వసూళ్ళు ఎలా…
ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత జరిగిన 50వ జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర ఆర్ధిక,వైద్య శాఖ మంత్రి టి.హారీష్ రావు.
ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత జరిగిన 50వ జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర ఆర్ధిక,వైద్య శాఖ మంత్రి టి.హారీష్ రావు.
ఉత్తర ప్రదేశ్ ఘజియాబాద్ లో రాంగ్ రూట్ లో వచ్చిన ఓ స్కూల్ బస్సు ఎదురుగా వస్తున్న కారుని డి కొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందారు.అయితే, బస్సులో పిల్లలు లేకపోవడం గమనార్హం.
ప్రకాశం జిల్లా దర్శి లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి సాగర్ బ్రాంచి కాలువలో పడడంతో ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఆరుగురు మహిళలు, ఒక వృద్ధుడు ఉన్నారు. వీరంతా కాకినాడలో జరిగే ఓ శుభకార్యంలో పాల్గొనడానికి పొదిలి నుండి వెళ్తున్నట్లు తెలిపారు. ఒంగోలు డిపోకు చెందిన ఆర్టీసీ బస్ లో వీరంతా ప్రయాణిస్తున్నారు. చనిపోయిన వారిలో ఓ మైనర్ బాలిక కూడా ఉంది. బస్సులో మొత్తం…
ఆంధ్రప్రదేశ్ లో మానవ అక్రమ రవాణా ఎక్కువైందననీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థే మానవ అక్రమ రవాణాకు ప్రధాన కారణమని ఆరోపించడంతో మహిళలు భగ్గుమంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వాలంటీర్ల నుండి నిరసనలు వెల్లువెత్తుసున్నాయి. పవన్ కళ్యాణ్ ఆరోపణలపై స్పందించిన ఏపీ మహిళా కమిషన్ ఆయనకు నోటీసులు జారీ చేసింది. దీనిపై కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ పవన్ కల్యాణ్ క్షమాపణ చెప్పాలని…
జగిత్యాల జిల్లాలో పర్యటించిన ఎమ్మెల్సీ కవిత తిరుగు ప్రయాణంలో మల్యాల మండలం నూకపల్లి వద్ద రోడ్డు పక్కన మొక్కజొన్న కంకులు కాలుస్తున్న ఓ మహిళా దగ్గరికెళ్లి కంకులు కొనుగోలు చేసి అక్కడే రుచి చూశారు. రుచిని ఆస్వాధిస్తూ ఆమె వివరాలు సేకరించారు. కంకులు విక్రయించే మహిళ తన పేరు కొమురమ్మ అని తెలంగాణ వచ్చిన తర్వాత కెసిఆర్ పాలన గురించి వివరించింది. ఇంటింటికి పించన్ తదితర రూపాల్లో కేసీఆర్ మంచిగిస్తుండని కొమురమ్మ పేర్కొంది. స్వయంగా కేసీఆర్ కూతురే…
హిమాచల్ ప్రదేశ్ మండి జిల్లాలో భారీ వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. సోలాన్ ప్రాంతంలో 140 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. 50 ఏళ్లలో ఒకరోజులో నమోదైన అత్యధిక వర్షపాతం ఇదేనని పేర్కొన్నారు. బియాస్ నది ఉప్పొంగడంతో వరద ధాటికి ఇళ్లు, దుకాణాలు కొట్టుకుపోయాయి. ఇప్పటికీ భారీ వరదలు లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి. జాతీయ విపత్తు నివారణ బలగాలు రంగంలోకి దిగి లోతట్టు ప్రాంత ప్రజలకు సహకరిస్తున్నాయి.
