర పురపాలక, ఐ.టి. శాఖల మంత్రి కేటీఆర్ రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు. స్థానికుల సౌకర్యార్ధం సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని సాధారణ ప్రజలు నివసించే ప్రాంతాలను హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ లో కలిపేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ కేటీఆర్ రాజ్ నాథ్ సింగ్ కి లేఖ అందజేశారు. అదే విధంగా, మెహదిపట్నం రైతు బజారు వద్ద చేపట్టే స్కై వాక్ నిర్మాణానికి కావలసిన…

Read More

బాలుడిపై చిరుత దాడి…..

తిరుమల నడక మార్గం ఏడోవ మైలు వద్ద చిన్నారి పై చిరుత దాడి చేసింది. ఐదు సంవత్సరాల బాలుడిని పైకి ఒక్కసారిగా విరుసుకుపడిన చిరుత అందరు చూస్తుండగానే ఎత్తుకుపోయింది. అక్కడే విధులో ఉన్న పోలిసులు కేకలు వేయడంతో చిరుత బాలుడిని వదిలేసి వెళ్ళింది. గాయ్యాల పాలైన బాలుడిని ఆసుపత్రికి తరలించారు. బాలుడిని శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయం చేర్పించారు. టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్యక్షులు వై.వి.సుబ్బారెడ్డి, పలువురు టి.టి.డి అధికారులు ప‌రామ‌ర్శించారు. మెరుగైన వైద్యసేవలు అందించాలని…

Read More

న్యాయమూర్తితో జగన్….

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్, అయన సతీమణి వైఎస్‌ భారతి.

Read More

అమరుల ప్రాణ ధార తెలంగాణ…

తెలంగాణ కోసం మహత్తరమైన పోరాటాలు,ఉద్యమాలు జరిగి, ఎంతోమంది ప్రాణాలు ధారా పోశారని ముఖ్యమంత్రి చంద్ర శేఖర్ రావు అన్నారు. ఆ అమరుల త్యాగ ఫలితమే ఈ తెలంగాణ రాష్ట్రమని పేర్కొన్నారు. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన త్యాగమూర్తుల స్మాకార్ధం సాగర తీరాన నిర్మించిన ఈ అమర జ్యోతి ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ, తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను అమరులకు నివాళులర్పించి ఉత్సవాలు ముగించాలని అనుకున్నా, తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన వారు గుర్తుకొస్తుంటే…

Read More

సౌత్‌లాన్‌లో మోడీ సందడి…

భారత ప్రధాని నరేంద్ర మోడీకి అమెరికా పర్యటనలో అడుగడుగున ఘన స్వాగతం లభిస్తోంది. వైట్ హౌస్‌కి చేరుకున్న మోడీకి జోబైడెన్, ఆయన సతీమణి జిల్ బైడెన్ సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇరుదేశాధిపతులు పరస్పర రక్షణ సహకారంపై ప్రధానంగా చర్చించారు. వైట్‌హౌస్ సౌత్‌లాన్‌లో వేడుక సందర్బంగా ఎన్నారైలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. అయితే, నిబంధనల మేరకు పాస్ లు ఉన్నవారిని మాత్రమే అనుమతించారు. అమెరికా తెలుగు సంఘం సంఘం నాయకులు ప్రదీప్ కట్ట, విలాస్…

Read More
us flag 1

మరో రెండు దౌత్య కార్యాలయాలు…

భారత్ లో మరో రెండు నగరాల్లో అమెరిక దౌత్య కార్యాలయాలను  ఏర్పాటు చేయనున్నట్టు వైట్ హౌస్ అధికారులు ప్రకటించారు. బెంగళూరు, అహ్మదాబాద్ లలో ఈ కార్యాలయాలను ప్రారంభించనున్నట్టు వివరించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అమెరిక పర్యటనలో ఉన్నప్పుడు అక్కడి అధికారులు నిర్ణయాన్ని ప్రకటించడం విశేషం.

Read More

సాగర తీరాన కళా జాత…

హైదరాబాదులోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కల్చరల్ కార్నివాల్ ప్రారంభం అయింది.  రాష్ట్ర  సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్ తో కలిసి మంత్రులు శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ముగింపు ఉత్సవాల సందర్భంగా అమరవీరులకు జోహార్లు అర్పించేందుకు తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 6000 మంది కళాకారులు ర్యాలీగా అమరవీరులస్మృతి వనం వరకు భారీ ర్యాలీని నిర్వహిస్తున్నారు. ఈ కార్య క్రమం లో తెలంగాణ జాగృతి నుంచి కవిత…

Read More

యోగ సత్తా…గిన్నీస్….

అత్యధిక జాతీయులు పాల్గొన్న సెషన్‌గా ఈ యోగా చరిత్ర సృష్టించింది.  ఏకంగా గిన్నిస్ బుక్ రికార్డ్‌ను అందుకుంది. ఈ యోగా కార్యక్రమంలో వివిధ దేశాలకు  చెందినవారు పాల్గొనడమే కారణం. ప్రవాస భారతీయులతో పాటు ఆఫ్రికన్, అమెరికన్, కెనడియన్ ఇలా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు, జాతులు, తెగలకు చెందిన వారు యోగాలో పాల్గొన్నారు. ఒక కార్యక్రమంలో 135 దేశాల నుంచి పాల్గొనడం ఇప్పటివరకు ఎక్కడా చోటుజరగలేదు. ఈ విషయాన్ని  గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు గుర్తించారు….

