ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి కొత్త కార్యక్రమానికి రంగం సిద్దం చేస్తున్నారు. గత ఎన్నికలకు ముందు ఓదార్పు, ప్రజా సంకల్ప యాత్రల పేరుతో జనంలోకి వెళ్ళిన అయన ఈ 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. అయితే , ఈ సారి రాబోయే ఎన్నికల్లో జనంలోకి వెళ్లేందుకు అయన కొత్త పందాని అవలంభిచనున్నారు. వైసిపి అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడిచిన నేపథ్యంలో ప్రభుత్వ కార్యక్రమాలను చూపుతూ ప్రజా ఆశీర్వాద యాత్రను ప్రారంభించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.గత ఎన్నికల్లో 151 సీట్లు గెలుచుకున్న పార్టీ ఈసారి 175 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు పార్టీ వర్గాల భోగట్టా.చంద్రబాబు నాయుడు జైలులో ఉండడం, అటు పవణ్ కళ్యాణ్ టిడిపితో పొత్తు ప్రస్తావన చేయడం, లోకేష్ మరోసారి రోడ్ షోలకు సిద్దం కావడం ఆంధ్రా రాజకీయాల్లో వేడి పెంచుతోంది. చంద్రబాబు నాయుడు అరెస్టుతో విపక్షం బలంగా ఉండడంతో అధికార పక్షం దీన్ని ఎదుర్కొని, వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గేమ్‌ప్లాన్‌ను రూపొందించే యోచనలో ఉన్నట్లు సమాచారం. వైఎస్సార్‌సీపీ అధినేత కోసం మరో భారీ యాత్ర ఖాయం అనే వార్తలు గుప్పుమంటున్నాయి.పవన్, లోకేష్ రోడ్ షోలు, జగన్ పాదయాత్రలు వెరసి చంద్రబాబు అరెస్ట్ ఫలితం వచ్చే ఎన్నికలలో ఎలా ఉంటుందనేది సామాన్య ప్రజల్లో ఉన్న ఆసక్తి.