రాష్ట్రంలోని పలు అభివృద్ధి పథకాలకు సంబంధించి కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న సమస్యలను త్వరగా పరిష్కరించాలని కోరుతూ న్యూ ఢిల్లీలోని పలువురు కేంద్ర కార్యదర్శులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కలసి విజ్ఞప్తి చేశారు. ఒక రోజు పర్యటన కోసం ఢిల్లీ వెళ్లిన సి.ఎస్, కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్ , కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ కార్యదర్శి లీలా నందన్, కేంద్ర రహదారులు, రవాణా, జాతీయ రహదారుల శాఖ కార్యదర్శి…
అమెరికా వ్యాప్తంగా ఏడాదిపాటు ఘనంగా నిర్వహించిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలపై రూపొందించిన సావనీర్ ను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆవిష్కరించారు. ఎన్ఆర్ఐ టీడీపీ యూఎస్ఏ కోఆర్డినేటర్ జయరాం కోమటి, గుంటూరు మిర్చియార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు ఈ సావనీర్ ను రూపొందించారు. ఈ ఉత్సవాలు భారతదేశానికే పరిమితం కాకుండా అమెరికా వ్యాప్తంగా అత్యంత వైభవోపేతంగా జరిగాయి. బోస్టన్ మహానగరం వేదికగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు 2022…
పన్ను చెల్లింపుదారులను దోచుకునే కార్యక్రమంలో భాగంగా ఉచిత పధకాలతో దేశ ఆర్ధిక వ్యవస్థను దిగజారుస్తున్నారని విమర్శిస్తూ, అందుకు నిరసనగా మెక్సికో పార్లమెంట్ లో ఇలా అర్ధ నగ్నంగా ప్రసంగిస్తున్న నాయకుడు.
సికింద్మరాబాద్ మహంకాళీ బోనలకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కుటుంబసమేతంగా హాజరయ్యారు. రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచాలని అమ్మవారిని కోరారు.
ఐఆర్ఎస్ అధికారి శామ్యూల్ ప్రసాద్ ఇంతో జరిగిన దొంగతనానికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంతున్న ఎస్సై కృష్ణ అజ్ఞాతంలోకి వెళ్లడంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ముషీరాబాద్ పోలీసులు ఈ కేసులో ఇప్పటికే ఆశీర్వాదం, శ్రీశైలం, సురేందర్ లను అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. కానీ A2 నిందితునిగా ఉన్న ఎస్సై కృష్ణ ఆచూకి తెలియకపోవడం పట్ల విచారణ తీరుపై సందేహాలు కలుగుతున్నాయి. కేసు నమోదు చేసి నెల రోజులు గడుస్తున్నా ఎస్సై కృష్ణను అరెస్టు చేయకపోవడం ఆరోపణలకుఫ్ దరితిస్తోంది….
ఉత్తరాఖండ్ లో కురుస్తున్న భారీ వర్షాలకు కొన్ని ప్రాంతాల్లో ప్రజాజీవన అతలాకుతలం అవుతోంది. వాగులు, నదులు పొంగి పొర్లుతున్నాయి. అనేక గ్రామాలకు రవాణా స్తంభించింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సును రామ్ఢ్ గ్రామంలో ఉప్పొంగి ప్రవహిస్తున్న నదిని దాటించేందుకు ప్రయత్నించగా వరద ఉద్ధృతి ఒక్కసారిగా పెరగడంతో బస్సు ఒకవైపు ఒరిగిపోయింది. అప్రమత్తమైన ప్రయాణికులు బస్సు కిటికీల్లోంచి దూకి ప్రాణాలను రక్షించుకున్నారు. అనంతరం పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణాపాయం జరగక పోవడంతో ఉపిరి…
హిమాచల్ ప్రదేశ్ లోని బియాస్ నది తీరాన మరో ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా వరద రావడంతో నది ఒడ్డున ఉన్న దుకాణాలు కొట్టుకుపోయాయి.
మహంకాళి అమ్మవారికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులు తొలిబోనం సమర్పించారు. ఆలయ పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం మంత్రి అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు.
ఈ అధికారి గురించి తెలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. ఏదో సినిమాల్లో వినోదం కోసం రచయితలు పాత్రలను సృష్టిస్తారు. అది అంతవరకే పరిమితం. కానీ, అలాంటి కధలనే స్ఫూర్తిగా తీసుకుందో ఏమో ఈ మహిళా పోలీస్ ఏకంగా మాయల ముఠాకే నాయకురాలైంది. అదీ ఎక్కడో కాదు, సాగరతీరం విశాఖ పట్నంలో అంటే ఆశ్చర్యం కలుగుతుంది. యూనిఫామ్ ముసుగేసుకొని కొంత కాలంగా రకరకాల దండాలకు పాల్పడుతున్న ఆమె బండారం బయటపడింది. ఏకంగా ఓ దోపిడీ ముఠానే నడుపుతున్నట్లుగా వెల్లడైంది. ఈమె…