station

స్టేషన్ లోనే శవం…

పోలీస్ స్టేషన్ లో శవం బయట పడి కలకలం రేపింది. నిత్యం రద్దీగా ఉండే పోలీస్ స్టేషన్ లోనే శవం ఏంటి అనే సందేహం రావొచ్చు. కానీ ఇది నిజం. ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లా పుత్తూరు అర్బన్పోలీసు స్టేషన్ లో ఈ సంఘటన చోటుచేసుకుంది. స్టేషన్ ఆవరణలో ఫిర్యాదుదారుల కోసం నిర్మించిన టాయిలెట్ లో శవం కనిపించే సరికి సిబ్భంది ఒక్కసారిగా విస్తుపోయారు. ఆ వ్యక్తి చనిపోయి మూడు రోజులై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. వ్యక్తి…

Read More
Screenshot 2023 07 24 161235

భలే అడ్డా..వేస్కో..

పట్ట పగలు…అత్యంత రద్దీ ప్రాంతం… నిత్యం వేల కొద్ది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ట్రాఫిక్ ని అదుపు చేయడానికి పోలీసులు సతమతమయ్యే ప్రదేశం భాగ్యనగరంలోని హైటెక్ సిటీ జంక్షన్. ఆ సెంటర్ ని పోకిరిలు తాగడానికి అడ్డగా మార్చుకున్నారు. ఏ డివైడర్ పక్కనో, గల్లీ లోనో కాదు ఏకంగా పోలీసులు విధులు నిర్వర్తించే ట్రాఫిక్ బూత్ లోనే కావడం గమనార్హం. ఆ బూత్ నే అడ్డాగా మార్చుకొని ఇద్దరూ వ్యక్తులు కూర్చొని మద్యం తాగుతూ బిర్యానీ తింటున్న…

Read More
jb acp

కొత్త ఎ.సి.పి.లు…

హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని జూబ్లీ హిల్స్ డివిజన్ కొత్త ఏసిపిగా కె.హరిప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. అదేవిధంగా రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఎల్బీనగర్ డివిజన్ ఏసిపిగా జానకి రెడ్డి బాధ్యతలను స్వీకరించారు. బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా ప్రత్యేక చొరవ తీసుకుంటామని కొత్త ఏసిపి తెలిపారు.

Read More
cc c

“ఈగల్”ఐ…

హైదరాబాద్ లోని బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ల పరిదిలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను నగర పోలీస్ కమిషనర్ సివి  ఆనంద్ ప్రారంభించారు. అనంతరం ఆయన కెమెరాల ఏర్పాటుకు సహకరించిన దతలతో చర్చించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ జోయల్ డేవిస్, ఎసిపి, పలువురు ఇన్ స్పెక్టర్లు పాల్గొన్నారు.

Read More
hijra

ఏయ్…

మిర్యాలగూడలో హిజ్రాలు హాల్ చల్ చేశారు. అదీ ఎక్కడో కాదు సాక్షాత్తూ పోలీస్ స్టేషన్ లోనే జరగడం విశేషం. హిజ్రాల పరస్పర ఘర్షణలు, కొట్లాటలతో స్టేషన్ ఆవరణ హోరెత్తింది.వివరాల్లోకి వెళ్తే, పట్టణంలో ఆధిపత్య పోరులో భాగంగా ఓ వర్గం హిజ్రాలు పోలీసులను ఆశ్రయించారు. అయితే, ఈ విషయం తెలుసుకున్న మరో వర్గం స్టేషన్‌కు చేరుకుంది. రెండు వర్గాలు ఎదురెదురు పడటంతో తీవ్ర వాగ్వివాదం జరిగింది. పోలీస్‌ స్టేషన్‌లోనే హిజ్రాలు రెచ్చిపోయారు. రెండు గ్రూప్‌లుగా విడిపోయి తీవ్రంగా కొట్టుకున్నారు….

Read More

ఎక్కడ కృష్ణా….

ఐఆర్ఎస్ అధికారి శామ్యూల్ ప్రసాద్ ఇంతో జరిగిన దొంగతనానికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంతున్న ఎస్సై కృష్ణ అజ్ఞాతంలోకి వెళ్లడంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ముషీరాబాద్ పోలీసులు ఈ కేసులో ఇప్పటికే ఆశీర్వాదం, శ్రీశైలం, సురేందర్ లను అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. కానీ A2 నిందితునిగా ఉన్న ఎస్సై కృష్ణ ఆచూకి తెలియకపోవడం పట్ల విచారణ తీరుపై సందేహాలు కలుగుతున్నాయి. కేసు నమోదు చేసి నెల రోజులు గడుస్తున్నా ఎస్సై కృష్ణను అరెస్టు చేయకపోవడం ఆరోపణలకుఫ్ దరితిస్తోంది….

