Logo site 9

ఆ ముగ్గురు ఎక్కడ…

గాజువాకలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో 12వ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు (జూన్ 24 శనివారం) నాలుగు రోజుల నుంచి కనిపించకుండా పోయారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వారు కాలేజీ నుంచి అదృశ్యమైనట్లు తెలుస్తోంది. వీరిలో పిల్లా దిలీప్, యు. దంతేశ్వర్ (బాబీ), గండ్రెడ్డి ఉమేష్ పవన్ ఉన్నట్టు సమాచారం. ఈ ముగ్గురు యువకులు చదువుపై శ్రద్ధ చూపించక పోవడంతో తల్లిదండ్రులు మందలించారని, ఈ క్రమంలో వారితో వాగ్వాదం జరిగినట్టు తెలుస్తోంది.పోలీసులు తెలిపిన…

Read More
jak ma

నేపాల్ లో “ఆలీబాబా”..

ఆలీబాబా గ్రూపు అధినేత, చైనా బిలియనీర్ జాక్ మా వ్యక్తిగత పర్యటనలో భాగంగా నేపాల్ వచ్చారు. ఢాకా మీదుగా వచ్చిన ప్రత్యెక విమానంలో అయన త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం కి చేరుకున్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్, నేపాల్ లు కేంద్రంగా పనిచేస్తున్న దార్జ్ అనే ఈ -కామర్స్ కంపెనీని ఇటివలే ఆలీబాబా సొంతం చేసుకుంది. నేపాల్ ప్రధాన మంత్రి పుష్పా కమల్ ధల్ తో అయన సమావేశమవుతారు.

Read More
pet land 1

ఇదెక్కడి న్యాయం…

ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారులు, నాయకులు, మంత్రుల  పొంతన లేని సమాధానాల వల్ల జర్నలిస్టులు రోడ్దేక్కే పరిస్థితికి దారి తీస్తోంది. ఇన్నేళ్ళు సుప్రీం కోర్టులో ఉన్న విచారణలను బూచిగా చూపిన వాళ్ళు కోర్టు తీర్పు వచ్చి పదినెలలు అవుతున్న దాని అమలుకు రోజుకో మాట చెప్పడాన్ని జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌజింగ్ సొసైటీ సభ్యులు తీవ్రంగా గర్హిస్తున్నారు. అంతేకాక, ప్రభుత్వ వైఖరి వల్ల సొసైటి సభ్యులు తమకు న్యాయం చేయించాలని రాజకీయ పార్టీలను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. హైదరాబాదు, ఢిల్లీలో…

Read More
nursing cf

ఎన్నికలు ఎందుకు జరపరు….

రాష్ట్రంలో మెడికల్ కౌన్సిల్ కు  ఎన్నికలు జరుపుతున్నట్టే  నర్సింగ్ కౌన్సిల్ కు కూడా ఎన్నికలను జరపాలని తెలంగాణ నర్సింగ్ సమితి  డిమాండ్ చేస్తోంది. నర్సింగ్ కౌన్సిల్ ఏర్పడి దాదాపు 52 సంవత్సరాలు అయినప్పటికీ ఒక్కసారి కూడా ఎన్నిజలు జరపకపోవడం పట్ల సమితి అసంతృప్తి వ్యక్తం చేసింది. కొందరు తమ స్వప్రయోజనాల కోసం కావాలనే ఎన్నికలను అడ్డుకుంటున్నారని వ్యాఖ్యానించింది.ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ ఏర్రోళ్ళ శ్రీనివాస్ కి వినతిపత్రం అందజేశారు. తెలంగాణ…

Read More
tdp

“నాలుగేళ్ల నరకం”

‘ “నాలుగేళ్ల నరకం” అనే పేరుతో తెలుగుదేశం పార్టీ కొత్త ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ మేర పార్టీ అధినేత చంద్రబాబు ట్విటర్ వేదికగా వీడియో రిలీజ్ చేశారు. రానున్న రోజుల్లో గల్లీ నుండి పట్టణాల వరకు ప్రజలకు జరిగిన అన్యాయాన్ని, వైసీపీ నాయకుల అక్రమాలను ఎత్తి చూపే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. గత నాలుగేళ్లుగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలియచేయడం ఈ “నాలుగేళ్ల నరకం”…

Read More

మహా ప్రమాదం….

అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సినీ నటి శ్రుతిశెట్టి, డి.జి.పి. అంజని కుమార్, నగర పోలీస్ కమిషనర్ సి.వి. ఆనంద్ తదితరులు.

