హైదరాబాద్ నగర శివార్లలోని ఆటో నగర్ హ్యుందాయ్ షోరూం లో విషాదం చోటుచేసుకుంది. షోరూంలోని వాహన సర్వీసింగ్ విభాగంలో కారు రిపేర్ చేస్తూ గుండెపోటుతో కుప్పకూలిన ఓ మెకానిక్ అక్కడిక్కడే మృతి చెందాడు. అబ్దుల్లాపూర్ మెట్టు మండలం కొహెడకు చెందిన జంగారెడ్డి (36) ప్రతిరోజూ మాదిరిగానే షోరూంకి వచ్చి వాహనాల మెకానిక్ పనులు మొదలుపెట్టాడు. ఇందులో భాగంగా ఓ వాహనాన్ని పరిశీలిస్తున్న జంగారెడ్డి అకస్మాత్తుగా కిందపడిపోయి కాసేపటికి చనిపోయాడు. ఒక్కసారిగా తీవ్రమైన గుండె నొప్పికి గురికావడం వల్ల ఇలా జరిగిందని వైద్యులు తెపిపారు.