Read More

మీరే చేయాలి…

దేశ అభివృద్ధిలో యువత గొప్ప పాత్ర పోషిస్తుందని, దేశ పురోగమనంతో పాటు  సామాజిక సంస్కరణలను తీసుకురావడంలో యువతదే  ప్రధాన పాత్రని డీజీపీ అంజనీ కుమార్ అన్నారు. అక్షయ విద్య  స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో డీజీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో నగరంలోని పలు బస్తీలకు చెందిన 80 మంది  నిరుపేద విద్యార్థినీ, విద్యార్థులకు లాప్ టాప్ లను  డీజీపీ అందచేశారు. ఈ సందర్బంగా డీజీపీ మాట్లాడుతూ, కస్టపడి చదువుకున్న యువత తమ బస్తీలలో ప్రాంతాల్లో చేడు మార్గాలలో పయనిస్తున్న…

Read More

నువ్వు అలా చేస్తే… నేను ఇలా..

సంగారెడ్డి జిల్లా ఐడిఎ బొల్లారం లో ఓ పాస్టర్ బండారం బయట పడింది. పరాయి మహిళలతో వ్యవహారం నడుపుతున్న పాస్టర్ జయరాజ్ ను అయన భార్య రెడ్ హ్యాండ్ గా పట్టుకుంది. ప్రతి రోజు చర్చిలో, క్రిస్టియన్ సోదరుల ఇంట్లో ప్రార్ధనలు చేసే ఈ పాస్టర్ వంకర చూపులు చూడడం పై ఎప్పటి నుంచో విమర్శలు వస్తున్నాయి. ఇదే విషయం పై నిఘా పెట్టిన ఆయన భార్య అక్రమ సంబంధాన్ని బట్టబయలు చేసింది. బురఖా ధరించి మారు…

Read More

తప్పు కదా….

నిబంధనలకు విరుద్ధంగా జూనియర్‌ అసిస్టెంట్‌ను ఉద్యోగంలో నుంచి తొలగించిన వ్యవహారంలో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు నవీన్‌ మిత్తల్‌, వాకాటి కరుణతో పాటు ఇంకొందరు అధికారులకు కోర్టు ధిక్కరణ కింద హైకోర్టు శిక్ష విధించింది. ఒక్కొక్కరు రూ.10 వేల చొప్పున జరిమానా చెల్లించాలని,  ఆ మొత్తాన్ని  4 వారాల్లో చెల్లించకుంటే  నెల రోజుల సాధారణ  జైలుశిక్ష అనుభవించాలని ఆదేశించింది. ఐఏఎస్‌ల తో పాటు . కళాశాల విద్య ప్రాంతీయ సంయుక్త సంచాలకుడు జి.యాదగిరి, కల్వకుర్తి ప్రభుత్వ మోడల్‌ డిగ్రీ…

Read More
modi paspor

ప్రధాని ఇంటిపై డ్రోన్…

న్యూ దిల్లీలో నో ఫ్లై జోన్ పరిధిలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నివాసం పై డ్రోన్ కలకలం రేపింది. దీని పై ఎస్ పి జి అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోంది.

Read More

కత్తులతో “రాక్” డాన్స్…

బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 14 లోని రాక్ క్లబ్  స్కైలాంజిలో కొందరు యువకులు డాన్సింగ్ ఫ్లోర్ పై  కత్తులు తిప్పుతూ నృత్యాలు చేశారు. పార్టీ కి వచ్చినవారు  భయంతో వణికిపోయారు.

Read More

ఎంత ఘోరం…

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. బుల్దానాలోని ఎక్స్‌ప్రెస్‌ వే పై వెళ్తున్న ఓ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 26 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 32 మంది ప్రయాణికులతో యావత్మాల్​ నుంచి పుణెకు వెళ్తుండగా శనివారం వేకువజామున 2 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మంటలు వ్యాప్తికి  బస్సు పూర్తిగా కాలి బూడిదైంది. క్షతగాత్రులను బుల్దానా…

Read More

“రా” కి కొత్త గూడచారి…

భారత  భద్రతకు సంబంధించిన ప్రతిష్టాత్మక గూడచార సంస్థ అయిన రీసెర్చ్‌ అండ్‌ అనాలిసిస్‌ వింగ్‌ (“రా”) చీఫ్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి రవి సిన్హా నియమితులయ్యారు. రవి నియామకాన్ని  మంత్రి మండలి నియామకాల కమిటి ఆమోదించింది. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1989 ఐపీఎస్ బ్యాచ్, ఛత్తీస్ ఘడ్ క్యాడర్ కు చెందిన రవి సిన్హా ప్రస్తుతం “రా”లో రెండో సీనియర్…

Read More

కేసుల ఎత్తివేత ….

పౌర హక్కుల నేత ప్రొఫెసర్‌ హరగోపాల్‌ సహా ఇతరులపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(ఉపా) కింద నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. వెంటనే కేసుల ఎత్తివేతకు తగు చర్యలు తీసుకోవాలని డీజీపీ అంజనీకుమార్‌ను సీఎం ఆదేశించారు. మావోయిస్టు కార్యకలాపాలకు సహకరిస్తున్నారన్న ఆరోపణలపై హరగోపాల్‌తో పాటు ఇతర ప్రజాసంఘాల నేతలపై ఉపా చట్టం కింద తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎలాంటి తప్పు చేయకపోయినా, ఆధారాలు లేకుండా ఉపా చట్టం…

Read More