Read More

అమరదీపం అద్భుతం…

తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన త్యాగమూర్తుల స్మాకార్ధం సాగర తీరాన నిర్మించిన ఈ అమర దీపం మహానగరానికి మరో మణిహారం. సుమారు 3.29 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 177 కోట్ల రుపాయల వ్యయంతో నగరం నడిబొడ్డున ఈ నిర్మాణం కొలువై ఉంది. ఒకవైపు ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్, లుంబిని పార్క్, ఇంకోవైపు చూడ సొంపుగా కనిపించే నూతన సచివాలయం, ఎత్తైన బాబాసాహెబ్ విగ్రహం, నెక్లెస్ రోడ్డులకి చేరువలో ఉండడంతో అమర దీపం పర్యాటకులను మరింతగా ఆకాశించే…

Read More
airport

సాదరంగా మోడీకి…

అమెరికా పర్యటనలో భాగంగా ఆ గడ్డపై కాలు మోపిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఎయిర్ బేస్ వద్ద భారతీయులు సాదర స్వాగతం పలికారు. బ్యారికేట్ల వైపు నిల్చుని జాతీయ జండాలతో భారత మాతాకి జై, మోడీ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తున్న వారిని మోడీ కాన్వాయ్ నుంచి దిగివచ్చి పలువురితో కరచాలనం చేశారు.

Read More
modi cf

బైడేన్ తో మోడీ…

అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆ దేశ  అధ్యక్షుడు జో బైడేన్, ఫస్ట్ లేడి జిల్ బైడేన్ ల తో భేటీ అయ్యారు. ఇరు దేశాల నేతలు ఒకరికొకరు కానుకలు ఇచ్చి, పుచ్చుకున్నారు. రాత్రికి జరిగే విందు కార్యక్రమంలో తిరిగి భేటీ అవుతారు.

Read More

తిరుగుబాటు మొదలైంది..

కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నా చేరికలన్నీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యతిరేక రాజకీయ పునరేకీకరణలో భాగమేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ  చేరికలు సామాన్యమైనవి కావన్నారు. . తెలంగాణకు పట్టిన గులాబీ చీడను వదిలించడానికే ఈ చేతుల కలయిక  అని పేర్కొన్నారు. ఇక తెలంగాణలో కేసీఆర్ పై తిరుగుబాటు మొదలైందన్నారు. అందుకే ఇతర పార్టీల్లోని నేతలు కాంగ్రెస్ లో చేరుతున్నారని చెప్పారు. హైదరాబాద్ లో  జూపల్లి కృష్ణా రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆయన మిత్ర బృందాన్ని…

Read More

ఇదీ ఇంజనీర్ల చదువు…

ఇంజనీర్లు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యానికి మరో నిలువుటద్దం ఈ ఫ్లై ఓవర్. బైరముల్సా గూడ వైపు వెళ్గడానికి సాగర్ రోడ్ పై నిర్మాణం లో ఉన్న ఫ్లై ఓవర్ స్లాబ్ కుప్ప కూలి 10 మందికి గాయాలయ్యాయి . ఉత్తర ప్రదేశ్, బీహార్ కి చెందన సుమారు 12 మంది కార్మికులు పనుల్లో ఉన్నారు. గాయపడ్డ వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. రాత్రి సుమారు 3 గంటల సమయంలో ఫ్లై ఓవర్ స్లాబ్ కుప్పకూలినట్టు, దీనికి…

Read More

వచ్చే ఎన్నికల్లో వారే కీలకం….

తెలంగాణ  అభివృద్ధి కేసీఆర్  దూర దృష్టి, ఆలోచన, ప్రణాళిక, నిబద్ధతకు నిదర్శనం అని బీఆర్ఎస్ యూఎస్ఏ అడ్వైజ‌రి బోర్డు చైర్మన్ తన్నీరు మహేష్  అన్నారు.  బి.ఆర్.ఎస్ – యు.ఎస్.ఏ ఆధ్వర్యంలో కొలంబస్ నగరంలో జాతీయ సదస్సు జరిగింది, ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ, వ్యవసాయ రంగంలో సంస్కరణలు, రైతు బంధు అమలు తీరు చూసి ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్నాయన్నారు.  ఐటీ రంగంలో రెండు లక్షల యాభై వేల కోట్ల ఎగుమతులు కేటీర్ సమర్థ నాయకత్వం వలన సాధ్యపడిందని,…

Read More

శివ..శివా…ఎంత డబ్బు…

పవిత్ర పుణ్య క్షేత్రమైన కేదార్ నాథ్ లో ఓ మహిళా భక్తురాలికి నోట్ల పూనకం వచ్చినట్టుంది. బహుశా సంపన్నురాలై ఉంటుందేమో ఏకంగా గర్భ గుడిలో శివలింగం పై నోట్ల వర్షం కురిపించింది. పవిత్రమైన గర్భ గుడిలో నోట్లు వెదజల్లడం వివాదాస్పంగా మారింది. పదకొండవ జ్యోతిర్లింగంలో ఇలా జరగడం అపచారంగా భావిస్తున్నారు. కేదార్ నాథ్ గర్బగుడిలో ఫొటోలు, వీడియోలు తీయడం నిషేదం, అయిన, ఆ మహిళ నోట్లు జల్లడమే కాకుండా దాన్ని వీడియో కూడా తీయించుకోవడం పట్ల ఆలయ…

Read More