దేశానికి నరేంద్ర మోడీ ఇంకోసారి ప్రధానమంత్రి కావలసిన ఆవశ్యకత ఉందని, ముచ్చటగా మూడోసారి మోడీ ప్రధాని కావాలని ఆకాంక్షిస్తున్నట్టు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడారు. ఈ నెల 7వ తేదీన హైదరాబాద్ లో బీజేపీ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొనాలని ఆహ్వానం అందినట్టు తెలిపారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ “ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా ఉన్న జనసేన పార్టీ జీహెచ్ఏంసీ ఎన్నికల్లో ఎంతో సహకరించినదుకు పవన్ కల్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ అసెంబ్లీ ఎన్నికలు ఎంతో కీలకమైనవని, తెలంగాణకు డబుల్ ఇంజన్ సర్కార్ అవసరం ఉందని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. జనసేనతో సీట్ల సర్దుబాటు చర్చలు ఒక కొలిక్కి రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ నెల 7వ తేదీన ఎల్బీ స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొంటారని, ఈ సభకు బిజెపి తరఫున పవన్ కల్యాణ్ ఆహ్వానించినట్టు చెప్పారు. డా.లక్ష్మణ్ మాట్లాడుతూ “తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి డబుల్ ఇంజన్ సర్కార్ అవసరం ఉందని, ఈ దేశానికి మరోసారి మోడీ ప్రధాన మంత్రి కావల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు.
మళ్ళీ“మోడీ”రావాలి…!