Read More

ఉప్పల్ స్కైవాక్ …

ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద రూ.25 కోట్ల వ్యయంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) నిర్మించిన ఉప్పల్ స్కై వాక్ ప్రాజెక్టును పురపాలక శాఖ మంత్రి కె.టి.అర్. లాంచనంగా ప్రారంభించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు బాటసారి భద్రతకు ఉప్పల్ స్కైవాక్ ఎంతో దోహదపడుతుందన్నారు. తొలుత మినీ శిల్పారామం వద్ద రూ.10 కోట్ల హెచ్ఎండిఏ నిధులతో నిర్మించిన మల్టీ పర్పస్ హాల్ మంత్రి ప్రారంభించారు. ఆ తర్వాత ఉప్పల్ చౌరస్తాలో స్కైవాక్ శిలాఫలకాన్ని…

Read More
Screenshot 2023 06 25 231516

వర్మ “వ్యూహం”…

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవితం ఆధారంగా డైరెక్టర్ రాం గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న “వ్యూహం”  సినిమాకు సంబంధించిన  టీజర్ ను విడుదల చేశారు.

Read More

రైలులో రెయిన్ …

రైళ్ళు, బస్సుల్లో కిటికీల నుంచి వర్షపు నీళ్ళు లోనికి రావడం మామూలే.. కానీ పురి గుడిసెకు కన్నంపడినట్టు రైలు పైకప్పు నుంచి వర్షం ధారలు పడితే కొంచెం ఇబ్బందే. అలంటి రైలే అవంతిక ఎక్స్ ప్రెస్ . ముంబాయి నుంచి ఇండోర్ వెళ్ళే ఈ ఎక్స్ ప్రెస్ థర్డ్ ఎసి బోగీలో పైనుంచి వర్షపు నీళ్ళు కురవడతో ప్రయాణికులు తంటాలు పడ్డారు.

Read More
land board

నాకేమొద్దు…

రెండు సార్లు ఎం.ఎల్.ఎ.గా గెలిచినా వ్యక్తి గ్రామానికి చెందినా భూమిని కబ్జా చేయడం పెద్ద తప్పిదమే అని తన తండ్రి ఐన జనగాం సిట్టింగ్ ఎం.ఎల్.ఎ. ముత్తిరెడ్డి యాదగిరెడ్డి కుమార్తె తుల్జా భవాని రెడ్డి వ్యాఖ్యానించారు. చేర్యాల గ్రామంలో తన తండ్రి భూమిని కబ్జా చేసి తనకు తెలియకుండానే దాన్ని తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడని తెలిపారు. అసలు విషయం తెలిసిందని గ్రామానికి చెందాల్సిన భూమి తనకు అవసరం లేదని, దాన్ని తిరిగి చేర్యాల మునిసిపాలిటికే…

Read More

గౌడ భవనానికి …

గౌడ అత్మ గౌరవ భవనానికి హైదరాబాద్ లోని కోకాపేటలో భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమం లో రాష్ట్ర మంత్రులు డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యే లు ప్రకాష్ గౌడ్, వివేకానంద్ కలిసి పాల్గొన్నారు. గీత కార్మికులకు 12 కోట్ల 5 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా అందజేశారు. బి.సి. సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వేంకటేశం, ఎక్సైజ్ కమిషనర్ సర్పరాజ్ అహ్మద్, మాజీ శాసనమండలి ఛైర్మన్ స్వామి గౌడ్, మాజీ…

Read More

అక్కడ అసలేం జరుగుతోంది….

అమరావతిలోని వి.ఐ.టి. యూనివర్సిటీలో అసలు ఏం జరుగుతోందో బయటి ప్రపంచానికి తెలియడంలేదు. క్యాంపస్ లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయనే బలమైన ఆరోపణలు వస్తున్నా పట్టించుకునే దిక్కులేకుండా పోయింది. విద్యార్ధుల సమస్యలు పట్టించుకోకుండా అటు యునివర్సిటీ యాజమాన్యం, మరోవైపు పోలీసులు సైతం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీనికి క్యాంపస్ లో తాజాగా జరిగిన గొడవలే ఉదాహరణగా కనిపిస్తున్నాయి. పోలీసులకుగానీ, ప్రసార సాధనాలకు గానీ  సమాచారం చేరవేయలుకునే వారిని యాజమాన్యం బెదిరింపులకు పాల్పడుతున్నట్టు కొందరు విద్యర్ధుల ద్వారానే తెలుస్తోంది….

Read More
t shirt c

మోడికి టి.షర్టు

అమెరికా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి అక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో బైడేన్ ప్రత్యేకమైన టి.షర్టు ని బహుకరించారు. ఎర్రని రంగు షర్టు పై భవిష్యత్తు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ , అమెరికా, ఇండియా అని రాసి ఉంది. వేదిక పై మైక్రోసాఫ్ట్ సి.ఇ.ఒ. సత్య నాదెళ్ళ ఉన్నారు.

Read More