israil cf

మళ్లీ మొదలైంది…

కొంత కాలంగా స్తబ్దంగా ఉన్న ఇజ్రాయెల్‌ దేశంలో మళ్లీ ఉగ్ర మంటలు చెలరేగాయి. పాలస్తీనాకు చెందిన ఇస్లామిస్ట్ గ్రూపు హమాజ్‌ దక్షిణ ఇజ్రాయిల్‌లోకి చొరబడి ఇష్టానుసారంగా పౌరులపైకి  రాకెట్లను ప్రయోగించింది. దీంతో ఇజ్రాయిల్‌, పాలస్తీనాల మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి.  గాజా స్ట్రిప్‌ ప్రాంతం నుంచి ఇజ్రాయెల్‌ వైపునకు పెద్ద ఎత్తున మిస్సైల్స్‌ దాడులు జరిగాయి. దీంతో అప్రమత్తమైన ఇజ్రాయెల్‌ సైన్యం గాజా సరిహద్దులో ఎమర్జెన్సీ ప్రకటించింది. గాజా, గ్రేటర్‌ టెల్‌ అవీవ్‌ ప్రాంతం నుంచి పెద్ద…

Read More
IMG 20231007 WA0022 1

ఇక మంచి రోజులే…

భారత దేశంలో మహిళా రిజర్వేషన్ల చట్టం వల్ల భవిష్యత్తులో మహిళలకు మంచి రోజులు వస్తాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. చట్టసభల్లోకి మరింత మంది మహిళలు ప్రవేశించడానికి మార్గం చూపే విప్లవాత్మక బిల్లును భారత్ ఆమోదించిందని చెప్పారు. ప్రస్తుతం భారత పార్లమెంటులో 78 మంది మహిళా ఎంపీలుగా ఉన్నారని, మహిళా రిజర్వేషన్లతో ఆ సంఖ్య 181కు చేరుతుందన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటుకు తీసుకు రావడంలో 1996లో దేవే గౌడ ప్రభుత్వం, 2010లో సోనియా గాంధీ,…

Read More
IMG 20231002 WA0029

ఎవరితో…ఎక్కడ…

ప్రపంచ కప్ క్రికెట్ దగ్గర పడింది. ఈ నెల 5వ తేదీ నుంచి నవంబర్ 19 వరకు క్రికెట్ పండగే. దేశంలోని వివిధ నగరాల్లో జరిగే ఈ ఆట కోసం ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ ఒక్కరూ వేచి చూస్తున్నారు. ఏ దేశపు జట్టు ఎక్కడ ఎవరితో తలబడుతుందో తెలిపే టేబుల్ ఇది.

Read More
IMG 20230908 WA0020

అతిధులతో మోదీ…

రెండు రోజుల పాటు జరిగే జి -20 సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానులు, అతిధులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన నివాసంలో సాదర స్వాగతం పలికారు. అనంతరం వారు బస చేసే హోటళ్లకు వెళ్లారు.

Read More
g 20

ముస్తాబైన రాజధాని…

జీ.20 శిఖరాగ్ర సమావేశాలకు దేశ రాజధాని డిల్లీ సర్వాంగసుందరంగా ముస్తాబైంది. ఈ 18 వ జీ.20 సదస్సుకు ఆతిధ్యం ఇస్తున్న భారత్ అతిధుల కోసం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రగతి మైదానంలోని భారత్ అంతర్జాతీయ ప్రదర్శన సమావేశ మందిరం (ఐ.ఇ.సి.సి.)లో శని, ఆదివారాలలో ఈ సమావేశాలు జరుగుతాయి. ఇప్పటికే అంతర్జాతీయ ప్రతినిధుల రాకతో రాజధాని కళకళలాడుతోంది. ఈ రాత్రికి అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దిల్లికి చేరుకుంటారు. కేంద్ర విదేశాంగ శాఖ…

