ఛత్తీస్ ఘడ్ లో మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారిని రానూ సాహు ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఇ.డి.) అధికారులు అరెస్టు చేశారు. బొగ్గు గనుల కేటాయింపులో జరిగిన అక్రమాల్లో సాహు సహా పలువురు అధికారుల పై విచారణ జరిపిన అధికారులు శనివారం నాడు వారికి సంబంధించిన 18 ప్రాంతాల్లో ఏక కాలంలో దాడులు నిర్వహించారు. అనంతరం రానూ సాహుని అరెస్టు చేసినట్టు అధికారులు తెలిపారు. ఆమెను కోర్టులో హాజరుపరచగా 3 రోజుల ఇ.డి. కస్టడి కి అనుమతించారు.