Read More
japan c

జపాన్ ప్రయత్నం…

జపాన్ కూడా అంతరిక్ష పరిశోధనలో తన సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది. ఈ దేశం కూడా చంద్రునిపై సాఫ్ట్ లాండింగ్ దిశగా అడుగులు వేస్తోంది.  ఇందులో భాగంగా స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వేస్టిగేటింగ్ మూన్ (ఎస్.ల్.ఐ.ఎం.) అనే అంతరిక్ష నౌక చంద్రుడిపైకి దూసుకెళ్లింది. జాక్సా ట నేగషిమా స్పేస్ సెంటర్ నుంచి గురువారం తెల్లవారుజామున 5:12 గంటలకు హెచ్2-ఎ. రాకెట్ ఈ నౌకను నింగిలోకి మోసుకెళ్లింది. ఈ ప్రయోగం సఫలమైతే జాబిల్లిపై ల్యాండర్ ను  సాఫ్ట్ ల్యాండ్ చేసిన…

Read More
IMG 20230905 WA0003

మళ్ళీ ఎగిరిన “విక్రమ్”…

భారత అంతరిక్ష పరిశోధనసంస్థ (ఇస్రో) చేపట్టిన చంద్రయాన్-3 ఊహించని అద్భుతాలను చూపిస్తోంది. చంద్రునిదక్షిణ ధృవం మీద విక్రమ్ కలుమోపడమే చరిత్ర ఐతే, అది గలిలో ఎగిరి ఒక చోటు నుంచి మరో చోటుకి గాలిలో ఎగిరి ప్రయాణించడం ఓ అద్భతమైన ఆవిష్కరణ. చంద్రుడి దక్షిణ ధృవం మీద ఉన్న ప్రగ్యాన్ రోవర్ నిద్రలోకి వెళ్లింది. ఆ తర్వాత విక్రమ్ ల్యాండర్ ను ఇస్రో శాస్త్రవేతలు విజయవంతంగా గాలిలోకి లేపారు. విక్రమ్ ల్యాండర్లో ఉన్న ఇంధనాన్ని మండించటం ద్వారా…

Read More
Screenshot 20230903 173609 Gallery

“గిన్నిస్”కెక్కిన సవ్వడి..

కేరళలో ఓనమ్ పండుగ సందర్భంగా 7000 మంది కళాకారులతో నిర్వహించిన నృత్య కార్యక్రమం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ నృత్యం గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాధించడం విశేషం.

Read More
adhitya

అగ్ని గోళం వైపు..

రోదసీలో అత్యంత క్లిష్టమైన చంద్రయాన్ -3 ప్రాజెక్టును విజయవంతంగా ముందుకు తీసుకు వెళ్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఒక్కో అడుగు ముందుకు వేస్తోంది. తాజాగా సూర్యునిపై పరిశోధనల కోసం నడుం బిగించింది. సూర్యుడిపై పరిశోధనలకు ఇస్రో చేపట్టిన ఆదిత్య ఎల్-1 ఉపగ్రహం నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహరికోటలో 24 గంటల కౌంట్ డౌన్ పూర్తి చేసుకున్న పీఎస్ఎల్వి-సి 57 రాకెట్ ఆధిత్యను తీసుకుని కక్ష్య దిశగా ప్రయాణిస్తోంది. 4 నెలల్లో భూమి నుంచి 15 లక్షల…

Read More
iniss

ఆకాశంలో “ఇస్రో” సొంత ఇల్లు…

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో చారిత్రక ప్రయోగానికి శ్రీకారం చుట్టనుంది. వినువీధిలో పరిశోధనల కోసం  “సొంత ఇల్లు” కట్టడానికి సన్నాహాలు చేస్తోంది. మరో ఏడేళ్ళలో అంటే 2030 సంవత్సరానికి ఇస్రో పూర్తీ స్థాయి దేశీయ పరిజ్ఞానంతో స్పేస్ స్టేషన్ నిర్మించనున్నట్టు వెల్లడించింది. ఈ స్టేషన్ లో వ్యామోగాములు సుమారు 15 నుంచి 20 రోజు పాటు ఉంటూ పరిశోధనలు జరపొచ్చని వివరించింది. భూమికి నలుగు వందల కిలోమీటర్ల ఎత్తులో ఈ స్పేస్ స్టేషన్ ఉంటుంది.

Read More
lander in

గుట్టు తేలుతోంది..

చంద్రగ్రహం దక్షిణ దిక్కున చంద్రయాన్ -3 పరిశోధనలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. రోవర్ లోని లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్ డౌన్ స్పెక్ట్రోస్కోప్(ఎల్.ఐ.బి.ఎస్.) చంద్రుని దక్షిణ ధ్రువం వద్ద సల్ఫర్ ఉనికిని తొలిసారి గుర్తించినట్లు తెలిపింది. ప్రజ్ఞాన్ రోవర్ పలు రకాల మూలక మిశ్రమాలను గుర్తించింది. జాబిల్లి పై ప్రాణ వాయువు ఆక్సిజన్‌ తోపాటు సల్పర్ ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించిందని ఇస్రో ప్రకటించింది. అంతేకాక అల్యూమినియం, కాల్షియం, ఐరన్, క్రోమియం, టైటానియం, మాంగనీస్, సిలికాన్ కూడా ఉన్నట్లు తెలిపింది. రోవర్…

Read More
sun

“బాబాయ్” నిన్నూ వదల…

చంద్రయాన్-౩ని విజయవంతంగా ముందుకు తీసుకువెళ్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తన దృషిని ఇప్పుడు ఏకంగా సూర్యుని పైకి సారించింది. వచ్చే నెల రెండోన మిషన్ సన్ “ఆధిత్య” పేరుతొ మరో ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. ఆ రోజు ఉదయం 11.50 గంటలకు ఆదిత్య ఆకాశంలోకి దూసుకుపోనున్నట్టు ఇస్రో తెలిపింది. ఆధిత్య –ఎల్1  భూమికి సుమారు 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణిస్తుందని, ఇది చంద్రుని పైకి పంపిన దానికంటే నలుగు రెట్లు అధికమని,…

Read More
IMG 20230826 WA0003

చంద్రునిపై చక్కర్లు…

మూడు రోజుల కిందట చంద్రునిపై కాలు మోపిన విక్రమ్‌ ల్యాండర్‌ నుంచి బయటికి వచ్చిన రోవర్‌ ప్రజ్ఞాన్‌ అది బయటకు వచ్చిన ప్రాంతం నుంచి 8 మీటర్ల దూరం వరకు ప్రయాణించి పరిశోధనలు ప్రారంభించింది. ఈ మేరకు రోవర్ సమర్థవంంగా పని చేస్తోందని ఇస్రో వెల్లడించింది.

Read More
IMG 20230825 WA0006

జైలుకి ట్రంప్…

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌  చరిత్ర సృష్టించారు. ఎన్నికల్లో జోక్యం చేసుకున్నారనే  ఆరోపణల్లో ఆయన జార్జియాలోని ఫుల్టన్‌ కౌంటీ జైలుకు వెళ్లి లొంగిపోయారు. ఆ దేశ చరిత్రలో మగ్‌షాట్‌ తీయించుకొన్న తొలి మాజీ అధ్యక్షుడిగా నిలిచారు. ఆయనకు ఖైదీ నంబర్‌  పి.01135809 కేటాయించారు. ఈ సందర్భంగా పోలీసు రికార్డుల కోసం ఆయన ఫొటో (మగ్‌షాట్‌) కూడా తీశారు. ఆయనపై డజనుకు పైగా ఆరోపణలున్నాయి.పోలీసులు నమోదు చేసిన రికార్డుల ప్రకారం ట్రంప్‌ ఎత్తు 6.3 అడుగులు. 97…

Read More